News


క్యూ3లో బడా ఇన్వెస్టర్ల అమ్మక, కొనుగోళ్ల వివరాలివే..!

Tuesday 21st January 2020
Markets_main1579590158.png-31070

దలాల్ స్ట్రీట్‌లోని బడాల ఇన్వెస్టర్ల అమ్మకాలు, కొనుగోళ్లపై చిన్నస్థాయి ఇన్వెస్టర్లు ఆస్తకి చూపుతుంటారు. వారు కూడా ఏస్‌ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను అనుసరించి లాభాలను గడించాలని ఆశిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏస్‌ ఇన్వెస్టర్లైన రాధాకృష్ణన్‌ ధమానీ, రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, అశిష్‌ ఖచోలియా, అనిల్‌ కుమార్‌ గోయెల్‌, డాలీఖన్నాలు డిసెంబర్‌ క్వార్టర్‌లో ఏయే షేర్లను కొన్నారో., ఏయే షేర్లను తమ పోర్ట్‌ఫోలియో నుంచి తొలిగించారనే అనే విషయాలు ఇప్పడు చూద్దాం... 

ఈ మూడో క్వార్టర్‌లో రాధాకృష్ట ధమానీ ఇండియా సిమెంట్స్‌లో వాటాను 3.43శాతం నుంచి 4.73శాతానికి పెంచుకున్నారు. డెల్టా కార్ప్‌లో 1.53శాతంగా ఉన్న వాటాను 1.32శాతానికి తగ్గించుకున్నారు. వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, సింప్లెక్స్‌ ఇన్ఫ్రా షేర్లలో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుంగా యథాతథంగా కొనసాగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

మరో ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా టైటాన్‌, ర్యాలీస్‌ ఇండియా షేర్లను పెంచుకున్నారు. అగ్రో టెక్స్‌ ఫుడ్, ఫస్ట్‌సోర్స్‌ సెల్యూషన్స్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ల్లో వాటాలను తగ్గించుకున్నారు. టైటాన్‌లో 6.51శాతం నుంచి 6.69శాతానికి మొత్తం 0.18వాటాను, ర్యాలీ ఇండియాలో 9.76శాతం నుంచి 9.79శాతానికి మొత్తంగా 0.03శాతంగా పెంచుకున్నారు. 

డాలీ ఖన్నా తన పోర్ట్‌ఫోలియోలో పెద్దగా మార్పు చేర్పులు ఏవీ జరగలేదు. షేర్‌హోల్డింగ్‌ గణాంకాల ప్రకారం మూత్తూట్‌ ఫైనాన్స్‌ 1.13శాతం వాటాను, బటర్‌ ఫ్లై గాంధీమతి అప్లైయస్‌లో 1.07శాతం వాటా యథాతథంగా ఉంది. అయితే నాసిల్‌లో మాత్రం తన వాటాను 1.93శాతం నుంచి 1.83శాతానికి స్వల్పంగా తగ్గించారు. 

ఈ మూడో త్రైమాసికంలో అశిష్‌ ఖచోలియా బిర్లాసాఫ్ట్‌ కంపెనీలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. అపోలో ఫైప్స్‌లో 2.01శాతంగా ఉన్న తన వాటాను 3.52శాతానికి, వైభవ్‌ గ్లోబల్‌ 1.48శాతం నుంచి 1.55శాతానికి పెంచుకుంది. ఎంఐఆర్‌సీ ఎలక్ట్రానిక్స్‌లో 2.71శాతం నుంచి 1.46శాతానికి, సీహెచ్‌డీ డెవెలపర్స్‌లో 5.31శాతం నుంచి 5.07శాతానికి, హికాల్‌లో 1.35శాతం నుంచి 1.15శాతానికి పరిమితం చేసుకున్నారు. 

మరోప్రముఖ ఇన్వెస్టర్‌ అనిల్‌ కుమార్‌ గోయల్‌ కేర్‌బీఎల్‌ తన వాటాను తగ్గించుకున్నారు. షుగర్స్‌ కంపెనీల్లో వాటాను పెంచుకున్నారు. ధరమ్‌పూర్‌ షుగర్స్‌ మిల్స్‌లో తన వాటాను 10.54శాతంగా, ఉత్తమ్‌ షుగర్స్‌ మిల్స్‌లో వాటాను 4.75శాతానికి పెంచుకున్నారు.

 You may be interested

నష్టాల మార్కెట్లో మిడ్‌ క్యాప్స్‌ దూకుడు

Tuesday 21st January 2020

అపోలో ట్రైకోట్‌ ట్యూబ్స్‌ కేన్‌ ఫిన్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కేఈఐ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సెంచురీ టెక్స్‌టైల్స్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజాగా ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను కుదించడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. వర్ధమాన దేశాలలో భారత్‌ జీడీపీ మందగించడం ప్రభావం చూపనున్నట్లు ఐఎంఎఫ్‌ పేర్కొంది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమ్మకాలు పెరిగి మార్కెట్లు వెనకడుగు వేశాయి. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 147 పాయింట్లు క్షీణించి 41,382ను తాకగా.. నిఫ్టీ 39 పాయింట్ల

ఈఎంఐలలో పన్ను డిమాండ్‌ చెల్లింపు?

Tuesday 21st January 2020

బిజినెస్‌లు, కంపెనీలకు వెసులుబాటు యోచన దేశంలోనే అత్యధికంగా పన్ను చెల్లింపులకు వేదికగా నిలుస్తున్న ముంబైలో ఇకపై పన్ను చెల్లింపునకు వాయిదా పద్ధతిలో అనుమతించనున్నట్లు తెలుస్తోంది. కఠిన లిక్విడిటీ పరిస్థితులు, బిజినెస్‌లకు ఎదురయ్యే సవాళ్లు వంటి ప్రతికూలతల నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా ముంబైలోని ట్యాక్స్‌ కమిషనర్లు చర్యలు చేపట్టన్నుట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే బిజినెస్‌లు, కంపెనీలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది.  తొలుత 20 శాతం చెల్లింపు ఆదాయపన్ను శాఖ అధికారి నుంచి డిమాండ్‌

Most from this category