News


పరిమిత లాభాల్లో ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 14th December 2019
Markets_main1576316075.png-30230

అమెరికాలో ట్రేడయ్యే భారత ఏడీఆర్‌లు శుక్రవారం పరిమిత లాబాల్ని కూడగట్టుకున్నాయి. ఒక్క డాక్టర్‌ రెడ్డీస్‌ తప్ప మిగిలిన అన్ని ఏడీఆర్‌లు 1శాతం నుంచి 0.10శాతం వరకు పెరిగాయి. అమెరికా చైనాల మధ్య డీల్‌ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్‌ ప్రకటనతో మెటల్‌ రంగానికి వేదాంత ఏడీఆర్‌ 1.20శాతం పెరిగింది. అక్కడి మార్కెట్లో టెక్నాలజీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించిన కారణంగా  విప్రో ఏడీఆర్‌ 0.82శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు 0.50శాతం లాభపడ్డాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.60శాతం, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 0.02శాతం పెరిగాయి. టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ 0.16శాతం ర్యాలీ చేసింది. అయితే, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ మాత్రం 2శాతం వరకు నష్టపోయింది. 
పరిమిత లాభాల్లో ముగిసిన అమెరికా సూచీలు:- 
వాణిజ్య చర్చల్లో భాగంగా చైనాతో మొదటి దశ ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ.., శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు పరిమిత లాభంతో ముగిశాయి. అక్కడి ప్రధాన సూచీలైన ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 0.01శాతం పెరిగి 0.23 పాయింట్లు పెరిగి 3,168.80వద్ద, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 17.50 పాయింట్ల లాభంతో 8,734.88 వద్ద, డౌజోన్స్‌ 3.33 పాయింట్లు బలపడి 28,135.38 వద్ద స్థిరపడ్డాయి. చైనాతో మొదటి దశ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ఇంట్రాడే ఇంట్రాడేలో నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 8,734.88 వద్ద, డౌజోన్స్‌ సూచీ 28,290.73 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. అయితే వాణిజ్య ఒప్పందం అధికారికంగా ఖరారు కాకవడంతో పాటు, డిసెంబర్‌ 15 నుంచి చైనా దిగుమతులపై  విధించాల్సిన 15శాతం సుంకాలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్‌ తెలపడంతో ఇన్వెస్టర్లు నిరుత్సాహానికి గురిచేసింది. అలాగే సూచీల గరిష్ట స్థాయి వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరించింది. దీంతో సూచీలు గరిష్టస్థాయిలను లాభాల్ని కోల్పోయి పరిమితం లాభంతో ట్రేడింగ్‌ను ముగించాయి. 



You may be interested

ఎస్సార్‌ స్టీల్‌ రికవరీ డబ్బులు వచ్చేస్తున్నాయ్‌!

Saturday 14th December 2019

ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు సంబంధించి రూ. 42వేల కోట్ల మొత్తాన్ని చెల్లించే ప్రక్రియను ఆర్సెలార్‌ మిట్టల్‌ ఆరంభించినట్లు తెలిసింది. నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సార్‌స్టీల్‌ కొనుగోలుపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. దీంతో మిట్టల్‌ కంపెనీ చెల్లింపుల ప్రక్రియ షురూ చేసిందని, ఒకటి రెండు రోజుల్లో మొత్తం సొమ్ము చెల్లించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌ 16 నాటికి ఎస్‌బీఐకి ఈ నిధుల బదిలీ జరగవచ్చని తెలిపాయి. ఎస్సార్‌ స్టీ్‌ల్‌ రుణదాతల

టీసీఎస్‌ షేర్లు అమ్మేసిన ఎస్‌పీ గ్రూప్‌

Saturday 14th December 2019

ద షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌(ఎస్‌పీ) గురువారం దాదాపు 19 లక్షల షేర్లను విక్రయించింది. ఈ విక్రయంతో గ్రూప్‌ రూ. 380 కోట్లు సమీకరించింది. ఈ నెల్లో ఎస్‌పీ గ్రూప్‌ టీసీఎస్‌ షేర్లను విక్రయించడం ఇది రెండో సారి. గతవారం గ్రూప్‌ దాదాపు 20 లక్షల షేర్లను రూ. 400 కోట్లకు అమ్మేసింది. గ్రూప్‌నకు ఉన్న రుణభారం తగ్గించుకునేందుకు ఈ విక్రయాలు జరుపుతున్నట్లు తెలిపింది. స్టెర్లింగ్‌, విల్సన్‌ సోలార్‌లో ఉన్న రూ.

Most from this category