మార్కెట్లో పాజిటివ్ మార్పు రానుందా?
By D Sayee Pramodh

బుల్లిష్‌గా మారొచ్చని సంకేతాలిస్తున్న బాండ్‌ఈల్డ్స్ దేశీయ మార్కెట్లో కొనసాగుతున్న అమ్మకాల వెల్లువకు శుభం కార్డు పడనుందా? త్వరలో ట్రెండ్ రివర్సల్ కనిపించనుందా? సూచీలు తిరిగి బుల్‌రన్ ఆరంభించబోతున్నాయా?.. అంటే.. అవునంటున్నారు కొంతమంది టెక్నికల్ నిపుణులు. నిఫ్టీ ఎర్నింగ్స్ ఈల్డ్స్‌కు, పదేళ్ల బాండ్ ఈల్డ్స్‌కు మధ్య అంతరం కుంచించుకుపోవడం ఇందుకు నిదర్శనమంటున్నారు టెక్నికల్ నిపుణులు. ఈ విధంగా ఈ రెండింటి మధ్య తేడా తగ్గిపోవడమనేది సూచీల్లో పతనం ఇకపై కొనసాగకపోవచ్చనేందుకు సంకేతంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండిటి మధ్య వ్యత్యాసం సరాసరి కన్నా 2 ఎస్డీ(స్టాండర్డ్ డీవియేషన్స్) తక్కువగా ఉంది. గత 20 ఏళ్లలో ఈ వ్యత్యాసం కేవలం ఏడు మార్లు మాత్రమే 2 ఎస్డీ దిగువకు వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో నిఫ్టీ దాదాపు 20 శాతం దూసుకుపోయిందని గణాంకాలు చూపుతున్నాయి. ఇలాంటి సందర్భం వచ్చిన తర్వాత ఏడాదిలో సూచీలు బలమైన ప్రదర్శన చూపడం గమనించవచ్చని ప్రొఆల్ఫా క్యాపిటల్ మేనేజర్ మెహుల్ పాటిల్ చెప్పారు. దేశీయ సూచీలు గత నెలరోజులుగా అధోముఖంగా పయనిస్తున్నాయి. నిఫ్టీ దాదాపు 5 శాతం, చిన్న స్టాకుల సూచీలు దాదాపు 7-9 శాతం క్షీణించాయి. తాజా పతనంలో వాల్యూషన్లు దిగివచ్చాయి. నిఫ్టీ పీఈ 19.4 నుంచి 17. 7కు పడిపోయింది. గత మూడు నెలల్లో వడ్డీరేట్ల తగ్గింపు అంచనాల నేపథ్యంలో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ దాదాపు 100 బీపీఎస్ పతనమయ్యాయి. గతంలో చివరగా 2016లో ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత బాండ్ ఈల్డ్స్, నిఫ్టీ ఎర్నింగ్స్ ఈల్డ్స్ మధ్య వ్యత్యాసం 2 ఎస్డీ దిగువకు వచ్చింది. అనంతరం 2017లో నిఫ్టీ దాదాపు 33 శాతం ర్యాలీ జరిపింది. తాజా పరిస్థితి ఈక్విటీలకు సానుకూలతను సూచిస్తోందని, త్వరలో డెట్ నుంచి స్టాక్స్ దిశగా పెట్టుబడులు పయనించవచ్చని షేర్‌ఖాన్ అంచనా వేసింది. నిఫ్టీ ఎర్నింగ్స్ ఈ దఫా ఫైనాన్షియల్ రంగ కంపెనీల వల్ల పుంజుకుంటాయని, దీనివల్ల అధిక వాల్యూషన్లకు న్యాయం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
You may be interested
ఈ మూడు రంగాల్ని చూడొచ్చు: యుటీఐ ఎంఎఫ్
Tuesday 30th July 2019ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ఇంకో రెండు, మూడు త్రైమాసికాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.కానీ నెమ్మదిగానైనా మందగమనం తగ్గుముఖం పడుతుందని యుటిఐ ఎంఎఫ్ ఈక్విటీ ఫండ్ మేనేజర్ అండ్ రీసెర్చ్ హెడ్ సచిన్ త్రివేది ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. రేట్ల కోత మంచిదే.. ఎస్బీఐ డిపాజిట్లపై రేట్ల కోత విధించింది. ఇది స్వాగతించాల్సిన విషయం. ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఆర్బిఐ
క్షీణించిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లు
Tuesday 30th July 2019మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్ల పతనం కొనసాగుతుంది. ఎన్ఎస్ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లకు ప్రాతనిథ్యం వహించే పీఎస్‌యూ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మంగళవారం మిడ్‌సెషన్ సమయానికి దాదాపు 2.50 శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్ 2,853.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్ ఒకదశలో దాదాపు 2శాతం మేర నష్టపోయి 2778.55ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది.