News


క్రూడ్‌ కారణంగా పతనమయ్యే షేర్లు కొంటున్నాం...

Wednesday 8th January 2020
Markets_main1578464883.png-30762

దేవాంగ్‌ మెహతా
క్రూడాయిల్‌ ధరతో పతనమయ్యే ఎంఎన్‌సీ ఫార్మా, కన్జూమర్‌ కంపెనీల షేర్లలో నాణ్యమైన వాటిని తాము కొంటున్నామని, పోర్టుఫోలియోలో వీటి వాటా పెంచుకుంటున్నామని సెంట్రమ్‌ వెల్త్‌ సలహాదారు దేవాంగ్‌ మెహతా చెప్పారు. వీటితో పాటు బిల్డింగ్‌ మెటీరియల్స్‌, పెయింట్స్‌, ఎలక్ట్రిక్‌ గూడ్స్‌ కంపెనీల షేర్లను కూడా పెంచుకుంటున్నామన్నారు. ఈ కంపెనీలన్నింటికీ ప్రైసింగ్‌ పవర్‌ ఉందని, స్వల్పకాలిక ఉద్రిక్తతలతో తలెత్తిన నెగిటివిటీ వల్ల ఇవి పతనమవుతున్నాయని వివరించారు. అందుకే వీటిని కొని అట్టి పెట్టుకుంటున్నామన్నారు. ఎర్నింగ్స్‌ సీజన్‌తో మార్కెట్లో రికవరీ రావాలని, బ్యాంకులే ఎర్నింగ్స్‌ రికవరీకి నాయకత్వం వహించాలని చెప్పారు. నాలుగైదు రోజులుగా మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాల కారణంగా పతనమవుతున్నాయన్నారు.

జీడీపీ అంచనాలు తక్కువగా ఉండడాన్ని మార్కెట్‌ ప్రైస్‌ఇన్‌ చేసుకుందన్నారు. అంతర్జాతీయ టెన్షన్ల కారణంగా మార్కెట్లలో లిక్విడిటీ కొరత వస్తే మాత్రం రికవరీ లేటవుతుందని అంచనా వేశారు. ఎఫ్‌ఐఐల నుంచి వస్తున్న నిధుల వరద ఆగిపోతే బడ్జెట్‌ వరకు పెద్దగా రికవరీ ఆశలుండవన్నారు. ఎర్నింగ్స్‌లో రికవరీ రాకుంటే ‘‘పడినప్పుడు’’ అనే సూత్రం ఆధారంగా ఉన్న మార్కెట్లు ‘‘పెరిగితే అమ్ము’’ సూత్రం దిశగా మరలుతాయన్నారు. అయితే దీర్ఘకాలానికి మాత్రం దేశీయ ఈక్విటీలు బాగుంటాయని అంచనా వేశారు. లాంగ్‌టర్మ్‌కు ఇన్స్యూరెన్స్‌ కంపెనీలపై బుల్లిష్‌గా ఉన్నామన్నారు. ప్రస్తుతానికైతే క్రూడ్‌ ధర పెరగడంతో పడే నాణ్యమైన కంపెనీల షేర్లను కొనేందుకే తమ ప్రాధాన్యమని వివరించారు. 



You may be interested

సుజ్లాన్‌- ఎన్‌సీఎల్‌.. బోర్లా

Wednesday 8th January 2020

రుణ చెల్లింపుల్లో సుజ్లాన్‌ ఎనర్జీ విఫలం క్యూ3లో ఎన్‌సీఎల్‌ సిమెంట్‌ ఉత్పత్తి డీలా పశ్చిమాసియాలో తలెత్తిన తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాట పట్టాయి. ఉదయం 11.45 ప్రాంతంలో సెన్సెక్స్‌  280 పాయింట్లు క్షీణించి 40,590 దిగువకు చేరగా.. నిఫ్టీ 92 పాయింట్లు కోల్పోయి 11,961 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడికావడంతో పవన విద్యుత్‌ రంగ కంపెనీ సుజ్లాన్‌ ఎనర్జీ కౌంటర్లో అమ్మకాలు

నష్టాల బాటలో అటో షేర్లు

Wednesday 8th January 2020

మార్కెట్‌ పతనంలో అటోరంగ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 7,921.65 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇండెక్స్ అటో రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఒకదశలో ఇండెక్స్‌ 1.25శాతం నష్టపోయి 7,900.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(8,002.50)తో పోలిస్తే 1.04శాతం నష్టంతో 7,919.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category