News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 4 శాతం అప్‌!

Tuesday 18th February 2020
Markets_main1582008098.png-31890

 అదానీ గ్రూప్‌, కేకేఆర్‌, బెయిన్‌ క్యాపిటల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, పిరమాళ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వంటి కంపెనీలతోపాటు 12కు పైగా కంపెనీలు దివాల తీసిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను సొంతంచేసుకునేందుకు బిడ్లు వేశాయి. అదానీ గ్రూప్‌, ఓక్‌ట్రీ క్యాపిటల్‌, ఏఆర్‌సీఐఎల్‌, కేకేఆర్‌ ఇండియా, వెల్‌స్పన్‌ గ్రూపులు డిహెచ్‌ఎల్‌ఎఫ్‌ మొత్తం వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బిడ్లను వేయగా. ఎడెల్వీజ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఫోనిక్స్‌ ఏఆర్‌సీ వార్డే పార్టనర్స్‌ ఎస్‌సీలోవీలు కొన్ని ప్రత్యేకమైన పోర్ట్‌పోలియోలు కొనుగోలు చేయడానికి బిడ్లు వేశాయి. కాగా కంపెనీ బిడ్లను మొత్తం వ్యాపారాన్నీ కొనుగోలు చేసే గ్రూపును ఒక కేటగిరీగా,రిటైల్‌, హోల్‌సేల్‌ పోర్ట్‌పోలియోలను రెండో గేటగిరీలుగా విభజించింది.  దీంతో మంగళవారం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు 4.59 శాతం పెరిగి రూ.10.25 పైసలు వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఆర్‌కామ్‌ 7 శాతం డౌన్‌!

Tuesday 18th February 2020

రూ.23.000 కోట్లను రికవరీ చేసేందుకు.. ప్రస్తుతం ఎన్‌సీఎల్‌టీ పరిధిలో వున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ఆస్తుల్ని విక్రయించడానికి కమిటీ ఆఫ్‌ క్రెడిటర్స్‌ కాల్‌ చేసిన బిడ్లకు   యూవీ అసెట్‌ రికనస్ట్రక‌్షన్‌ కంపెనీ, రిలయన్స్‌ జియోల బిడ్లు దాఖలు చేశాయి.  ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్‌కామ్‌ షేరు 7.14 శాతం పడిపోయి రూ.0.65 పైసలు వద్ద ట్రేడ్‌ అవుతోంది.   

కుప్పకూలిన వొడాఫోన్‌ ఐడియా

Tuesday 18th February 2020

కేర్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ షాక్‌ 10 శాతం పతనమై రూ. 3 దిగువకు  7 రోజుల్లో 44 శాతం దిగజారిన షేరు రూ. 2,500 కోట్లమేర ఏజీఆర్‌ చెల్లింపులు మరో రూ. 1,000 కోట్ల చెల్లింపులకు సిద్ధం సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వొడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులకు ముందుకొచ్చింది. తొలి విడతగా సోమవారం రూ. 2,500 కోట్లను టెలికం శాఖ(డాట్‌)కు చెల్లించింది. వారాంతానికల్లా మరో రూ. 1,000 కోట్లను చెల్లించేందుకు సిద్ధపడుతోంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు

Most from this category