News


ముందుంది ఐపీఓల పండుగ

Wednesday 17th July 2019
Markets_main1563344318.png-27122

  • ఈ ఏడాది మొదటి 6 నెలలో 8 మాత్రమే
  • గత ఏడాది ఇదే కాలంలో 24 కంపెనీలు

     వచ్చే నెలలో అర డజను కంపెనీలు ఐపీఓకి  రావడానికి సిద్ధపడుతున్నాయి. రూ.10,000 కోట్లను సమీకరించడమే లక్ష్యంగా ఇవి ఐపీఓకి రానున్నాయి. స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌, ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌, స్పంధన స్ఫూర్తి ఫైనాన్సియల్‌, ఎఫ్ఫెల్‌ ఇండియా, ఏజీఎస్‌ ట్రాన్సక్ట్‌ టెక్నాలజీస్‌, మజగావ్‌ డాక్‌ షిప్‌ బుల్డర్స్‌ వంటి కంపెనీలు అగష్టు మధ్యలో ఐపీఓకి రానున్నాయని బ్యాంకర్లు తెలిపారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కేవలం 8 కంపెనీలు మాత్రమే ఐపీఓకి వచ్చి రూ.5,509 కోట్లను సమీకరించాయి. ఇది గత ఏడాది ఇదే కాల వ్యవధిలో 24 కంపెనీలు ఐపీఓకి వచ్చి సమీకరించిన రూ.30,960 కోట్ల కంటే తక్కువ. 2017లో 36 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.67,200 కోట్లను సమీకరించడం గమనర్హం.  
    షాపూంజీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన సోలార్‌ కంపెనీ స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ సుమారుగా రూ.4,500 కోట్లను ఐపీఓ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల చివరిలో కంపెనీ ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఎఎఫ్‌ఎస్‌)కు రానుందని కంపెనీ చైర్మన్‌ కుర్షిద్‌ యాజిద్‌, షాపూజీ పల్లోంజి కో. తెలిపారు. అంతేకాకుండా ముంబైకి చెందిన ఆస్తి నిర్వహణ కంపెనీ ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మానేజర్స్‌ కూడా జులై చివరి వారంలో ఐపీఓకి వచ్చి రూ.1,500 కోట్లను సమీకరించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఐపీఓలో రూ.600 కోట్ల విలువ గల కొత్త షేర్లు, ప్రమోటర్లు ఏఐ గ్లోబల్‌కు చెందిన 1.36 కోట్ల షేర్లు, సమీర్‌ కొటిచాకు చెందిన 44 లక్షల షేర్లు అందుబాటులోకి రానున్నాయి.     
   ఆన్‌లైన్‌ వ్యాపార ఉత్పత్తులను అందించే ఇండియామార్ట్‌ ఇంటర్‌మెస్‌ కంపెనీ గత నెలలో ఐపీఓకి వచ్చింది. ఈ ఐపీఓలో ఈ కంపెనీ స్టాకుకు మంచి డిమాండ్‌ లభించిన విషయం తెలిసిందే. రూ.475 కోట్ల ఇష్యుకు 36 రెట్లు చందాదారులు అయ్యారు.  ఈ కంపెనీ స్టాక్‌ మార్కెట్లో నమోదయ్యే సమయానికి కంపెనీ షేరు విలువ ఆఫర్‌ చేసిన ధర కంటే 21 శాతం పెరిగింది. ఈ ఐపీఓ బంపర్‌ హిట్‌ కావడంతో ఐపీఓకి రావలనుకునే కంపెనీలు ఇప్పుడు ముందడుగు వేయడానికి సిద్ధపడుతున్నాయని బ్యాంకర్లు తెలిపారు. ‘కంపెనీ వాల్యుషన్లు బాగుండి, సరియైన ధరకు ఐపీఓకి వస్తే మంచి డిమాండ్‌ లభిస్తుంది’ అని ఐసీసీ సెక్యూరిటీస్‌ కార్పోరేట్‌ ఫైనాన్స్‌, ఇన్సిస్టీట్యూషనల్‌ ఈక్విటీస్‌ హెడ్‌, ఎక్సిక్యూటివ్‌ డైరక్టర్‌ అజయ్‌ సరఫ్‌ అన్నారు. ‘ తాజాగా ఐపీఓలు హిట్‌ అవ్వడంతో ప్రాథమిక మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడానికి పెట్టుబడిదారులు ఉత్సాహం చూపిస్తున్నారు’ అని తెలిపారు. 
     బడ్జెట్‌లో ప్రభుత్వం నిర్ణయించినట్టు కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ 25 శాతం నుంచి 35 శాతానికి నియంత్రణ సంస్థలు పెంచితే షేర్ల అందుబాటు ఎక్కువవుతుంది. అందుకోసమే కంపెనీలు ఐపీఓకి రావడానికి తొందరపడుతున్నాయని విశ్లేషకులు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థైన మజగావ్‌ డాక్‌ షిప్‌బుల్డర్స్‌ రూ.650 కోట్లను సమీకరించుకునేందుకు ఈ నెల చివరిలో ఐపీఓకి రానుంది. ఈ సంస్థ 2.24 కోట్ల షేర్లను ఐపీఓలో అందుబాటులోకి తీసుకురానుంది. ఫలితంగా ఇందులో  ప్రభుత్వ వాటా 10 శాతం తగ్గుతుంది.  మైక్రోసాఫ్ట్‌ దన్నుగా ఉన్న ఎఫ్ఫెల్‌​కంపెనీ ఐపీఓకి రానుంది. ఇది రూ. 500 కోట్లను సమికరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.  50 కంటే ఎక్కువ డీఆర్‌హెచ్‌పీ(డ్రాఫ్ట్‌ రెడ్‌ హియరింగ్‌ ప్రాస్పెక్ట్‌లు)లు సెబీ దగ్గర నమోదయ్యాయి. రాబోయే ఐపీఓలు రాణిస్తే ఇవి కూడా ఐపీఓలుగా మారవచ్చు.


 


IPO

You may be interested

యస్‌బ్యాంకు ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Wednesday 17th July 2019

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌బ్యాంకు బుధవారం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఆస్తుల నాణ్యతలో క్షీణత, బలహీన లోన్‌గ్రోత్‌ కారణంగా బ్యాంకు లాభాల్లో భారీ కోత ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే లాభంలో 80 శాతం పతనం ఉండొచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. దాదాపు రూ.10వేలపైచిలుకు ఒత్తిడిలో ఉన్న ఆస్తుల కారణంగా ప్రొవిజన్లు బాగా పెరిగి రూ. 1208 కోట్లకు చేరవచ్చని అంచనా. ఇందువల్ల

మొండి బాకీలు రూ.లక్ష కోట్లు తగ్గాయి

Wednesday 17th July 2019

2019 మార్చి నాటికి రూ.9.34 లక్షల కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి న్యూఢిల్లీ: బ్యాంకుల్లో వసూలు కాని మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2018-19) రూ.లక్ష కోట్లు తగ్గి, రూ.9.34 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలియజేశారు. ఎన్‌పీఏల గుర్తింపులో పారదర్శకత, పరిష్కారం, వసూలు తదితర చర్యలతో కూడిన సమగ్ర కార్యాచరణణు అనుసరిస్తున్నామని చెప్పారు. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన నిధుల

Most from this category