News


అడాగ్‌ గ్రూప్‌ షేర్ల పతనం

Tuesday 25th June 2019
Markets_main1561454343.png-26561

అనిల్‌ అంబానికి చెందిన అడాగ్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ఎఫ్‌అండ్‌ఓ సెక్యూరిటీస్‌ విభాగంలో టాప్‌-10 లూజర్లలో అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన ఆర్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రా, రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లు టాప్‌ -3 స్థానంలో కొనసాగుతున్నాయి. 
రిలయన్స్‌ పవర్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.4.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు ఇంట్రాడేలో 14శాతం క్షీణించింది. మధ్యాహ్నం గం. 2:30.ని.లకు షేరు గత ముగింపు(రూ.4.60)తో పోలిస్తే 13శాతం నష్టంతో రూ.4:00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎఫ్‌అండ్‌ఓ విభాగంటో టాప్‌-1 లూజర్‌గా కొనసాగుతుంది. 
రిలయన్స్‌ ఇన్ఫ్రాటెక్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.55.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు ఇంట్రాడేలో 10.50శాతం క్షీణించింది. మధ్యాహ్నం గం.2:30.ని.లకు షేరు గత ముగింపు(రూ.56.50)తో పోలిస్తే 9శాతం నష్టంతో రూ.51.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎఫ్‌అండ్‌ఓ విభాగంటో టాప్‌-10 లూజర్లలో రెండో స్థానంలో కొనసాగుతుంది. 
రిలయన్స్‌ క్యాపిటల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.66.85ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు ఇంట్రాడేలో 8.50శాతం క్షీణించింది. మధ్యాహ్నం గం.2:30.ని.లకు షేరు గత ముగింపు(రూ.69.00)తో పోలిస్తే 6.50శాతం నష్టంతో రూ.64.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎఫ్‌అండ్‌ఓ విభాగంటో టాప్‌-10 లూజర్లలో మూడో స్థానంలో కొనసాగుతుంది. 



You may be interested

షార్ట్‌టర్మ్‌ కోసం నార్నోలియా సిఫార్సులు

Tuesday 25th June 2019

స్వల్పకాలానికి దాదాపు 20 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రికమండ్‌ చేస్తోంది. 1. వెల్‌స్పన్‌ కార్‌‍్ప: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 160. స్టాప్‌లాస్‌ రూ. 122. ఇటీవల కాలంలో రూ. 89 వద్ద కనిష్టాన్ని తాకిన తర్వాత వేగంగా రీబౌండ్‌ అయింది. ప్రస్తుతం కీలక డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతోంది. ఇండికేటర్లు మరింత అప్‌మూవ్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. 2. అపోలో టైర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 220.

11850 పాయింట్లు దాటేవరకు బలహీనమే!

Tuesday 25th June 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా గతవారం నిఫ్టీ 11625- 11640 రేంజ్‌లో మద్దతు తీసుకొని పైకి ఎగిసింది. అయితే ఈ వారం తిరిగి బలహీనపడి 11700 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టీలో బలహీనత తొలగాలంటే 11850 పాయింట్ల పైన బలంగా ముగియాలని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ ఆప్షన్స్‌ చూస్తే 11600- 11700 పాయింట్ల వద్ద అధిక ఓఐ కనిపిస్తోంది. అందువల్ల ఈ స్థాయిల వద్ద మద్దతు దొరకవచ్చు. నిఫ్టీ ప్రస్తుతం

Most from this category