News


అగ్రి కెమ్‌, ఫెర్టిలైజర్‌ షేర్ల దూకుడు

Thursday 9th January 2020
Markets_main1578562561.png-30804

జాబితాలో ఫ్యాక్ట్‌, జీఎస్‌ఎఫ్‌సీ
రామా ఫాస్ఫేట్స్‌, మంగళూర్‌ కెమ్‌
ఏరీస్‌ ఆగ్రో, ఆర్‌సీఎఫ్‌, ఎన్‌ఎఫ్‌సీఎల్‌
7-2 శాతం మధ్య హైజంప్‌

ఈ రబీ సీజన్‌(2019-20)లో పంటల విస్తీర్ణం పెరగడటం, ఇన్‌పుట్‌ వినియోగం పుంజుకోవడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో వ్యవసాయ రంగ కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్‌ పెరిగింది. ఇన్వె‍స్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రధానంగా ఫెర్టిలైజర్‌, అగ్రి కెమికల్‌ కంపెనీల కౌంటర్లు లాభాల దూకుడు చూపుతున్నాయి. సకాల వర్షాలు, నీటి లభ్యత పెరగడం వంటి పరిస్థితుల కారణంగా రబీ ఊపందుకున్నట్లు తెలియజేశారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో పలు కంపెనీలు పటిష్ట పనితీరును చూపనున్నట్లు అంచనాలు వెలువడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా గురువారం మధ్యాహ్నానికల్లా వ్యవసాయ ఆధారిత లిస్టెడ్‌ కంపెనీలన్నీ దాదాపు లాభాలతో ట్రేడవుతున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. 

జోరు చూడతరమా
ఫెర్టిలైజర్‌, అగ్రికెమ్‌ తదితర వ్యవసాయాధారిత కంపెనీల షేర్లు 7-2 శాతం మధ్య జంప్‌చేశాయి. ప్రధానంగా ఎన్‌ఎస్‌ఈలో ఫ్యాక్ట్‌ 6.5 శాతం జంప్‌చేసి రూ. 48ను తాకగా, జీఎస్‌ఎఫ్‌సీ 7.3 శాతం ఎగసి రూ. 80కు చేరింది. ఇక బీఎస్‌ఈలో రామా ఫాస్ఫేట్స్‌ 7.5 శాతం పురోగమించి 52 వద్ద కదులుతోంది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈలో  మంగళూర్‌ కెమికల్‌ 5.6 శాతం బలపడి రూ. 35 వద్ద, ఏరీస్‌ ఆగ్రో 5 శాతం పుంజుకుని రూ. 70 వద్ద, ఆర్‌సీఎఫ్‌ 6 శాతం జంప్‌చేసి రూ. 52 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక ఎన్‌ఎఫ్‌సీఎల్‌ 5 శాతం లాభంతో రూ. 4.30కు చేరింది.

ఇతర కౌంటర్లు
ఇతర కౌంటర్లలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ 4.6 శాతం ఎగసి రూ. 555ను తాకగా.. కావేరీ సీడ్‌ 4.2 శాతం పెరిగి రూ. 498కు చేరింది. ఇదే విధంగా చంబల్‌ ఫెర్టిలైజర్స్‌, మద్రాస్‌ ఫెర్టిలైజర్స్‌, ఎన్‌ఎఫ్‌ఎల్‌, ఎక్సెల్‌ ఇండస్ట్రీస్‌, గుజరాత్‌ నర్మదా, భారత్‌ రసాయన్‌, ధనుకా, ర్యాలీస్‌, స్పిక్‌ 4-2 శాతం మధ్య లాభపడి ట్రేడవుతున్నాయి.



You may be interested

ఇన్ఫీ ఫలితాలు.. ఏం చూడాలి?

Thursday 9th January 2020

మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌ను శుక్రవారం ఇన్ఫోసిస్‌ ఆరంభించనుంది. సాధారణంగా క్యు3లో ఐటీ కంపెనీల ఫలితాలు నీరసంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి... - రూపీ లెక్కల్లో కంపెనీ ప్రాఫిట్‌ వృద్ధి గత త్రైమాసికంతో పోలిస్తే 6-8 శాతం, గతేడాదితో పోలిస్తే 4-7 శాతం ఉండొచ్చు. - స్థిర కరెన్సీ లెక్కల్లో విక్రయాలు 1.4- 2 శాతం పెరుగుదల చూపవచ్చు.  - క్యు2తో పోలిస్తే

వెలుగులోకి రియల్టీ షేర్లు

Thursday 9th January 2020

52వారాల గరిష్టానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌  రియల్టీ రంగ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో లాభాల బాటపట్టాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3శాతం లాభపడింది. అలాగే 52-వారాల గరిష్ట స్థాయిని అందుకుంది. గృహాలకు కొనుగోలు చేసే వారికి ఆర్థిక భరోసానిచ్చే రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారెంటీ(ఆర్‌బీబీజీ) పథకాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ పథకం కొనుగోలుదారులకు,

Most from this category