News


11945 పైన ముగిస్తే 12280పాయింట్ల వరకు నిఫ్టీ!

Monday 4th November 2019
Markets_main1572840563.png-29324

నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లు గతవారం పాజిటివ్‌గా ముగిశాయి. నిఫ్టీ వారాంతానికి దాదాపు 2.3 శాతం లాభపడింది. ఇప్పటివరకు ప్రధాన సూచీలే ర్యాలీ జరుపుతుండగా క్రమంగా చిన్న స్టాకులు కూడా పాజిటివ్‌గా మారుతున్నాయని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా గతవారం మిడ్‌క్యాప్‌ సూచీ 3 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2 శాతం పైచిలుకు లాభంతో ముగిశాయి. డైలీ చార్టుల్లో నిఫ్టీ డోజీ క్యాండిల్స్‌ ఏర్పరుస్తోంది. ఇవి మార్కెట్లో అనిశ్చితికి నిదర్శనాలు. కానీ వీక్లీ చార్టుల్లో మాత్రం నిఫ్టీ పెద్ద బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. దీన్నిబట్టి నిఫ్టీ మూడ్‌ పాజిటివ్‌గానే ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 11700 పాయింట్ల బ్రేకవుట్‌ నిఫ్టీకి టానిక్‌లా పనిచేస్తుందంటున్నారు. ఈ వారం దేశీయ వీఐఎక్స్‌ 15.73 స్థాయికి చేరింది. ఇది 17 స్థాయి వద్ద నిరోధం ఎదుర్కొంటోంది. దీన్ని దాటితే మార్కెట్లో మూడ్‌ నెగిటివ్‌గా మారవచ్చు. దిగువన 14కు దిగివస్తే ర్యాలీ జోరందుకుంటుంది. 
మరో గరిష్ఠం?
నిఫ్టీకి ఇకపై 111945 పాయింట్ల వద్ద నిరోధం ఉంటుందని,  ఈ స్థాయిని బలంగా దాటలేకపోతే చిన్నపాటి ప్రాఫిట్‌ బుకింగ్‌ ఉండొచ్చని నిపుణుల అంచనా. ఈ స్థాయిని దాటితే మాత్రం నిఫ్టీ గత గరిష్ఠం 12103 పాయింట్లను కూడా దాటి 12280 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చంటున్నారు. ఒకవేళ ఈ స్థాయిని దాటలేక ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా నిఫ్టీ 11820 పాయింట్ల దిగువకు వస్తే సూచీల్లో ర్యాలీ మూడ్‌కు బ్రేకులు పడతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి 11650- 11700 పాయింట్ల వరకు నిఫ్టీ పతనమయ్యే ఛాన్సులున్నాయి. ఈ మద్దతు కూడా కోల్పోతే 11490 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుంది. దీని దిగువన కరెక‌్షన్‌ స్పీడందుకుంటుంది. నవంబర్‌ నెల ఆప్షన్స్‌ పరిశీలిస్తే 11600, 11500 పాయింట్ల వద్ద పుట్స్‌ అధికంగా, 12000, 11800 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల నెలమొత్తం మీద 11500- 12000 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ కదలికలుండొచ్చు. 



You may be interested

మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Monday 4th November 2019

అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశావహన అంచనాలతో సోమవారం మార్కెట్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌ ప్రారంభంలో 3శాతానికి పైగా లాభపడింది. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా పూర్తిస్థాయి ఒప్పందంపై ఇరుదేశాధ్యక్షులు ఈ నెలలో సంతకాలు చేయవచ్చని సంకేతాలను వెలువడ్డాయి. ఈ సానూకూలాంశంతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లకు

15 శాతం క్రాష్‌ నుంచి కోలుకున్న యస్‌బ్యాంక్‌

Monday 4th November 2019

యస్‌ బ్యాంక్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశ పరచడంతో ఈ బ్యాంక్‌ షేరు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమైంది. రూ. 59.95 వద్ద నెగిటివ్‌లో ప్రారంభమైన ఈ షేరు 15 శాతం నష్టపోయి రూ. 56.65 స్థాయికి పడిపోయింది. సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ రూ.629 ‍కోట్ల నికర నష్టాలను(కన్సాలిడేటెడ్‌) ప్రకటించింది. ఈ త్రైమాసికంలో పన్ను వాయిదా సర్దుబాటు భారం రూ.709 కోట్లుగా ఉండడంతో ఈ

Most from this category