News


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13500 స్థాయికి నిఫ్టీ!

Thursday 13th June 2019
Markets_main1560419089.png-26272

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంచనా

నిఫ్టీ సూచీ ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరపు వాస్తవ ఆదాయాలతో పోలిస్తే 18.2 రెట్లు అధికంగా ట్రేడ్‌ అవుతోంది. బడ్జెట్లో మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు పడాలని మార్కెట్‌ వర్గాలు కోరుకుంటున్నాయి. ఈ ఏడాది రెండో భాగంలో కంపెనీ ఎర్నింగ్స్‌ 15 శాతం వృద్ధి చెందుతాయన్న అంచనాలున్నాయి. ఇదే నిజమైతే ఈ ఆర్థిక సంవత్సరం చివరకల్లా నిఫ్టీ ఖచ్చితంగా 13,000-13,500 లకు చేరుకుంటుంది. ఈ తరుణంలో సూచీలు దిగివచ్చినప్పుడల్లా నాణ్యమైన షేర్లను ఎంపిక చేసుకోవాల్సిందిగా ఇన్వెస్టర్లకు బ్రోకింగ్‌ సంస్థ సలహా ఇస్తోంది.

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లకు కొత్త ఉత్సాహం వచ్చింది. దేశీయ వృద్ధిని, కార్పోరేట్‌ పనితీరును పరుగులు పెట్టించేందుకు మోదీ 2.0 ప్రభుత్వం జూలై 05న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పైన ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి. ఊహించని మెజార్టీని ఎన్‌డీఏ కూటమి విజయాన్ని సాధించడంతో విదేశీ ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లతో ఈక్విటీ మార్కెట్లు గరిష్టస్థాయిలను నమోదు చేశాయి. కొత్త ప్రభుత్వం దేశాభివృద్ధికి తీసుకోనున్న సంస్కరణలతో దేశీయవృద్ధి మరింత మెరుగుపడవచ్చనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు గత నాలుగునెలల్లో ఈక్విటీ మార్కెట్లో 11.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఎన్‌డీఏ విజయం, ఇండియా కంపెనీల కార్పోరేట్‌ ఆదాయాలు మెరుగుపడటం, వ్యవస్థలో లిక్విడిటీ కొరత ఆందోళనలు తగ్గించేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఏ తీసుకునే ఉద్దీపన చర్యలు మార్కెట్‌లో రిలీఫ్‌ ర్యాలీ జరిగేందుకు అవకాశం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వృద్ధిని పెంపొందించడంతో పాటు వృద్ధి, ఆర్థిక క్రమశిక్షణల మధ్య సరైన సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అయితే పరిమిత ఆర్ధిక వనరులు, ప్రైవేటు క్యాపెక్స్ లేకపోవడంతో ఇది కఠినమైన పని. 

ఆర్‌బీఐ వరుసగా 3సారీ వడ్డీరేట్లపై 25 బేసిస్‌ పాయింట్ల కోతను విధించింది. అయితే, ద్రవ్యకొరత సంక్షోభాన్ని ఎదుర్కోంటున్న ఎన్‌బీఎఫ్‌సీ రంగంపై ఎలాంటి ప్రకటన చేయడకపోవడం దురదృష్టకరం. ఇండియా జీడీపీలో 30శాతం భాగమైన ఎంస్‌ఎంఈలను ప్రోత్సాహించే ఎన్‌బీఎఫ్‌ఎసీ రంగానికి ద్రవ్య కొరతపై భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు దిగివస్తుడటం ప్రభుత్వానికి కచ్చితంగా కలిసొచ్చే అంశమే అవుతుంది. 

ఇక గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి) ఇండియా జీడీపీ వృద్ధి  5ఏళ్ల కనిష్ట స్థాయి 5.8 శాతానికి పతనమైంది. ఆ ప్రభావం కార్పోరేట్‌ కంపెనీల ఆదాయంపై పడింది.  అందువల్ల, వినియోగ రంగంలో వృద్ధి వేగం పుంజుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బ్రోకరేజ్‌ సంస్థ భావించింది.

కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, గత పదివీకాలంలో చేపట్టిన సంస్కరణలకు ఎలాంటి అవరోధం లేకుండా కొనసాగడం ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు కలిగించే అంశం. ఒకసారి బీజేపీ ఎన్నికల మానిఫెస్టోను ప్రస్తావిచినట్లైతే, మౌలిక, రోడ్డు, హైవే, అర్బన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, రైల్వే రంగాలకు రూ.100 లక్షల కోట్ల మూలధనాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఇండియా కార్పోరేట్‌ కంపెనీలకు పెద్ద అవకాశం. అలాగే నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు వినియోరంగాన్ని మరింత అభివృద్ది చేస్తామని ప్రకటించింది. 

 You may be interested

13 శాతం నష్టపోయిన యస్‌ బ్యాంక్‌

Thursday 13th June 2019

యస్‌ బ్యాంక్‌ షేరు విలువ గురువారం ఇంట్రాడేలో 12.96 శాతం నష్టపోయింది. ఫారిన్‌ బ్రోకరేజి సంస్థ యూబీఎస్‌ ఈ షేరు టార్గట్‌ విలువను రూ.170 నుంచి రూ.90 కి తగ్గించింది.    టార్గెట్‌ ధరను 47శాతం మేర తగ్గించడంతో  షేరు గురువారం నాలుగు సంవత్సరాల కనిష్ఠ స్థాయికిపడిపోయింది.   2015 అగష్ట్టు 24 తర్వాత యస్‌బ్యాంకుకు ఇదే కనిష్ఠ స్థాయి. యూబీఎస్‌ ప్రకారం ఈ రేటు నుంచి కూడా 20

త్వరలో మైండ్‌ట్రీలో మెజార్టీ వాటా సొంతం!

Thursday 13th June 2019

ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ధీమా ఇంజినీరింగ్‌ దిగ్గజం లార్సన్‌–టూబ్రో(ఎల్‌ అండ్‌ టీ) మరికొద్ది కాలంలో మైండ్‌ ట్రీలో మెజార్టీ వాటాను దక్కించుకుంటుందని ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎమ్‌ నాయక్‌ అన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వాటాను  ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా పొందే దారిలో ఉన్నామన్నారు. ప్రస్తుతం ఈ బెంగుళూరు కంపెనీలో ఎల్‌అండ్‌టీ వాటా 28.9శాతానికి చేరింది. జూన్‌ 17 న ప్రారంభమై జూన్‌ 28 ను ముగియనున్న ఓపెన్‌ ఆఫర్‌లో

Most from this category