News


అమ్మకాల ఒత్తిడిలో అడాగ్‌ షేర్లు

Monday 19th August 2019
Markets_main1566201504.png-27865

అనిల్‌ అంబాని గ్రూప్‌నకు చెందిన అడాగ్‌ షేర్లు సోమవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఈ గ్రూప్‌లోని ప్రధాన షేర్లను రిలయన్స్‌ ఇన్ఫ్రా, రిలయన్స్‌క్యాపిటల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్లు 4శాతం నుంచి 6శాతం క్షీణించాయి. 
రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.46.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన షేర్లు మిడ్‌సెషన్‌ కల్లా 6.50శాతం నష్టపోయి రూ.43.20వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:45నిల.కు షేరు గతముగింపు(రూ.46.30)తో పోలిస్తే 5.50శాతం నష్టంతో రూ.43.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.37.25, రూ.489.55లుగా నమోదయ్యాయి.
రిలయన్స్‌ పవర్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.48.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన షేర్లు మిడ్‌సెషన్‌ కల్లా 6 శాతం నష్టపోయి రూ.45.45 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసాయి. మధ్యాహ్నం గం.12:45నిల.కు షేరు గతముగింపు(రూ.48.30)తో పోలిస్తే 5 శాతం నష్టంతో రూ.45.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.44.85, రూ.487.70లుగా నమోదయ్యాయి.
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- ప్రమోటర్‌ కంపెనీలైన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ టెలికా ఇన్ఫ్రాఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు 11.51శాతం వాటానికి సమానమైన 31.82 కోట్లకు సమానమైన ఈక్విటీ షేర్లను తనఖా పెట్టడంతో ఈ కంపెనీ షేర్లు 4శాతం నష్టపోయి రూ.1.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు రూ.1.15లు, రూ.21.35లుగా నమోదయ్యాయి. You may be interested

ఐడీబీఐ 14.50శాతం అప్‌

Monday 19th August 2019

ప్రైవేట్‌ రంగ ఐడీబీఐ బ్యాంక్ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో  14.50శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.24.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభం నుంచే షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టరు, ట్రేడర్లు ఆస్తకి చూపడంతో ఒక దశలో షేరు 14.50శాతం పెరిగి రూ.28.40 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.2:40ని.లకు షేర్లు గతముగింపు(రూ.24.85)తో పోలిస్తే 12.50శాతం లాభంతో రూ.27.90 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా షేర్లు

భారత్‌ మార్కెట్‌ ఖరీదైనది

Monday 19th August 2019

ఇన్వెస్టర్లు యుఎస్‌ ఈక్విటీల నుంచి బయటకొచ్చి చైనా, జపాన్ మార్కెట్‌లలో ​ప్రవేశించాలని నోమురా, ఆసియా పసిఫిక్ ఈక్విటీ రీసెర్చ్‌ జాయింట్‌ హెడ్‌, జిమ్ మక్కాఫెర్టీ అన్నారు. ‘యుఎస్‌ ఆర్థిక వ్యవస్థను నడిపించే సం‍స్థలలో వాల్‌మార్ట్‌ ముందుంటుంది. ఈ కంపెనీ నుంచి కొన్ని మంచి ఫలితాలను చూశాను.  ఇది వినియోగదారుల విశ్వాసాన్ని తెలుపుతోంది. అదే విధంగా ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే, చైనా దిగ్గజ సంస్థ అలీబాబా, మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్

Most from this category