News


నవరత్నాల్లాంటి సిఫార్సులు

Monday 24th June 2019
Markets_main1561366958.png-26532

వచ్చే రెండు మూడువారాల్లో మంచి రాబడినందించే సత్తా ఉన్న తొమ్మిది స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
1. టిమ్‌కెన్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 790. స్టాప్‌లాస్‌ రూ. 655. ఇటీవలే నిరోధ శ్రేణిని మంచి వాల్యూంలతో బ్రేక్‌చేసింది. బ్రేకవుట్‌ తర్వాత మంచి కన్సాలిడేషన్‌ చూసి తిరిగి గతవారం బౌన్స్‌ చూపింది. ప్రస్తుతం స్వల్పకాలిక డీఎంఏస్థాయిలకు పైన ఉంది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి.
2. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 525. స్టాప్‌లాస్‌ రూ. 445. డబుల్‌ బాటమ్‌ నుంచి ఈవారం బలంగా పైకి ఎగిసింది. టెక్నికల్‌ ఇండికేటర్లు బుల్లిష్‌ సంకేతాలు ఇస్తున్నాయి. స్వల్పకాలిక డిఎంఏలకు పైన ట్రేడవుతూ పాజిటివ్‌గా కనిపిస్తోంది.
ఏంజల్‌ బ్రోకింగ్‌ 
1. అల్ట్రాటెక్‌ సిమెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 4890. స్టాప్‌లాస్‌ రూ. 4425. ఏప్రిల్‌లో రెండేళ్ల నిరోధం నుంచి బుల్లిష్‌ బ్రేకవుట్‌ సాధించింది. అక్కడ నుంచి క్రమంగా రూ. 4900 వరకు ఎగిసింది. గత కొన్ని వారాల్లో తిరిగి పాత బ్రేకవుట్‌ స్థాయిలకు దిగివచ్చింది. ఇకపై ఇక్కడ మద్దతు కూడగట్టుకొని అప్‌ట్రెండ్‌ ఆరంభించేలా సంకేతాలు కనిపిస్తున్నాయి.
2. డా. లాల్‌ పాథ్‌ ల్యాబ్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1310. స్టాప్‌లాస్‌ రూ. 1065. ఆరు నెలల కన్సాలిడేషన్‌ అనంతరం బుల్లిష్‌ పాటర్న్‌ బ్రేకవుట్‌ను నమోదు చేసింది. ఆర్‌ఎస్‌ఐ 60 స్థాయి పైకి చేరి బుల్లిష్‌గా మారింది. ధర కీలక డీఎంఏలకు పైన బలంగా కదలాడుతోంది.
రిలయన్స్‌ సెక్యూరిటీస్‌
1. అంబుజా సిమెంట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 236. స్టాప్‌లాస్‌ రూ. 201. గతేడాది పతనంలో రూ. 200 ప్రాంతంలో బహుళ మద్దతు స్థాయిలను నమోదుచేసింది. తాజాగా స్టోకాస్టిక్‌ ఇండికేటర్‌లో పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పడడం అప్‌మూవ్‌కు సంకేతమిస్తోంది.
2. బ్యాంక్‌ఆఫ్‌బరోడా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 135. స్టాప్‌లాస్‌ రూ. 110. లైఫ్‌టైమ్‌ హై నుంచి కిందకు పతనమై 200 రోజుల డీఎంఏ వద్ద కోలుకుంది. ఇటీవలే ఇక్కడ నుంచి రీబౌండ్‌ చూపుతోంది. గత పతనంలో 50 శాతం రిట్రేస్‌మెంట్‌కు అవకాశాలున్నాయి.
ప్రభుదాస్‌ లీలాధర్‌
1. ఈఐఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 130. స్టాప్‌లాస్‌ రూ. 111. డైలీ చార్టుల్లో బలమైన మద్దతు కూడగట్టుకొని హయ్యర్‌బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. కీలకమైన డీఎంఏ స్థాయికి పైన క్లోజవడం బలాన్ని చూపుతోంది. ఆర్‌ఎస్‌ఐ సైతం ట్రెండ్‌ రివర్సల్‌ సంకేతాలు ఇస్తోంది.
2. ఎస్‌బీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 375. స్టాప్‌లాస్‌ రూ. 333. కొన్ని రోజులుగా కన్సాలిడేషన్‌లో ఉంది. చార్టుల్లో పాజిటివ్‌ క్యాండిల్‌ ఏర్పడి అప్‌మూవ్‌ను చూపుతోంది.
చార్ట్‌వ్యూ ఇండియా 
1. ఎస్‌ఆర్‌ఎఫ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3241. స్టాప్‌లాస్‌ రూ. 2848. నిఫ్టీతో పోలిస్తే బలంగా కనిపిస్తోంది. సూచీలు పడుతున్నా స్టాకు బలంగా ఉన్నందున ప్రస్తుత స్థాయిల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ వెనక్కుతగ్గినా దిగువస్థాయిల వద్ద కొనుగోలు చేయవచ్చు.
2. అల్ట్రాటెక్‌ సిమెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 4790. స్టాప్‌లాస్‌ రూ. 4420. పతనానంతరం రూ. 4425 వద్ద మంచి మద్దతు ఏర్పరుచుకుంది. ఇక్కడ నుంచి పుల్‌బ్యాక్‌కు ఆస్కారం ఉంది. You may be interested

బడ్జెట్‌ ఎవరి వైపు?

Monday 24th June 2019

నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారం చేపట్టాక వచ్చే మొదటి బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసారు? ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేయబోతోంది? మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టేనా?        వచ్చే ఐదేళ్లలో పెట్టుబడులను ఆకర్షించాడానికి, ప్రోత్సాహకాలందించి వినియోగాన్ని పెంచడానికి, సామాజిక మౌలిక వసతులపై ప్రజలను ఖర్చుపెట్టించడానికి భూమి, కార్మిక, మూలధనం, వ్యవస్థాగత తదితర రంగాలలో నిర్మాణాత్మక విధాన మార్పులను నిర్మలాసీతారామన్‌ తన

గ్లెన్‌మార్క్‌ షేర్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌..!

Monday 24th June 2019

6ఏళ్ల కనిష్టానికి పతమైన షేరు​ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ షేర్లకు యూఎఫ్‌ఎస్‌డీఏఏ షాక్‌ ఇచ్చింది. కంపెనీ ఇటీవల ఉపిరితిత్తుల వ్యాధి నివారణకు ర్యాల్ట్రిస్‌పై జనరిక్‌ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు యూస్‌ఎఫ్‌డీఏ అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకుంది. అయితే, ఔషధానికి సంబంధించిన యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌లో, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫ్యాకల్టీస్‌లో ఒక్కొక్క లోపాన్ని గుర్తించి కంప్లీట్‌ రెస్పాస్‌ లెటర్‌(సీఆర్‌ఎల్‌) జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ శుక్రవారం ఎక్స్చేంజీలకు సమాచారం

Most from this category