News


దౌడు తీస్తున్న అదానీ గ్రూప్‌ షేర్లు

Thursday 23rd May 2019
Markets_main1558602241.png-25898

కేంద్రంలో తిరిగి ఎన్‌డీఏ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో గురువారం అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. ఈ గ్రూప్‌ కంపెనీ షేర్లైన అదానీ పోర్ట్స్‌, స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పవర్‌, అదానీ టాన్స్‌మిషన్స్‌, అదానీ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లు 7శాతం నుంచి 14శాతం వరకు లాభపడ్డాయి. వీటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌,  అదానీ పోర్ట్స్‌ కంపెనీల షేర్లు తాజాగా 52 వారాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని వెలువడిన తరువాత 4 ట్రేడింగ్‌ సెషన్స్‌లోనే అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 52శాతం ర్యాలీ చేశాయి. నరేంద్ర మోదీ అధికారంలోకి(2014) వచ్చిన నాటి నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 170శాతం‍ ర్యాలీ చేశాయి. అలాగే ఇదే వారంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ గ్యాస్‌ అండ్‌ అదానీ పవర్‌ షేర్లు 26శాతం పెరిగాయి. అదానీ పోర్ట్స్‌ మమన్మార్‌లోని యాంగ్‌జెన్‌ పోర్ట్‌ను అభివృద్ధి, నిర్వహణకు మయన్మార్‌ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. 
 



You may be interested

రికార్డుస్థాయి వద్ద లాభాల స్వీకరణ..నష్టాల ముగింపు

Thursday 23rd May 2019

299 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌  11700 వద్ద కింద ముగిసిన నిఫ్టీ ముంబై: సూచీలు చారిత్మాక గరిష్టానికి తాకిన నేపథ్యంలో జరిగిన లాభాల స్వీకరణ కారణంగా మార్కెట్‌ గురువారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 299 పాయింట్ల నష్టంతో 38,811.39 వద్ద, నిఫ్టీ 80.85 పాయింట్లు క్షీణించి 11,657.05 వద్ద స్థిరపడ్డాయి. వాణిజ్య యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండంతో పాటు, అమెరికా ఫ్యూచర్లు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఎఫ్‌ఎంజీసీ,

5రోజుల కోసం కాదు.. 5ఏళ్ల కోసం చూడాలి

Thursday 23rd May 2019

దేశీయ మార్కెట్లో గురువారం వచ్చిన ర్యాలీ క్రమంగా చప్పబడుతోంది. పలువురు ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల నుంచి దిగివచ్చాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌ ఆరంభలాభాలను పోగొట్టుకుని కేవలం స్వల్ప లాభంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయడం అనవసరమని, సుస్థిర ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మార్కెట్లో మరింత ర్యాలీ ఉంటుందని, అందువల్ల ఐదేళ్ల కాలానికి వేచిచూడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. స్థూల ఆర్థికాంశాలపై ఆందోళనలతో

Most from this category