News


ఎఫ్‌పీఐలకు సులభ కేవైసీ

Saturday 6th July 2019
Markets_main1562391275.png-26837

  • సామాజిక సంస్థలు, స్వచ్చంద సంస్థలకు నిధుల సమీకరణ వేదిక
  • ఇందుకోసం సోషల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌
  • లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల వాటా 35 శాతానికి
  • బడ్జెట్లో ప్రతిపాదనలు

క్యాపిటల్‌ మార్కెట్లను ప్రజలకు మరింత చేరువ చేసే చర్యలు నిర్మలాసీతారామన్‌ బడ్జెట్లో కనిపించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సంబంధించి కేవైసీ నిబంధనల సడలింపు, సామాజిక, స్వచ్చంద సంస్థల లిస్టింగ్‌కు అవకాశం, లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల కనీస వాటా 25 శాతం నుంచి 35 శాతానికి పెంపు ప్రతిపాదనలు బడ్జెట్లో చోటు చేసుకున్నాయి. క్యాపిటల్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యాన్ని పెంచే చర్యలు కనిపించాయి. కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు ఆర్‌బీఐ, సెబీతో సంప్రదింపుల అనంతరం మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. సామరస్య, సమస్యల్లేని పెట్టబడుల వాతావరణాన్ని ఎఫ్‌పీఐలకు కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అందుకే వారికి సంబంధించి కేవైసీ (మీ క్లయింట్‌ ఎవరన్నది తెలుసుకునే వివరాలు) నిబంధనలను క్రమబద్ధీకరించడం, సులభతరం చేయడం ద్వారా... సమగ్ర, సీమాంతర పెట్టుబడుల విషయంలో రాజీ పడకుండా మరింత పెట్టుబడి అనుకూలంగా మార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. స్టాక్‌ మార్కెట్లో అడ్డంకుల్లేని పెట్టుబడులకు గాను ఎన్‌ఆర్‌ఐ పోర్ట్‌ఫోలియో మార్గాన్ని కూడా ఎఫ్‌పీఐల మార్గంలో విలీనం చేయాలని మంత్రి ప్రతిపాదించారు.

లాకిన్‌ పీరియడ్‌లోనూ బయటపడొచ్చు... 
డెట్‌ సెక్యూరిటీల్లో ఎఫ్‌ఐఐలు, ఎఫ్‌పీఐల పెట్టుబడులను దేశీయ ఇన్వెస్టర్లకు బదలాయించడం, విక్రయించడం, అలాగే, ఎన్‌బీఎఫ్‌సీలు జారీ చేసే డెట్‌ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐల ప్రవేశానికి మంత్రి ప్రతిపాదించారు. ‘‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెట్‌ ఫండ్‌ - ఎన్‌బీఎఫ్‌సీలు జారీ చేసే డెట్‌ సెక్యూరిటీల్లో ఎఫ్‌ఐఐ/ఎఫ్‌పీఐల పెట్టుబడులను లాకిన్‌ పీరియడ్‌ సమయంలో ఏదేనీ దేశీయ ఇన్వెస్టర్‌కు బదలాయింపు లేదా విక్రయానికి అనుమతిండాన్ని ప్రతిపాదించాం’’ అని మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ‘‘రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల్లో ఇన్వెస్ట్‌ చేయడం ముఖ్యం. ట్రెజరీ బిల్లుల బదిలీ సాఫీగా జరిగేందుకు ఆర్‌బీఐ, సెబీ డిపాజిటరీల మధ్య అనుసంధానం (ఇంటర్‌ ఆపరేబులిటీ) అవసరం. ఈ దిశగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది’’ అని మంత్రి తెలిపారు. 

సోషల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌
సామాజిక సంక్షేమం కోసం పనిచేసే సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, స్వచ్చంద సంస్థలు ఈక్విటీ, డెట్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల రూపంలో నిధులు సమీకరించేందుకు గాను ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ రైజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘సోషల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌’ను సెబీ నియంత్రణల పరిధిలో ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘సమగ్రాభివృద్ధి, ఆర్థిక సమ్మిళిత లక్ష్యాలను చేరుకునేందుకు గాను సామాన్యులకు చేరువగా క్యాపిటల్‌ మార్కెట్లను తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం’’ అని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. 

సృజనాత్మకం...
సామాజిక, స్వచ్చంద సంస్థల లిస్టింగ్‌కు అనుమతించడం అన్న ప్రతిపాదన చాలా వినూత్నంగా, సృజనాత్మకంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక రూపు రేఖలను మార్చాలని నిజాయితీగా కృషి చేసే వాటి ముఖచిత్రాన్ని మార్చే ప్రతిపాదనగా దీన్ని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ అభివర్ణించారు. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకం అయితే, సామాజిక కార్యక్రమాల కోసం అవి సులభంగా నిధులు సమీకరించుకోగలుగుతాయని, దీన్ని ఆహ్వానించతగిన ప్రతిపాదనగా పేర్కొన్నారు. సెబీ నియంత్రణల పరిధిలో సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం సోషల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ఏర్పాటు ప్రతిపాదనను తాము సిఫారసు చేసినట్టు ఇండియన్‌ కమోడిటీ ఎక్సేంజ్‌ ఎండీ, సీఈవో సంజిత్‌ ప్రసాద్‌ తెలిపారు. ‘‘ఈ ప్రతిపాదన ప్రోత్సాహకరంగా ఉంది. ఈక్విటీ, డెట్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల మాదిరిగా ఎన్‌జీవోలు, సామాజిక సంస్థలు నిధులు సమీకరించేందుకు సాయపడుతుంది. సామాజిక రంగంలో గవర్నెన్స్‌కు ప్రేరణనిస్తుంది’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ తెలిపారు. 

 You may be interested

స్టార్టప్స్‌కు తోడ్పాటు!!

Saturday 6th July 2019

 పన్ను వివాదాల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం  ఏంజెల్‌ ట్యాక్స్‌ విషయంలో ఊరట  స్టార్టప్స్‌ కోసం ప్రత్యేక టీవీ చానల్‌ న్యూఢిల్లీ: స్టార్టప్‌ సంస్థలను ప్రోత్సహించే దిశగా కేంద్రం బడ్జెట్‌లో పలు చర్యలు ప్రతిపాదించింది. పెండింగ్‌లో ఉన్న ఆదాయ పన్ను అసెస్‌మెంట్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అలాగే, ఏంజెల్‌ ట్యాక్స్‌ విషయంలోనూ కొంత ఊరటనిచ్చే చర్యలు ప్రకటించింది. "స్టార్టప్‌ సంస్థలు ప్రస్తుతం వేళ్లూనుకునే దశలో ఉన్నాయి. వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం

1,174 కంపెనీలు వాటా విక్రయించాలి

Saturday 6th July 2019

పబ్లిక్‌ హోల్డింగ్‌ 25 శాతం నుంచి 35 శాతానికి ! పెంచాలంటూ ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి  తగిన సమయం ఇవ్వాలంటున్న నిపుణులు  రూ.3.87 లక్షల కోట్ల విలువైన షేర్ల విక్రయం !  న్యూఢిల్లీ: ఒక కంపెనీలో ప్రజలకుండే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రతిపాదించారు. కంపెనీలో ప్రజల వాటాను 35 శాతానికి పెంచడానికి ఇదే సరైన సమయమని తన తొలి బడ్జెట్‌లో ఆమె ప్రతిపాదించారు. క్యాపిటల్‌

Most from this category