News


లాభాల్లో అదానీ గ్రీన్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌

Wednesday 1st January 2020
Markets_main1577853870.png-30581

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాది సెలవుల్లో కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి మరింత బలపడ్డాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బ్యాంక్‌ కౌంటర్లకు డిమాండ్‌ కనిపించడంతో సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 107 పాయింట్లు పెరిగి 41,360కు చేరింది. నిఫ్టీ సైతం 31 పాయింట్లు పుంజుకుని 12,200 వద్ద ట్రేడవుతోంది. కాగా.. వార్తల ఆధారంగా ఓవైపు అదానీ గ్రీన్‌ ఎనర్జీ, మరోపక్క బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. వివరాలు చూద్దాం..

అదానీ గ్రీన్‌ ఎనర్జీ
అనుబంధ సంస్థ అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ తాజాగా 75 మెగా వాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టును ప్రారంభించినట్లు పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ అదానీ గ్రీన్‌ ఎనర్జీ పేర్కొంది. ఈ ప్లాంటులోని ఉత్పాదనకు ఇప్పటికే మహారాష్ట్ర విద్యుత్‌ పంపిణీ కంపెనీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. కిలోవాట్‌కు రూ. 2.85 చొప్పున 25 సంవత్సరాలపాటు ఒప్పందం అమలులో ఉంటుందని వివరించింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీలో ప్రమోటర్లకు 74.92 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేరు 2.5 శాతం పెరిగి రూ. 171 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 175 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. 

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌
నిధుల సమీకరణ ప్రణాళికలు వెల్లడించిన ఎలక్ట్రిక్‌ ఉపకరణాల కంపెనీ బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 1 శాతం పుంజుకుని 362 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 367 వరకూ ఎగసింది. ఈ నెల 6న కంపెనీ బోర్డు సమావేశంకానున్నట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ వెల్లడించింది. నిధుల సమీకరణకు వీలుగా మార్పిడి రహిత డిబెంచర్లు, తదితర సెక్యూరిటీల జారీ అంశాన్ని బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది



You may be interested

2020లో మార్కెట్‌ను ప్రభావితం చేసే రాజకీయ అంశాలివే!

Wednesday 1st January 2020

గతేడాది ఎన్‌డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో మరోమారు ఎన్నికవడం అతిపెద్ద రాజకీయ విశేషం. 2020లో ఈ విధంగా మార్కెట్‌పై ప్రభావం చూపే వివిధ రాజకీయ అంశాలు ఇలా ఉన్నాయి... - ఢిల్లీ ఎన్నికలు: ఇప్పటికింకా ఎన్నికల కమీషన్‌ ఢిల్లీ ఎన్నికల తేదీలను ప్రకటించలేదు కానీ రాజకీయ పార్టీలు మాత్రం బిజీబిజీగా ప్రచారంలో మునిగిపోయాయి. ఈ దఫా పోటీ ప్రధానంగా ఆప్‌, బీజేపీ మధ్యనే ఉండొచ్చు. కాంగ్రెస్‌ కొన్ని చోట్ల ప్రభావం చూపవచ్చు.

వర్ధమాన మార్కెట్లకు కొత్తేడాది కలిసివస్తుంది!

Wednesday 1st January 2020

నిపుణుల అంచనా అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లతో పోలిస్తే దశాబ్దకాలంగా వెనకంజ వేస్తూ వస్తున్న వర్ధమాన దేశాల ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ట్రెండ్‌ రివర్సల్‌ చూస్తాయని నిపుణులు భావిస్తున్నారు. వర్ధమాన మార్కెట్ల(ఈఎం) వాల్యూషన్లు చౌకగా మారడం, ఈ దేశాల కంపెనీల ఎర్నింగ్స్‌ గ్రోత్‌లో వృద్ధిపై పెరిగిన అంచనాలు.. ఈఎంలను కొత్త ఏడాది పుంజుకునేలా చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఈఎంల్లో పెట్టుబడులు పెంచుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ

Most from this category