News


గత గరిష్ఠాన్ని దాటితే 12300కు నిఫ్టీ!

Thursday 7th November 2019
Markets_main1573099561.png-29409

అనలిస్టుల అంచనాలు
దేశీయ మార్కెట్లు బుధవారం అత్యంత వేగవంతమైన, బలమైన ఇంట్రాడే రికవరీ చూసాయి. దీంతో నిఫ్టీ మరోమారు 12వేల పాయింట్ల స్థాయిని తాకింది. చార్టుల్లో నిఫ్టీ బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. కొద్ది రోజులుగా నిఫ్టీ 11700 పాయింట్ల పైనే క్లోజవడం బుల్లిష్‌ అంశం. నిఫ్టీలో బుల్స్‌ పట్టు కొనసాగుతుందని నిపుణుల అంచనా. ఈ జోరులో నిఫ్టీ మరోమారు గత గరిష్ఠం 12103 పాయింట్లను తాకవచ్చని భావిస్తున్నారు. ఆ స్థాయిల వద్ద కొంత కన్సాలిడేషన్‌ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థాయిని విజయవంతంగా దాటగలిగితే నిఫ్టీ 12300 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ తన డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతోంది. ఇతర ఇండికేటర్లు కూడా బలంగా కనిపిస్తున్నాయి.

ఒకవేళ నిఫ్టీలో ప్రాఫిట్‌ బుకింగ్ వస్తే 11850 పాయింట్ల వద్ద బహుళ మద్దతు స్థాయిలున్నాయి. ఈ స్థాయిని కాపాడుకున్నంత వరకు నిఫ్టీ ర్యాలీకి ఆటంకం ఉండకపోవచ్చు. ఒకవేళ ఈస్థాయిని కోల్పోతే దిగువన 11700 పాయిం‍ట్ల వద్ద అత్యంత బలమైన మద్దతు కనిపిస్తోంది. ఆప్షన్‌ డేటా చూస్తే 11600, 11500 పాయింట్ల వద్ద పుట్స్‌ 12000, 11800 పాయింట్ల వద్ద కాల్స్‌ అధికంగా ఉన్నాయి. కొత్త పుట్‌ రైటింగ్‌ 11700, 12000 వద్ద కనిపిస్తుండగా కొత్త కాల్‌రైటింగ్‌ 12400, 12500 పాయింట్ల వద్ద కనిపిస్తోంది. ఈ డేటాపరిశీలిస్తే నిఫ్టీ కొంతకాలం 11800 -12200 పాయింట్ల రేంజ్‌లోనే కదలాడవచ్చని అంచనా. దేశీయ వీఐఎక్స్‌ మిశ్రమంగా 15- 16 మధ్యన కదలాడుతోంది. గురువారం ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ 12020, సెన్సెక్స్‌ 40660 పాయింట్ల వద్ద కదలాడుతున్నాయి.



You may be interested

71 దిగువకు రూపాయి విలువ

Thursday 7th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం సెషన్‌లో 7 పైసలు నష్టపోయి 71.05 వద్ద ప్రారంభమైం‍ది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 29 పైసలు బలహీనపడి 70.98 వద్ద ముగిసింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పాటు డాలర్‌ కూడా బలహీనపడడం, చమురు ధరలు పడిపోవడం వంటి కారణాల వలన రూపీ పతనం పరిమితమయ్యింది.      ‘ఫేజ్-1 వాణిజ్య ఒప్పందం కోసం యుఎస్‌-చైనా ఆత్రుతగా ఉన్నాయి. ఈ నెలలో

12,000పైన నిఫ్టీ ప్రారంభం

Thursday 7th November 2019

గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లను, ట్రేడర్లను ఊరిస్తున్న 12,000 పాయింట్ల స్థాయిని గురువారం ప్రారంభంలో నిఫ్టీ అందుకున్నది. ఈ సూచి ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాలకే 49 పాయింట్లు జంప్‌చేసి 12,015 పాయింట్ల వద్దకు చేరింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 180 పాయింట్ల లాభంతో మరో కొత్త రికార్డుస్థాయి 40,655 పాయింట్ల వద్దకు చేరింది. 

Most from this category