News


11884 దాటితే 11981 పాయింట్ల వరకు నిఫ్టీ!

Thursday 31st October 2019
Markets_main1572499624.png-29254

నిపుణుల అంచనా
నిఫ్టీ చార్టుల్లో హ్యాంగింగ్‌ మ్యాన్‌ తరహా క్యాండిల్‌ ఏర్పరిచింది. ఇది టాప్‌ అవుట్‌కు సంకేతంగా కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే గురువారం ముగింపును బట్టి ఈ విషయం నిర్ధారణ చేసుకోవాల్సిఉంటుంది. ప్రస్తుతానికి నిఫ్టీ 11700 పాయింట్ల పైన ఉన్నంత వరకు బుల్స్‌ హవానే ఉండొచ్చు. ఒకవేళ కొంత వెనకడుగు వేసినా, ఈ స్థాయి పైన ఉన్నంత వరకు తిరిగి బుల్స్‌ పగ్గాలు అందుకోగలరని నిపుణుల అంచనా.

తాజా ర్యాలీ మరింతగా కొనసాగాలంటే నిఫ్టీ 11884 పాయింట్ల పైన బలంగా క్లోజవ్వాలని చెబుతున్నారు. ఇదే జరిగితే 11981 పాయింట్లు, ఆపే 12100 పాయింట్ల వరకు పరుగులుండవచ్చు. ఒకవేళ 11784 పాయింట్లను కోల్పోతే స్వల్పకాలిక ప్రాఫిట్‌ బుకింగ్‌ ఉండొచ్చు. దిగువన 11650-11700 పాయింట్ల వద్ద మద్దతు ఉంటుంది. డెరివేటివ్స్‌ డేటా చూస్తే 12000, 11800 పాయింట్ల వద్ద కాల్స్‌, 11800, 11700 పాయింట్ల వద్ద పుట్స్‌ అధికంగా ఉన్నాయి. ట్రేడర్లు నిఫ్టీ కొంచెం వెనుకంజ వేసినప్పుడల్లా అంటే సుమారు 11700 పాయింట్లకు వచ్చినప్పుడల్లా కొత్త లాంగ్స్‌ సమకూర్చుకోవచ్చని నిపుణుల సూచన.
ఎక్స్‌పైరీ దగ్గర పడుతున్నందున సూచీల్లో కదలికలు తీవ్రంగా ఉండొచ్చు. త్వరలో విడుదలయ్యే ఐఐపీ డేటాపై మార్కెట్లు దృష్టి పెడతాయి. అటు యూఎస్‌ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. బుధవారం ఎస్‌అండ్‌పీ 500 రికార్డు హై వద్ద క్లోజయింది. యూఎస్‌ ఫెడ్‌ మరో పావు శాతం వడ్డీరేట్లు తగ్గించడం అక్కడ మార్కెట్లో జోష్‌ నింపింది. దేశీయంగా ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తెస్తుందన్న వార్తలు పాజిటివ్‌ సెంటిమెంట్‌ను కొనసాగించేందుకు దోహదం చేస్తాయి. 



You may be interested

ఫ్లాష్‌..సెన్సెక్స్‌ కొత్త రికార్డు

Thursday 31st October 2019

 గురువారం దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ కొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వం బ్యాంక్‌లు, ఐటీ షేర్ల మద్దతుతో ఉదయం 10.55 సమయానికి 280.50 పాయింట్లు లాభపడి 40312 పాయింట్ల స్థాయిని అధిగమించడం ద్వారా సెన్సెక్స్‌ ఈ ఫీట్‌ను సాధించింది. ఈ ఏడాది జూన్‌ 4న సెన్సెక్స్‌ 40,312 పాయింట్ల వద్ద ఆల్‌టైం రికార్డును ఏర్పరచగా, ఈ రోజు సెషన్‌లో దానిని అధిగమించించింది.  గత సెషన్‌లో  40,051.87 పాయింట్ల వద్ద పాజిటివ్‌గా ముగిసిన ఈ ఇండెక్స్‌, గురువారం

ఎస్‌బీఐపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 31st October 2019

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం ఎస్‌బీఐ షేరుపై పలు బ్రోకరేజ్‌లు పాజిటివ్‌ ధృక్పధాన్ని వెలిబుచ్చుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరకు బ్యాంకు స్లిపేజ్‌లు కట్డడి చెందుతాయని అంచనా వేస్తున్నాయి.  సీఎల్‌ఎస్‌ఏ: అధిక రేట్లు ఆఫర్‌ చేయకుండానే బ్యాంకు మార్కెట్‌వాటా కొల్లగొడుతోంది. డిజిటల్‌ ప్లా్‌ట్‌ఫామ్స్‌ ఇతర బ్యాంకులతో పోలిస్తే ముందుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే బ్యాంకు ఎర్నింగ్స్‌ రికవరీ ఆరంభమవుతుంది. సేవింగ్స్‌ డిపాజిట్స్‌ వృద్ధి 7 శాతానికి చేరడం విశేషం. పీఎస్‌యూ బ్యాంకుల్లో

Most from this category