News


అక్టోబర్‌ తర్వాత బ్రహ్మాండమైన ర్యాలీ: భాసిన్‌

Wednesday 25th September 2019
Markets_main1569434343.png-28550

అక్టోబర్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్లలో అద్భుతైమన ర్యాలీ చూడనున్నామని పేర్కొన్నారు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. గత కొంత కాలంగా తక్కువ ధరల్లో కొనుగోలు చేయలేకపోయామనుకున్న స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రస్తుతం మంచి  తరుణంగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

మార్కెట్లు 1,000 పాయింట్లు పెరిగిన తర్వాత 200 పాయింట్లు పడిపోవడం సహజమేనన్నారు భాసిన్‌. కానీ, ర్యాలీకి ఇది ఆరంభమేనన్నారు. ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలతో వచ్చే 18 నెలల కాలానికి మార్కెట్లలో ర్యాలీకి మంచి అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. గడిచిన నెలన్న రోజులుగా కొనుగోళ్లకు మంచి అనుకూల సమయమని, ఆ సమయంలో కొనుగోలు చేయలేకపోయిన వారు ప్రస్తుతం కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. అక్టోబర్‌ మధ్య వరకు అస్థిరతలు కొనసాగవచ్చన్నారు. ఇప్పటి వరకు చూడలేనంత మంచి ఈక్విటీ ర్యాలీని ఆ తర్వాత చూడబోతున్నామని చెప్పారు. 

 

దీపావళి నాటికి మార్కెట్లు 1,000 పాయింట్ల వరకు ర్యాలీ చేస్తాయని నిఫ్టీ 10,700 వద్దనున్నప్పుడే చెప్పానని భాసిన్‌ గుర్తు చేశారు. కానీ, అది నెల రోజుల ముందుగానే వచ్చిందన్నారు. ఐటీ పట్ల తటస్థం నుంచి ప్రతికూలంగా ఉన్నట్టు చెప్పారు. ఇండస్ట్రియల్స్‌, కార్పొరేట్‌ బ్యాంకులు, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లోని స్టాక్స్‌ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. ఐటీలో ఒక్క హెచ్‌సీఎల్‌ పట్ల అధిక వెయిటేజీతో ఉన్నట్టు తెలిపారు. మిడ్‌క్యాప్‌లో అధిక బీటా అవకాశాలున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వంటివి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలకు సిద్ధంగా ఉందని తెలియజేస్తోందన్నారు. వచ్చే మూడేళ్లూ మన మార్కెట్‌ పట్ల అధిక వెయిటేజీని ప్రకటించారు. 

 

వినియోగ రంగ స్టాక్స్‌ నూతన గరిష్టాలను నమోదు చేస్తున్నాయని, వీటిల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెళుతున్నట్టు భాసిన్‌ తెలిపారు. నెస్లే, టైటాన్‌, హెచ్‌యూఎల్‌ స్టాక్స్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. గోద్రేజ్‌ కన్జ్యూమర్‌, ప్రైవేటు బ్యాంకుల పట్ల సానుకూలత ప్రకటించారు. ఎల్‌అండ్‌టీ, సీమెన్స్‌ను సూచించారు. ఓపిక పడితే మిడ్‌క్యాప్‌లో భారీ రాబడులకు అవకాశం ఉందన్నారు. 2020 మిడ్‌క్యాప్‌ సంవత్సరం అవుతుందని, ఎంచుకున్న రంగాలు, స్టాక్స్‌ను బట్టి 100-300 శాతం వరకు రాబడులు పొందొచ్చన్నారు. ఇంధన రంగంలోని బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, రిలయన్స్‌, గెయిల్‌, ఐజీఎల్‌, ఎంజీఎల్‌లో తమ పెట్టుబడులు ఉన్నాయని, వీటన్నింటి పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. You may be interested

మళ్లీ ముకేశ్‌‘‘క్యాష్‌’’ కింగ్‌..!

Thursday 26th September 2019

భారత్‌లో ఆయనే అత్యంత సంపన్నుడు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా  రిచ్‌ లిస్ట్‌ వెల్లడి వరుసగా ఎనిమిదేళ్లుగా ముకేశ్‌దే అగ్రస్థానం రెండవ స్థానంలో హిందూజాలు ముంబై: భారత్‌లో అత్యంత సంపన్నునిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద రూ.3,80,7000 కోట్లు.  తాజా ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ఆయనదే అగ్రస్థానం. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో లండన్‌

ఓఎంసీ షేర్ల పట్ల విశ్లేషకుల సానుకూలత

Wednesday 25th September 2019

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల (ఓఎంసీలు) పట్ల అనలిస్టులు సానుకూలంగా ఉన్నారు. ప్రభుత్వరంగంలోని ఏఎంసీలు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ గత నెల రోజుల్లో వాటి కనిష్ట ధరల నుంచి ర్యాలీ చేశాయి. ప్రధానంగా చమురు ధరలు శాంతించడం వీటి ర్యాలీకి దోహదపడింది. వీటిల్లో బీపీసీఎల్‌ బాగా లాభపడింది. నెల క్రితం రూ.321 ధర నుంచి ప్రస్తుతం రూ.465కు చేరింది. ఒకవైపు చమురు ధరల తగ్గుదల, మరోవైపు ఈ కంపెనీలో తనకున్న పెట్టుబడులను

Most from this category