News


గురువారం యాక్టివ్‌ స్టాక్స్‌

Thursday 26th December 2019
Markets_main1577332389.png-30446

దేశీ స్టాక్‌ మార్కెట్లలో గురువారం వార్తల ఆధారంగా కొన్ని స్టాక్స్‌ యాక్టివ్‌గా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా వార్తలలో నిలిచిన ఆయా స్టాక్స్‌ వివరాలు చూద్దాం..

యస్‌ బ్యాంక్‌
బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ యస్‌ బ్యాంక్‌కు చెందిన లోయర్‌ టైర్‌-2 బాండ్లు, అప్పర్‌ టైర్‌-2 బాండ్లతోపాటు.. హైబ్రిడ్‌ టైర్‌-1 బాండ్ల రేటింగును డౌన్‌గ్రేడ్‌ చేసింది. లోయర్‌ టైర్‌-2 బాండ్ల రేటింగ్‌ను BWR AA- నుంచి BWR Aకు డౌన్‌గ్రేడ్‌ చేయగా.. అప్పర్‌ టైర్‌-2, హైబ్రిడ్‌ టైర్‌-1 బాండ్ల రేటింగ్‌ను BWR A+ నుంచి BWR A-కు సవరించింది.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
కెనడాలో కార్యకలాపాలను మరింత విస్తరించినట్లు సాప్ట్‌వేర్‌ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలియజేసింది. ఇందుకు వీలుగా న్యూ బ్రన్స్‌విక్‌లోగల మాంక్టన్‌లో గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది.

లుపిన్‌ లిమిటెడ్‌
కంపెనీకి అంకలేశ్వర్‌లోగల ప్లాంటుకుగాను 2019 తయారీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు లభించినట్లు దేశీ ఫార్మా దిగ్గజం లుపిన్‌ లిమిటెడ్‌ తెలియజేసింది. ఫ్రాస్ట్‌ అండ్‌ సలివాన్స్‌ నుంచి ఈ అవార్డు అందుకున్నట్లు వెల్లడించింది.

నవనీత్‌ ఎడ్యుకేషన్‌
కంపెనీ డైరెక్టర్‌ అనిల్‌ స్వరూప్‌ హోదాను నాన్‌ ఇండిపెండెంట్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మార్పు చేసినట్లు ప్రయివేట్‌ రంగ కంపెనీ నవనీత్‌ ఎడ్యుకేషన్‌ వివరించింది.

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ
నేపాల్‌లో తాజాగా టీవీఎస్‌ NTORQ 125 రేస్‌ మోడల్‌ వాహనాన్ని ప్రవేశపెట్టినట్లు దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్‌ మోటార్‌ పేర్కొంది.

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌
రైట్స్‌ ఇష్యూని జనవరి 7న ప్రారంభించి 21కల్లా ముగించనున్నట్లు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలియజేసింది. అంతేకాకుండా మార్పిడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 2750 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది



You may be interested

2నెలల గరిష్టానికి చేరువలో పసిడి

Thursday 26th December 2019

క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర 2నెలల గరిష్టానికి చేరువులో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియాలో మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ఫ్యూచర్స్‌ ధర 3.50డాలర్ల లాభంతో 1,508.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చల్లో భాగంగా ఇటీవల కుదిరిన తొలి ధపా ఒప్పందంపై అమెరికా, చైనా దేశాధ్యక్షుల అధికారిక సంతకాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా చైనాతో కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు

ప్రారంభంలో సెన్సెక్స్‌ ప్లస్‌, నిఫ్టీ మైనస్‌

Thursday 26th December 2019

ఎటువంటి అంతర్జాతీయ సంకేతాలు వెలువడకపోవడంతో క్రిస్మస్‌ సెలవు అనంతరం గురువారం స్టాక్‌ సూచీలు దాదాపు స్థిరంగా మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో 41,543 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 12,211 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category