News


పుస్తక విలువ దిగువకు 105 స్టాకులు

Wednesday 31st July 2019
Markets_main1564555110.png-27437

గత కొన్ని నెలల నుంచి స్టాక్‌ మార్కెట్లు దిద్దుబాట్లకు గురువుతున్నాయి. ఫలితంగా చాలా వరకు కంపెనీల స్టాక్స్‌ వాల్యుషన్‌ ​ తమ పుస్తక విలువ కంటే దిగువకు పడిపోయాయి. మిడ్ క్యాప్ కంపెనీలైన హెచ్‌ఈజీ, గేట్‌వే డిస్ట్రిపార్క్స్, హిమాటింగ్‌కా సీడ్, అపోలో టైర్స్, మహారాష్ట్ర సీమ్‌లెస్, ఎన్‌సిసి, బిర్లా కార్ప్, ఇండియా సిమెంట్స్, ట్రైడెంట్, జెకె టైర్ తదితర కంపెనీల షేర్లు ప్రస్తుతం వాటి పుస్తక విలువ కంటే తక్కువగా ట్రేడవుతన్నాయి. బీఎస్‌ఈ 500 కంపెనీలలో 105 కంపెనీలు ప్రస్తుతం వాటి పుస్తక విలువ కంటే తక్కువగా కోట్ చేస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు. ఈ నెల  ప్రారంభంలో బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌ 6.7 శాతం పడిపోవడంతో పుస్తక విలువ కంటే దిగువకు పడిపోతున్న స్టాకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ‘ఒక స్టాకు తన పుస్తక విలువ కంటే దిగువకు పడిపోతే, అది తక్కువ ధరకు లభిస్తుంది. కానీ ఆ పతనం ముగిసిందా లేదా? అనే విషయాన్ని గమనించాలి’ అని విశ్లేషకులు హెచ్చరించారు. 
 



You may be interested

ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌గా చక్రవర్తి

Wednesday 31st July 2019

ముంబై: ఆర్థిక వ్యవహారాల ‍కార్యదర్శి అతాను చక్రవర్తి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌గా నామినేట్‌ అయ్యారు. ఆర్‌బీఐ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 29 నుంచీ అమల్లోకి వచ్చే ఈ నియామకం తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ అమల్లో ఉంటుంది.  సుభాష్‌ చంద్ర గార్గ్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది. గార్గ్‌ ఈ నెల 25న ఆర్థిక

టెక్‌ మహీంద్రా లాభం రూ.959 కోట్లు

Wednesday 31st July 2019

7 శాతం వృద్ధి  4 శాతం తగ్గిన మార్జిన్‌ రూ.8,653 కోట్లకు ఆదాయం  న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.959 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం, రూ. 898 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,388 కోట్ల నుంచి 5 శాతం పెరిగి రూ.8,653 కోట్లకు చేరిందని కంపెనీ

Most from this category