STOCKS

News


ఐఆర్‌సీటీసీ బంపర్‌ లిస్టింగ్‌: ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి..?

Monday 14th October 2019
news_main1571042111.png-28871

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) బంపర్‌ లిస్టింగ్‌ సాధించింది. ఇష్యూ ధర రూ. 320కాగా లిస్టింగ్‌ 101.25 శాతం ప్రీమియంతో రూ. 644వద్ద జరిగింది.  ఇంట్రాడేలో మరింత దూసుకెళ్లి (132 శాతం) రూ.743.80 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. దీంతోఐఆర్‌సీటీసీ సంస్థ మార్కెట్ విలువ రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 10,972 కోట్లకు చేరుకుంది. ఐపీఓ చివరి నాటికి ఏకంగా 112 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ అయింది. అంటే ఐఆర్‌సీటీసీ రూ.645 కోట్లు సేకరించాలనుకుంటే ఏకంగా అప్పర్ ప్రైస్ బ్యాండ్ దగ్గర రూ.72,000 బిడ్స్ వచ్చాయి. ఉన్నవి 2 కోట్ల షేర్లే అయినా 225 కోట్ల షేర్లకు బిడ్స్ వేశారు.  ఐపీఓ ఈ స్థాయిలో ఓవర్‌ సబ్‌స్కై‍్రబ్‌ అయినప్పుడే షేరుపై అంచనాలు పెరిగాయి.  

ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి..?
మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించిన బంపర్‌ లిస్టింగ్‌ జరగడంతో షేర్లు మరింత ర్యాలీ చేసేందుకు తక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కొంత ప్రాఫిట్‌ బుకింగ్‌ చేసుకోవడం మంచింది. మిగిలిన షేర్లను దీర్ఘకాలికానికి అట్టిపెట్టుకోవడం ఉత్తమమని విశ్లేషకులు సలహానిస్తున్నారు. దీర్ఘకాలికానికి ఈ షేర్లు 80 నుంచి 90శాతం వరకు ఆదాయాలు ఇవ్వచ్చని అంచనా వేశారు. అయితే లిస్టింగ్‌లో ఆ అంచానాలు తలకిందులయ్యాయి. ఇప్పటికి ఈ షేర్లు దీర్ఘకాలంలో స్థిరమైన రాబడిని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

‘‘ఐపీఓ ప్రక్రియలో షేర్లను కొనుగోలు చేసినట్లై ఉంటే, ‘మరిన్ని జోడించు' వ్యూహాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ తాజా కొనుగోలుదారులైతే... ఓపెన్‌ మార్కెట్లో రూ.500-525 స్థాయిలో షేర్లును కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే ఈ షేర్లు దీర్ఘకాలంలో స్థిరమైన రాబడిని ఇస్తుంది. మల్టీబ్యాగర్ అయ్యేం‍దుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని రుద్రా షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ అధినేత మనాలి భాటియా అభిప్రాయపడ్డారు. 

‘‘పాక్షికంగా ఈ షేర్లను హోల్డ్‌ చేయవచ్చు. ఒక్కో షేరుకు రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ ధర వద్ద ట్రేడ్‌ అవుతుంటే మొత్తం పరిమాణంలో కొంత భాగాన్ని ప్రాఫిట్‌ బుకింగ్‌ చేసుకోవడం మంచిది. ప్రైజ్‌ ఎర్నింగ్‌ రేషియా ఇష్యూ ధరపై 18 రెట్ల నుంచి (లిస్టింగ్‌ ధర) 30 రెట్లు (లిస్టింగ్‌పై) విస్తరించి ఉంటుంది కాబట్టి లాభాల స్వీకరణ ఇది కారణమవుతోంది’’. అని మెహతా ఈక్విటీస్‌ ఏవీపీ రీసెర్చ్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. 

ఐఆర్‌సీటీసీ కచ్చితంగా పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన షేరు. ఈ రంగంలో గుప్తాధిపత్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ధర, భవిష్యత్తు వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇటీవలి కార్పొరేట్ పన్ను తగ్గింపు, టికెట్ బుకింగ్‌లపై సేవా ఛార్జీల పునరుద్ధరణ కూడా కలిసొచ్చే అంశం. ఈ సానుకూల కారణాలతో ఈ షేర్లపై పాజిటివ్‌ అవుట్‌లుక్‌ కొనసాగిస్తామని మనాలి భాటియా తెలిపారు.

ఐఆర్‌సీటీసీ మినీ-రత్న కేటగిరీ -1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్, భారత రైల్వే యొక్క పూర్తిగా యాజమాన్యంలో ఉంది. రైల్వేలకు క్యాటరింగ్ సేవలను అందించడం, ప్యాకేజీ చేసిన తాగునీటిని తయారు చేయడం పంపిణీ చేయడం, ఆన్‌లైన్ రైలు టిక్కెట్లను అందించే ఏకైక సంస్థ ఐఆర్‌సిటిసి. ఇది బడ్జెట్ హోటళ్ళు, ఇ-క్యాటరింగ్ మరియు ఎగ్జిక్యూటివ్ లాంజ్ వంటి రైల్వేయేతర సేవలను కూడా అందిస్తుంది. 2017 ఆర్థిక సంవత్సరం నుంచి మంచి రాబడులను పొందుతుంది.  లాభదాయక సంస్థ, రుణ రహిత, గత కొద్దికాలం నుంచి బలమైన డివిడెండ్ చెల్లింపునిస్తుంది. సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆకర్షణీయంగా ఉందని విశ్లేషకులంటున్నారు.You may be interested

ఝున్‌ఝున్‌వాలా, రాజివ్‌ ఖన్నా, ఆశీష్‌ కచోలియా భారీగా విక్రయించిన షేర్లివే!

Monday 14th October 2019

ఆర్థిక మందగమనంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు సెప్టెంబర్‌ క్యార్టర్‌లో నష్టపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ భారీ ర్యాలీని మినహాయిస్తే దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు జులై, అగష్టు నెలలో నష్టాలలోనే ముగిశాయి. ఫలితంగా రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆశిష్‌ కచోలియా, రాజీవ్‌ ఖన్నా వంటి సీనియర్‌ ఇన్వెస్టర్లు వివిధ కంపెనీలలోని తమ వాటాలను విక్రయించారు.   రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా విక్రయించిన షేర్లు..    సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా  సెప్టెంబర్‌ త్రైమాసికంలో నాలుగు కంపెనీలలో తన

టాటా మోటర్స్‌ జోరు: లాభాల బాటలో అటో షేర్లు

Monday 14th October 2019

టాటా మోటర్స్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో నేటి ఉదయం సెషన్‌లో 6శాతానికి పైగా ర్యాలీ చేశాయి. నేడు  ఈ కంపెనీ షేర్లు రూ.122.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. టాటా మోటార్స్‌కు చెందిన అతిపెద్ద అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు చైనాతో పాటు అమెరికాలోనూ మంచి మార్కెట్ ఉంది. ఇటీవల ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య సంధితో రెండు దేశాల్లో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు

Most from this category