STOCKS

News


ఇండియాపై మేం బేరిష్‌....!

Thursday 13th February 2020
Markets_main1581589091.png-31767

విజ్‌డమ్‌ట్రీ ఇన్వెస్ట్‌మెంట్స్‌
సుదీర్ఘకాలంగా ఇండియాపై బుల్లిష్‌గా ఉంటూ, చాలా కాలంగా దేశీయ స్టాకులను రికమండ్‌ చేస్తూ, 2018 మార్కెట్‌ పతనంలో కూడా దేశీయ మార్కెట్‌పై పాజిటివ్‌గా ఉన్న ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ విజ్‌డమ్‌ట్రీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తాజాగా దేశీయ మార్కెట్‌పై బేరిష్‌గా మారింది. భారత వృద్ధిగాధపై విశ్వాసం ఉందని, కానీ ప్రస్తుతం దేశీయంగా రేకెత్తిన రాజకీయ, సాంఘీక టెన్షన్లు ఎకనమిక్‌ రికవరీని మరింత మందగింపజేస్తాయని అభిప్రాయపడింది. ఇదే సంస్థ ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతల సమయంలో భారత్‌ను సురక్షిత పెట్టుబడుల స్థానంగా అభివర్ణించింది. కానీ ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు రిస్కులను చూస్తున్నది. మోదీ తాజాగా ప్రవేశపెడుతున్న చట్టాలు మతపరమైన, దేశభక్తి పరమైన విబేధాలు తెస్తున్నాయని సంస్థ ప్రతినిధి అనీకా గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ, ముస్లిం మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, 2020లో రికవరీ చాలా నెమ్మదిగా ఉండొచ్చని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇండియాను మార్కెట్‌ వెయిట్‌ నుంచి అండర్‌వెయిట్‌కు డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలిపారు. పైగా దేశీయ స్టాకుల భారీ వాల్యూషన్లు ప్రస్తుత మౌలిక పరిస్థితులకు తగ్గట్లుగా లేవని, దశాబ్దకాలంగా వీటి ఈపిఎస్‌లు ఫ్లాట్‌గా ఉన్నాయని తెలిపింది. విజ్‌డమ్‌ట్రీ సంస్థ ఏయూఎం విలువ దాదాపు 6400 కోట్ల డాలర్లు. దేశీయ ఎకానమీ ఇటీవల కాలంలో అల్ప వృద్ధి నమోదు చేయడంతో పలు సంస్థలు దేశీయ జీడీపీ అంచనాలను తగ్గిస్తూ వస్తున్నాయి. 



You may be interested

మళ్లీ కరోనా భయాలు- మార్కెట్లు డీలా

Thursday 13th February 2020

సెన్సెక్స్‌ 106 పాయింట్లు మైనస్‌ 27 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఐటీ, ఫార్మా రంగాల ఎదురీత కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య పెరగుతుండటంతో మరోసారి ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. దీంతో అమెరికా ఇండెక్సుల ఫ్యూచర్స్‌ నీరసించగా.. ఆసియాలోనూ అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 106 పాయింట్లు క్షీణించి 41,460 వద్ద నిలవగా.. నిఫ్టీ 27 పాయింట్లు తక్కువగా 12,175

స్వల్పకాలానికి టాప్‌-10 సిఫార్సులు

Thursday 13th February 2020

జనవరి రిటైల్‌ ద్రవ్యోల్యణ గణాంకాలు, డిసెంబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో గురువారం మార్కెట్‌ నష్టాల బాట పట్టింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు, విశ్లేషకులు స్వల్పకాలానికి  10 షేర్లను రికమెండ్‌ చేస్తున్నారు 1. అనలిస్ట్‌ పేరు: జై థక్కర్‌ షేరు పేరు: ఐసీఐసీఐ బ్యాంక్‌  రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.570 స్టాప్‌ లాస్‌: రూ.537 2. అనలిస్ట్‌ పేరు: జై థక్కర్‌ షేరు పేరు: ఐషర్‌ మోటర్స్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.20,300 స్టాప్‌ లాస్‌: రూ. 18790 3.

Most from this category