News


మూడో రోజూ ‘ఫ్రీజ్‌’ అయిన కాపీ డే

Thursday 1st August 2019
Markets_main1564655272.png-27482

కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం, అటుపిమ్మట ఆత్మహత్య చేసినట్లు తర్వాత కాఫీ డే షేర్లు భారీగా పడిపోతున్నాయి. గత సెషన్‌లో 20 శాతం పతనమై డౌన్‌ సర్య్కూట్‌ ఫ్రీజ్‌ అయిన ఈ షేరు, గురువారం ట్రేడింగ్‌లో కూడా భారీగా పడిపోయింది. తాజాగా స్టాక్‌ ఎక్సెంజీలు కాఫీ డే షేరు డౌన్‌ సర్య్కూట్‌ ఫ్రీజ్‌ పరిమితిని 10 శాతానికి తగ్గించడంతో ఈ కంపెనీ షేరు విలువ గురువారం ట్రేడింగ్‌లో 10 శాతం నష్టపోయి రూ.110.50  వద్ద డౌన్‌ సర్య్కూట్‌ ఫ్రీజ్‌ అయ్యింది. గత సెషన్లో 20 శాతం నష్టపోయి రూ. 122.75 వద్ద ఫ్రీజ్‌ అయిన ఈ షేరు గురువారం ట్రేడింగ్‌లో 110.50 వద్ద ప్రారంభమై, అప్పుడే ఫ్రీజ్‌ అయ్యింది.



You may be interested

నిఫ్టీ 70 పాయింట్ల గ్యాప్‌డౌన్‌

Friday 2nd August 2019

ఛైనాపై సెప్టెంబర్‌ నుంచి 10 శాతం అదనపు టారీఫ్‌లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత రాత్రి హెచ్చరించిన నేపథ్యంలో  ప్రపంచ మార్కెట్లు పతనంకావడంతో భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం సైతం  గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200  పాయింట్ల నష్టంతో 36,800 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 70 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 10,910 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. వేదాంత, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌లు 1-3

సెన్సెక్స్‌ నష్టం 463 పాయింట్లు

Thursday 1st August 2019

138 పాయింట్లను కోల్పోయిన నిఫ్టీ  ఫెడ్‌ రిజర్వ్‌ పావుశాతం వడ్డీరేట్ల కోత  మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో గురువారం స్టాక్‌ సూచీలు భారీ నష్టంతో ముగిసాయి. సెన్సెక్స్‌ 463 పాయింట్లు నష్టపోయి 37,018.32 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లను కోల్పోయి 10,980 వద్ద స్థిరపడ్డాయి. నిన్నరాత్రి అమెరికా దాదాపు 11ఏళ్ల తరువాత కీలక వడ్డీరేట్లపై పావు శాతం తగ్గించింది. అనంతరం రేట్ల కోతపై ఛైర్మన్‌ పావెల్‌ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత కోత తగ్గింపు తదుపరి రోజుల్లో కొనసాగకపోవచ్చు’’

Most from this category