News


ఐదేళ్ల గరిష్టానికి ఆర్తి డ్రగ్స్‌

Thursday 27th February 2020
Markets_main1582791923.png-32142

గత ఐదు రోజుల్లో 26 శాతం ర్యాలీ
క్యూ3 ఫలితాలు, విస్తరణ ఎఫెక్ట్‌

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ దేశీయంగానూ ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతోంది. వరుసగా ఐదు రోజుల నుంచీ పతనబాటలో సాగుతున్న అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మధ్యాహ్నం 12.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 400 పాయింట్లు పతనం‍కాగా.. నిఫ్టీ 115 పాయింట్లు తిరోగమించింది. ఇంట్రాడేలో 11,537 పాయింట్ల దిగువకు చేరింది. వెరసి బడ్జెట్‌ రోజు నమోదైన కనిష్టానికంటే దిగువను చవిచూసింది. కాగా.. ఈ ఆర్థిక సం‍వత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతోపాటు.. విస్తరణ ప్రణాళికలు అందుబాటులోకి రావడంతో ఫార్మా, కెమికల్స్‌ రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. వివరాలు చూద్దాం..

ఇబిటా అప్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో ఆర్తి డ్రగ్స్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 32 కోట్లకు చేరింది. ఇబిటా సైతం 30 శాతం పుంజుకుని రూ. 67 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 25 శాతం బలపడి రూ. 474 కోట్లను తాకింది. ఇందుకు ఏపీఐ అమ్మకాలు 19 శాతం, ఫార్ములేషన్ల విక్రయాలు 72 శాతం చొప్పున వృద్ధి చూపడం సహకరించింది. కంపెనీ యాంటిడయాబెటిక్‌ ప్రొడక్టుల ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంది. తద్వారా మార్జిన్లను మరింత బలపరుచుకునే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

షేరు జూమ్‌
గత ఐదు రోజుల్లో ఆర్తి డ్రగ్స్‌ షేరు 26 శాతం ర్యాలీ చేసింది. తాజాగా మరోసారి ఎన్‌ఎస్‌ఈలో తొలుత 8 శాతం జంప్‌చేసి రూ. 812కు చేరింది. ఇది ఐదేళ్ల గరిష్టంకాగా..   ఇంతక్రితం 2015 ఏప్రిల్‌లో ఆర్తి డ్రగ్స్‌ షేరు రూ. 874 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో కొంత వెనకడుగు వేసింది. 2.3 శాతం లాభంతో రూ. 764 వద్ద ట్రేడవుతోంది.  
 You may be interested

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓకు 4రోజులు ఎందుకంటే..?

Thursday 27th February 2020

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ కనీస గడువు కాలం 3ట్రేడింగ్‌ సెషన్‌లు ఉంటుంది. కానీ ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ కాలవ్యవధి 4ట్రేడింగ్‌ సెషన్లుగా ఉంది. ఐపీఓ మార్చి 2న ప్రారంభమై అదే నెల 5వ తేదీన ముగుస్తుంది. మార్కెట్‌ రెగ్యూలేటరీ నియమావళి ప్రకారం ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ కనిష్టంగా 3మార్కె్‌ట్‌ పనిదినాలుగానూ, గరిష్టంగా 10 ట్రేడింగ్‌ పనిదినాలు ఉంటుంది. ఇష్యూలో భాగంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35శాతం షేర్లను కేటాయించడంతో ఎస్‌బీఐ కార్డు ఐపీఓకు భారీగా

52 వారాల కనిష్టానికి 233 షేర్లు

Thursday 27th February 2020

గురువారం 233 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, A2Z ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఏబీబీ ఇండియా, అగ్రిటెక్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, అలికాన్‌ క్యాస్ట్‌లాయ్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అంబికా కాటన్‌ మిల్స్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఆంధ్రా పేపర్‌, అపార్‌ ఇండస్ట్రీస్‌, ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆరో గ్రీన్‌టెక్‌, అర్షియా, ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లీస్‌, అసోసియేటెడ్‌ ఆల్కాహాల్స్‌ అండ్‌ బ్రూవరీస్‌, ఆటోమోటివ్‌ యాక్సెలెస్‌,

Most from this category