News


టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 2.50శాతం డౌన్‌

Saturday 28th September 2019
news_main1569666585.png-28604

అమెరికా మార్కెట్లు రెండునెలల్లో అతిపెద్ధ నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఏడీఆర్‌లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు 2.50శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. అత్యధికంగా టాటామోటర్‌ ఏడీఆర్‌ 2.50శాతం నష్టపోయింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 2శాతం, ఐసీఐసీఐ ఏడీఆర్‌ 1.50శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌ అరశాతం క్షీణించాయి. ఇన్ఫోసిన్‌ ఏడీఆర్‌ 0.10శాతం నష్టపోయాయి. 
అమెరికా స్టాక్‌ ఎక్చ్సేంజీల నుంచి చైనా కంపెనీల డీలిస్టింగ్‌ ..!?
అమెరికా స్టాక్‌ ఎక్చ్సేంజీల నుంచి చైనా కంపెనీల డీలిస్టింగ్‌ అంశాన్ని ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు శుక్రవారం వార్తలు వెలుగులోకి వచ్చాయి. చైనా కంపెనీల్లో యూఎస్‌ పెట్టుబడులను పరిమితం చేసేందుకు, చైనా కంపెనీల కార్యకలాపాలపై ప్రభుత్వ యంత్రాంగంలో పెరుగుతున్న భద్రతా ఆందోళనల కారణంగా ట్రంప్‌ ఈ నిర్ణయాన్ని తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే డీలిస్టింగ్‌ ఎప్పుడు, ఏ విధంగా చేస్తారో అనే అంశాలపై పూర్తి వివరాలు తెలియరాలేదు.  ఈ నేపథ్యంలో వచ్చే నెల రెండోవారంలో అమెరికా-చైనాల మధ్య జరిగే వాణిజ్య చర్చలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. అక్టోబర్‌ 1న చైనా రిపబ్లిక్‌ దినోత్సం జరగనున్న నేపథ్యంలో వారం రోజుల పాటు చైనా మార్కెట్లు పనిచేయవు. 
డో జోన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇండెక్స్‌ 71 పాయింట్లు నష్టపోయి 26,820.25 వద్ద, ఎస్‌అండ్‌పీ 16 పాయింట్లు క్షీణించి 2,961 వద్ద, నాస్‌డాక్‌ 91 పాయింట్లను కోల్పోయి 7,939 వద్ద స్థిరపడ్డాయి. 



You may be interested

డాలర్‌ ఎఫెక్ట్‌ : 8డాలర్లు నష్టపోయి పసిడి

Saturday 28th September 2019

ప్రపంచ మార్కెట్లో పసిడి 8డాలర్లు నష్టపోయి 1,506.40 డాలర్ల వద్ద స్థిరపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ రెండున్నరేళ్ల గరిష్టాన్ని అందుకోవడం ఇందుకు కారణమైంది. అమెరికా సెప్టెంబర్‌ ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకుని 0.60శాతం పెరిగింది. నిన్నరాత్రి ట్రేడింగ్‌లో డాలర్‌ ఇండెక్స్‌ అధిక స్థాయిలో ట్రేడ్‌ అవుతుండంతో పసిడి ధర క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఒక దశలో 1500 డాలర్ల

నష్టాల్లో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 28th September 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం రాత్రి నష్టంతో ముగిసింది. ఇది 11,531.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11579.50 పాయింట్లతో పోలిస్తే 48 పాయింట్ల నష్టంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పంద ఆశలు సన్నగిల్లడం

Most from this category