News


యస్‌ బ్యాంకుకు షాకిచ్చిన మూడిస్‌

Thursday 5th December 2019
Markets_main1575569367.png-30079

కీలకమైన నిధుల సమీకరణకు ముందు యస్‌ బ్యాంకు రేటింగ్‌ను డౌన్‌ గ్రేడ్‌ చేస్తూ అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ‘మూడిస్‌’ షాకింగ్‌ నిర్ణయాన్ని వెలువరించింది. యస్‌బ్యాంకు దీర్ఘకాలిక ఫారీన్‌ కరెన్సీ ఇష్యూయర్‌ రేటింగ్‌ను బీఏ3 నుంచి బీ2కు తగ్గించడంతోపాటు, నెగెటివ్‌ అవుట్‌లుక్‌ ఇచ్చింది. వాస్తవానికి యస్‌ బ్యాంకు రేటింగ్‌ తగ్గించే అవకాశం ఉందని గత నెల 6వ తేదీనే మూడిస్‌ హెచ్చరించడం గమనార్హం. ఆస్తుల నాణ్యత ఆందోళనలు, బ్యాంకు నిధులు అడుగంటిపోతుండడం రిస్క్‌లుగా పేర్కొంది. 2 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ప్రతిపాదనలు అందుకున్నట్టు బ్యాంకు చేసిన ప్రకటన.. ధర, సమయం, నియంత్రణ సంస్థల ఆమోదం పరంగా ఎంతో రిస్క్‌తో కూడుకుని ఉందని తెలిపింది. ఈ నిధుల సమీకరణ కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

 

యస్‌ బ్యాంకు బోర్డు ఈ నెల 10న భేటీ అయి నిధుల సమీకరణ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత ఆర్‌బీఐ ఆమోదం అవసరం అవుతుంది. ఎందుకంటే ఇందులో విదేశీ ఇన్వెస్టర్ల వ్యూహాత్మక పెట్టుబడుల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. బ్యాంకు ఒత్తిడి రుణాల మొత్తం, వీటికి సంబంధించి సర్దుబాటు చేసేందుకు నిధులు తక్కువగా ఉండడం.. బ్యాంకు నిధుల సమీకరణ, లిక్విడిటీపై మరిన్ని ఆందోళనలు పెంచుతున్నాయని మూడిస్‌ తెలిపింది. బ్యాంకు టైర్‌-1 ఈక్విటీ రేషియో సెప్టెంబర్‌ నాటికి 8.7 శాతంగా ఉందని, ఇది 7 శాతానికి తగ్గిపోయే ప్రమాదం ఉందని, ఒకవేళ తాజా నిధులు పొందలేకపోతే ఎంతో ఒత్తిడికి దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. ఇతర ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే యస్‌ బ్యాంకు నిధులు, లిక్విడిటీ బలహీనంగా ఉండడంతో, రానున్న త్రైమాసికాల్లో సాల్వెన్సీని మెరుగుపరుచుకోకపోతే కష్టమేనని పేర్కొంది. నెగెటివ్‌ అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్‌ చేసే అవకాశాలు తక్కువేనని స్పష్టం చేసింది. You may be interested

ఈ సారికి... ఏమీ లేదు!!

Friday 6th December 2019

(అప్‌డేటెడ్‌...) రెపో, రివర్స్‌ రెపో రేట్లు యథాతథం తాత్కాలిక విరామం ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్ణయం ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఆందోళనలే కారణం జీడీపీ వృద్ధి అంచనాలు 5 శాతానికి తగ్గింపు మున్ముందు పరిస్థితులు మెరుగుపడితే చూస్తాం మందగమనం పోయిందని ఇప్పుడే చెప్పలేం రిజర్వు బ్యాంకు గవర్నరు శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలు ముంబై: విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి రేట్ల కోతకు వెళ్లకుండా యథాతథ పరిస్థితికి మొగ్గు చూపించింది. ప్రస్తుతమున్న రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే

ఆర్‌ఐఎల్‌పై సీఎల్‌ఎస్‌ఏ బుల్లిష్‌

Thursday 5th December 2019

అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ఆర్‌ఐఎల్‌ పట్ల బుల్లిష్‌గా ఉంది. అలాగే లెమన్‌ట్రీ హోటల్స్‌ స్టాక్‌ విషయంలో సానుకూలంగా ఉంది. ఈ రెండు స్టాక్స్‌ వచ్చే ఏడాది కాలంలో ప్రస్తుత స్థాయి నుంచి కనీసం 25 శాతానికిపైనే రాబడులను ఇస్తాయని అంచనా వేస్తోంది.   జియో టారిఫ్‌ పెంపు నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ టార్గెట్‌ ధరను గతంలో ఇచ్చిన రూ.1,710 నుంచి రూ.2,010కు సీఎల్‌ఎస్‌ఏ పెంచింది. ప్రస్తుత స్థాయి నుంచి 30.6 శాతం వృద్ధికి

Most from this category