News


సూచీల రికార్డు ముగింపు

Wednesday 27th November 2019
Markets_main1574851071.png-29903

  • 41వేల పైన ముగిసిన సెన్సెక్స్‌
  • 12100 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
  • రాణించిన బ్యాంకింగ్‌, అటో, మెటల్‌ షేర్ల ర్యాలీ

చివరి గంటలో బ్యాంకింగ్‌, అటో, మెటల్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం సూచీలు రికార్డు ముగింపును నమోదుచేశాయి. సెన్సెక్స్‌ 199 పాయింట్ల లాభపడి 41000 పైన 41,020.61 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 12,100 వద్ద ముగిసింది. ఇంతటి స్థాయిలో  సూచీలు ముగియడం ఇదే ప్రధమం.  ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ జీవితకాల గరిష్టస్థాయిని చేరడంతో పాటు అరశాతం లాభంతో 31,875.95 పాయింట్ల రికార్డుస్థాయి వద్ద ముగిసింది. మీడియా, రియల్టీ రంగ షేర్లు అ‍మ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మిగిలిన అన్ని రంగాలకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికం‍గా పీఎస్‌యూ బ్యాంకులు పెరిగాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా అడుగులు పడుతుండటం, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతవరణం, దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ క్రమంగా బలపడటం తదితర కారణాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చున్న దేశీయ సూచీలు నేడు లాభంతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 158 పాయింట్లు పెరిగి 40979 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 12068 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నటి ట్రేడింగ్‌లో సూచీలు ఆల్‌టైం గరిష్టస్థాయిలను తాకిన నేపథ్యంలో... నేడు ట్రేడర్లు తొలుత మరోసారి లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. మరోవైపు రేపు(గురువారం) ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్‌సెషన్‌ నుంచి అటో, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా సూచీలు తిరిగి లాభాల్ని ఆర్జించడటం మొదలుపెట్టాయి. ట్రేడింగ్‌కు గంట సమయానికి ముందు కొనుగోళ్లు ఉధృతం కావడంతో సూచీల లాభాలు మరింత పెరిగి రోజులో గరిష్టం వద్ద ముగిశాయి. 

హిందాల్కో, మారుతీ, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 8.50శాతం పెరిగాయి. ఐసీఐసీ బ్యాంక్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, సిప్లా, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 0.75శాతం నుంచి 3.50శాతం వరకు నష్టపోయాయిYou may be interested

ఈక్విటీ ఫండ్స్‌కు మళ్లీ పూర్వ వైభవం!

Wednesday 27th November 2019

ఈక్విటీ మార్కెట్లు అంటేనే పడి లేచే కెరటాలు. కొంత కాలం పాటు ర్యాలీ, తర్వాత కరెక్షన్‌, మళ్లీ ర్యాలీ ఇటువంటివి సహజమే. ఈక్విటీ ఇన్వెస్టర్లు కూడా ఈ విషయాన్ని బాగానే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం (జూలై-సెప్టెంబర్‌)లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.24,000 కోట్లుగా ఉన్నాయి. క్యూ2 సమయంలోనే మార్కెట్లో భారీగా పడిపోవడం, ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఎఫ్‌పీఐలపై

రాబోయే రోజులు చిన్నస్టాకులవే!

Wednesday 27th November 2019

కోటక్‌ ఏఎంసీ సీఐఓ హర్ష ఉపాధ్యాయ వచ్చే రెండేళ్లలో పెద్ద స్టాకులతో పోలిస్తే చిన్న స్టాకులు, డైవర్సిఫైడ్‌ ఫండ్స్‌ ఎక్కువ రాబడినిచ్చే ఛాన్సులున్నాయని కోటక్‌ ఏఎంసీ సీఐఓ హర్ష ఉపాధ్యాయ అంచనా వేశారు. ఎకానమీ తిరోగమనంలో ఉంటే లార్జ్‌క్యాప్స్‌ గరిష్ఠాల వద్ద ఉన్నాయని చెప్పారు. కానీ స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు మాత్రం ఇంకా తమ ఆల్‌టైమ్‌ హైలకు చాలా దిగువనే ఉన్నాయని తెలిపారు. ఎకానమీలో కనిపించే మందగమనమే విస్తృత స్థాయి మార్కెట్లో

Most from this category