News


నష్టాల్లో ముగిసిన ఏడీఆర్‌లు

Wednesday 2nd October 2019
Markets_main1570003061.png-28675

అమెరికా మార్కెట్లు నిన్నరాత్రి నష్టాల ముగింపులో అక్కడి మార్కెట్లో ఏడీఆర్‌లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టాటామోటర్స్‌ ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌, ఐసీసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌లు 3.10శాతం నుంచి 2శాతం వరకు నష్టపోయాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ మాత్రమే స్వల్పంగా లాభపడింది. నిన్న టాటామోటర్స్‌ విడుదల చేసిన సెప్టెంబర్‌ మాసపు వాహన గణాంకాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడంతో టాటామోటర్స్‌ ఏడీఆర్‌ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా నిన్న అమెరికా టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 3.50శాతం క్షీణించింది. అమెరికా ఆర్థిక తయారీ రంగ ఆర్థిక గణాంకాలు నిరుత్సాహపరచడంతో డాలర్‌ నష్టపోయింది. ఫలితంగా డాలర్లపై ఆదాయాలను ఆర్జించే టెక్‌, ఫార్మా రంగాలకు చెందిన ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు 3.50శాతం నుంచి 1.50శాతం పతనమయ్యాయి. బ్యాంకింగ్‌ రంగానికి చెందిన ఐసీఐసీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 2.50శాతం నష్టపోయింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ అరశాతం లాభపడింది. చైనాతో వాణజ్య యుద్ధ ప్రభావంతో సెప్టెంబర్‌లో అమెరికా ఫ్యాక్టరీ యాక్టివిటీ పదేళ్ల కనిష్ట స్థాయికి  క్షీణించినట్లు గణాంకాలు వెలువడంతో నిన్నరాత్రి అమెరికా మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. డో జోన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇండెక్స్‌ 1.28శాతం పతనమై 26,573.04 వద్ద, ఎస్‌అండ్‌పీ 1.23శాతం క్షీణించి 2,940.25 వద్ద, నాస్‌డాక్‌ 1.13శాతం నష్టపోయి 7,908.69 వద్ద స్థిరపడ్డాయి. ఈ శుక్రవారం వెలువడనున్న అమెరికా నిరుద్యోగ గణాంకాలు, అదేరోజు ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగం రానున్న రోజుల్లో అమెరికా మార్కెట్‌కు దిశా నిర్దేశం కానున్నాయి. 



You may be interested

డాలర్‌ ఎఫెక్ట్‌: లాభాల్లోకి పసిడి

Wednesday 2nd October 2019

గత రెండు ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాల్లో ట్రేడైన పసిడి ధర తిరిగి లాభాల బాట పట్టింది. సెప్టెంబర్‌లో అమెరికా ఫ్యాక్టరీ యాక్టివిటీ పదేళ్ల కనిష్ట స్థాయికి  క్షీణించినట్లు నిన్నరాత్రి గణాంకాలు వెలువడ్డాయి. దీంతో ఆర్థిక మందగమన ఆందోళనలు తెరపైకి రావడంతో పాటు డాలర్‌,  బాండ్‌ ఈల్డ్స్‌ బలహీనడ్డాయి. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.  ఈ పరిణామాలు పసిడి ర్యాలీకి మద్దతినివ్వడంతో అమెరికా మార్కెట్లో రాత్రి ఒకదశలో పసిడి ధర 1500డాలర్ల

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 87 పాయింట్లు డౌన్‌..!

Wednesday 2nd October 2019

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ బుధవారం తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడ్‌ అవుతోంది. ఈ ఇండెక్స్‌ నేడు.... కిత్రంరోజు ఇండియాలో ముగిసిన నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11430)తో పోలిస్తే 17 పాయింట్ల లాభంతో 11447.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒకదశలో 22 పాయింట్లు మేర లాభపడి 11452.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఆసియా మార్కెట్లతో పాటు మధ్యాహ్నం యూరప్‌ మార్కెట్ల బలహీనంగా ప్రారంభం కావడం, అమెరికా ఫ్యూచర్లు నష్టాల ట్రేడింగ్‌తో ఇండెక్స్‌ నష్టాల

Most from this category