News


10750 కోల్పోతే 10450 పాయింట్లకు నిఫ్టీ!

Thursday 8th August 2019
Markets_main1565247047.png-27636

నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకంతో వచ్చిన పతనం కొంత విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నిఫ్టీ 10800- 10900 పాయింట్ల మధ్య కొన్ని రోజులుగా కన్సాలిడేట్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో కన్సాలిడేషన్‌ నెగిటివ్‌గా ముగిసి నిఫ్టీ మరోమారు డౌన్‌ట్రెండ్‌లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ దేశీయ మార్కెట్లు వాల్యూషన్‌ ఎక్కువగానే ఉందని, దీనికితోడు ఎకానమీలో చురుకుదనం లేకపోవడం నెగిటివ్‌ సెంటిమెంట్‌ను పెంచుతోందని చెబుతున్నారు. నిఫ్టీ 10750 పాయింట్లను కాపాడుకోలేకపోతే క్రమంగా 10450 పాయింట్ల వరకు బ్రేక్‌డౌన్‌ కావచ్చని వీరు హెచ్చరిస్తున్నారు. 10450 పాయింట్ల వద్ద నిఫ్టీకి చాలా బలమైన మద్దతు ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైస్థాయిలో 11000 పాయింట్లు కీలకం కానుందని, ఈ స్థాయిని బలంగా దాటి క్లోజయితే క్రమంగా 11250- 11400 పాయింట్ల వరకు ర్యాలీ ఉండొచ్చని అంచనా.

గురువారం మధ్యాహ్న సమయానికి నిఫ్టీ 10900 పాయింట్ల పైన నిలబడేందుకు విఫల ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బ్యాంకు నిఫ్టీ కీలకమైన 28000 పాయింట్ల మద్దతును కూడా కోల్పోవడం సూచీలపై ఒత్తిడి పెంచుతోంది. ప్రస్తుతం సూచీల చార్టుల్లో మెజార్టీ ఇండికేటర్లు బేర్స్‌కే అనుకూలంగా కనిపిస్తున్నాయి. అందువల్ల చిన్నపాటి బౌన్స్‌బ్యాక్‌ వచ్చినా వెంటనే అమ్మకాలు జరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణుల సూచన. 



You may be interested

సిప్లా షేర్లకు ఫలితాల షాక్‌

Thursday 8th August 2019

తొలి త్రైమాసికపు ఫలితాలు నిరాజనకంగా నమోదుకావడంతో పాటు బ్రోకరేజ్‌ సంస్థలు షేర్ల కొనుగోలు టార్గెట్‌ ధరను కుదించడంతో దేశీయ ఔషధ దిగ్గజం సిప్లా లిమిటెడ్‌ షేర్లు గురువారం 5శాతం పతనమయ్యాయి. నేడు ఎన్‌స్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.504.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ క్యూ1 ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన క్యూ1లో కంపెనీ 6శాతం స్వల్ప వృద్ధితో రూ.478.2 కోట్ల నికర లాభాన్ని

రిలయన్స్‌ ఇన్ఫ్రా 7 శాతం క్రాష్‌

Thursday 8th August 2019

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో 5.50శాతం ర్యాలీ చేసిన రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ షేర్లు గురువారం నష్టాల బాట పట్టాయి. ఈ కంపెనీ షేర్లు నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.50.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభం నుంచే నుంచే ఇన్వెస్టర్లు ఈ షేర్లకు అమ్మకాలకు మొగ్గుచూపడంతో షేరు ఒకదశలో 9శాతం నష్టపోయి రూ.46.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:15ని.లకు షేరు కిత్రం ముగింపు(రూ.50.25)తో పోలిస్తే 1శాతం నష్టంతో రూ.47.05

Most from this category