News


నష్టాల్లో అడాగ్‌ షేర్లు

Monday 17th June 2019
news_main1560750451.png-26343

  • క్యూ4 ఫలితాలలో నష్టాలను ప్రకటించిన ఆర్‌ ఇన్‌ఫ్రా
  • ఫలితాలకు సరియైన ఆడిట్‌ ఆదారాలు లేవంటున్న ఆడిట్‌ సంస్థలు

సోమవారం అనిల్‌ అంబాని రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వీటిలో తాజాగా క్యు4 ఫలితాలు విడుదల చేసిన రిలయన్స్‌ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరు  11శాతం నష్టపోయి రూ.52.70 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం విడుదల చేసిన 2018-19 నాలుగో త్రైమాసిక ఫలితాలలో రూ.3,301కోట్ల నష్టాలను సంస్థ ప్రకటించింది. రూ.8,500కోట్ల  రైటాఫ్‌ల కారణంగా భారిస్థాయిలో నష్టాలను నమోదు చేసింది. ఆదాయం మాత్రం  రూ.3709 నుంచి రూ.4,234కోట్లకు మెరుగుపడింది.  ఆర్‌ ఇన్‌ఫ్రా జనరల్‌ రిజర్వ్‌నుంచి రూ.6,616కోట్లు కేటాయించడంతో క్యు4 నష్టాలు కొంచెం కట్టడిలో ఉన్నాయి. లేదంటే మరింత నష్టం నమోదు చేసి ఉండేది.  సంస్థ 2018-19 నాలుగోవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడానికి రెండు సార్లు వాయిదా వేసిన విషయం తెలిసిందే.  సంస్థ ప్రకటించిన ఆదాయ, నష్టాలకు సరియైన ఆధారాలు లేవని ఆడిటర్‌లు ఫలితాలపై  అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ ఇన్‌ఫ్రాకు ఇంజనీరింగ్‌, సేకరణ, నిర్మాణ పనులను అందించే కంపెనీలలో సంస్థకు రూ.7,083కోట్ల పెట్టుబడులున్నాయని బీఎస్‌ఆర్‌ అండ్‌ ఎల్‌ఎల్‌పీ, పతాక్‌ హెచ్‌డీ అండ్‌ అసోసియేట్స్‌ వివరించారు. పలు ఇంజనీరింగ్‌ సంస్థలకు కంపెనీ   రూ.1,775కోట్లకు కార్పొరేట్‌ గ్యారెంటీగా ఉంది. ఈకంపెనీలతో ఆర్‌ఇన్‌ఫ్రాకుగల సంబంధానికి సరియైన ఆడిట్‌ ఆధారాలు లేవని ఆడిట్‌ సంస్థలు తెలిపాయి. ఆర్‌ ఇన్‌ఫ్రాకు 33.1శాతం వాటా ఉన్న రిలయన్స్‌ పవర్‌ కూడా మార్చి క్యార్టర్‌లో నష్టాలను నమోదు చేసింది. సోమవారం ట్రేడింగ్‌లో ఇతర సంస్థలైన రిలయన్స్‌ క్యాపిటల్‌ 7శాతం, రిలయన్స్‌ పవర్‌ 3 శాతం, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 5శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి.



You may be interested

బైక్‌ అప్‌గ్రేడ్‌... బీమా అప్‌గ్రేడ్‌

Monday 17th June 2019

దేశంలో వాహనాల వినియోగం పెరిగిపోతోంది. ఏ ఇతర దేశంతో పోల్చి చూసిన ఎక్కువ వృద్ధి మనదేశంలోనే. దేశీయ ఆటో పరిశ్రమ అమ్మకాల్లో 80 శాతం ద్విచక్ర వాహనాలదే ఆధిపత్యం. రవాణా పరంగా అత్యంత సౌకర్యమైనది కావడం వల్లే. అయితే, ఆశ్చర్యకరమైన విషయం  ఏమిటంటే అధిక ఇంజన్‌ సామర్థ్యంతో కూడిన మోటారు సైకిళ్లకు డిమాండ్‌ పెరుగుతుండడం. ఈ విభాగంలో 300 నుంచి 500సీసీ ఇంజన్‌ సామర్థ్యాల బైకుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక

బంగారం బాట ఎటు

Monday 17th June 2019

పెట్టుబడి కోసం అయితే భౌతిక బంగారం వద్దు ఆభరణాలు, కాయిన్లపై చార్జీల రూపంలో ఎంతో నష్టం అందుబాటులో ఎన్నో డిజిటల్‌ సాధనాలు వీటిలో పారదర్శకత ఎక్కువ కోరుకున్నప్పుడు నగదు చేసుకునే సౌలభ్యం కేంద్రం అందించే సార్వభౌమ బాండ్లు ఆకర్షణీయం వీటిపై అదనంగా ఏటా 2.5 శాతం వడ్డీ బంగారం గతంలో ఆభరణంగానే ప్రసిద్ధి పొందగా, నేడు ఓ పెట్టుబడి సాధనంగానూ ఎక్కువ డిమాండ్‌ సంతరించుకుంటోంది. ఇతర పెట్టుబడి సాధనాల్లో ఉండే రిస్క్‌ను ఎదుర్కొనేందుకు గాను సురక్షిత సాధనంగా బంగారాన్ని అంతర్జాతీయంగా

Most from this category