News


ఆ కంపెనీల షేర్లపై డేగకన్ను!

Saturday 26th October 2019
Markets_main1572071264.png-29162

ప్రమోటర్లు భారీగా తమవాటా షేర్లను తనఖా పెట్టిన కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్టాక్‌ఎక్చేంజ్‌లు నిర్ణయించాయి. ఇలాంటి కంపెనీల షేర్లలో చోటుచేసుకుంటున్న తీవ్ర ఒడిదుడుకులకు అడ్డుకట్ట వేసేందుకు ఎక్చేంజ్‌లు ఈ నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా వెయ్యికోట్ల రూపాయల మార్కెట్‌ క్యాప్‌ ఉండి, మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో 25 శాతానికి మించి ప్రమోటర్లు తనఖా పెట్టిఉన్న కంపెనీల స్టాకులపై 35 శాతం కనిష్ఠ మార్జిన్‌ నిబంధన విధించాలని నిర్ణయించాయి. అదేవిధంగా గడిచిన 30 రోజుల్లో టాప్‌ 25 క్లయింట్లే ట్రేడింగ్‌లో పాల్గొంటుంటే సదరు స్టాకుపై 30 శాతం కనిష్ఠమార్జిన్‌ నిబంధన వర్తింపజేస్తారు. అదేవిధంగా ఒక షేరు మూడు నెలల కనిష్ఠ, గరిష్ఠస్థాయిల మధ్య తేడా 40 శాతం దాటినా అధిక మార్జిన్‌ పరిధిలోకి తీసుకువస్తారు. ఈ నిబంధనలన్నీ నవంబర్‌ 1నుంచి అమల్లోకి వస్తాయి. సెబి, ఎక్చేంజ్‌ల ఉమ్మడి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు ఈ నిబంధనలు తీసుకున్నట్లు ఎక్చేంజ్‌లు వెల్లడించాయి. కంపెనీల ప్రమోటర్లు తనఖాలు పెట్టిన షేర్ల వివరాల వెల్లడికి సంబంధించి గత జూన్‌లో సెబి నిబంధనలను కఠినం చేసింది. తాజాగా ఎక్చేంజ్‌లు ఇలాంటి కంపెనీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించాయి. దీంతో ఇకపై ఇలాంటి కంపెనీల షేర్లలో తీవ్ర ఆటుపోట్లకు ఆస్కారం ఉండకుండా ఉంటుందని, సామాన్య మదుపరి మోసపోకుండా ఉంటాడని నిపుణులు అంచనా వేస్తున్నారు. 



You may be interested

‘‘ముహూరత్‌ ట్రేడింగ్‌’’ గురించి మీకు తెలుసా..!?

Saturday 26th October 2019

‘‘ముహూరత్‌ ట్రేడింగ్‌’’... దలాల్‌ స్ట్రీల్‌ వర్గాలకు పరిచయం అవసరం లేని పదం. అయితే కొత్తగా స్టాక్‌ మార్కెట్‌ను అనుసరించే వారు,  సాధారణ పాఠకులు మాత్రం ఈ ముహూరత్‌ ట్రేడింగ్‌ గురించి కాస్త తెలుసుకోవాల్సిందే. రేపు దీపావళి సందర్భరంగా ప్రత్యేకమైన ముహురత్‌ ట్రేడింగ్‌ జరగనుంది. అసలు మూహరత్‌ ట్రేడింగ్‌ అంటే ఏమిటి, ఎందుకు, ఎ‍ప్పుడు జరుగుతుందనే అనే కీలకాంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.... మూహరత్‌ ట్రేడింగ్‌ అంటే ఏమిటి? ప్రతి ఏడాది దీపావళి పండుగ పర్వదినాన

కొత్త గరిష్టం సమీపంలో అమెరికా మార్కెట్‌!

Saturday 26th October 2019

   మూడవ త్రైమాసికానికి సంబంధించి యుఎస్‌ కార్పోరేట్‌ ఫలితాలు బాగుండడంతోపాటు, యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఫేజ్‌1 ఖరారు కానుందనే అంచనాల నేపథ్యంలో గత సెషన్లో యుఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ జులై 26, 2019 ట్రేడింగ్‌లో ఏర్పరిచిన రికార్డు గరిష్ఠాం 3,027.98 స్థాయికి దగ్గరగా వచ్చి తిరిగి వెనుతిరిగింది. కానీ అప్పటి ట్రేడింగ్‌లో ముగిసిన 3,025.86 స్థాయిని దాటడం గమనార్హం. గత సెషన్లో 3,002.7 వద్ద ప్రారంభమైన

Most from this category