News


88 షేర్లలో సెల్‌ సిగ్నల్స్‌!

Wednesday 13th November 2019
Markets_main1573637069.png-29558

దేశీయ సూచీలు ఒకరోజు విరామం అనంతరం బుధవారం పాజిటివ్‌గా ఆరంభమై మధ్యాహ్నాన సమయానికి నెగిటివ్‌ జోన్‌లోకి జారాయి. మరోవైపు సోమవారం ముగింపు ప్రకారం 88 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో టాటా పవర్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌, కాస్ట్రాల్‌ ఇండియా, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, న్యూఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, జీఎస్‌ఎఫ్‌సీ, పీటీసీ ఇండియా తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు.


ఎంఏసీడీ అంటే..
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌


మరోవైపు 26 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ఎస్‌సీఐ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అమర్‌రాజా బ్యాటరీస్‌, సింఫనీ, లైకాల్యాబ్స్‌, స్టార్‌ పేపర్‌ మిల్స్‌, ఏసియన్‌ హోటల్స్‌(వెస్ట్‌) తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌పై మాత్రమే ఆధారపడకుండా సొంతంగా అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  You may be interested

క్యూ3లో ఆర్థికవ్యవస్థ బాటమ్‌ఔట్‌: సీఎల్‌ఎస్‌ఏ

Wednesday 13th November 2019

ఆర్థిక వ్యవస్థ డిసెంబర్‌ త్రైమాసికంలో బాటమ్‌ ఔట్‌ అవుతుందని, అటుతర్వాత వీ-ఆకారపు రికవరీ వుండకపోవొచ్చని సీఎల్‌ఎస్‌ఏ ఇండియా, స్ట్రాటజిస్ట్‌, మహేష్‌ నందుర్కర్‌ అన్నారు. ఆర్‌బీఐ ద్రవ్య విధానాలను సరళతరం చేయడంతో లిక్విడిటీ లభ్యత పెరిగిందని, అదేవిధంగా రుణాలను అధికంగా ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడం, వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం, బ్యాంకులకు ప్రభుత్వం మూలధనాన్ని సమకూర్చడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థ రికవరికి తోడ్పాటునందిస్తున్నాయని అన్నారు. వీటితో పాటు తక్కువ బేస్‌ ఉండడం కూడా

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Wednesday 13th November 2019

అంతర్జాతీయ బ్రోకరేజిల టాప్‌ స్టాక్‌ సిఫార్సులు ... బ్రోకరేజి: క్రెడిట్‌ సూసీ అదాని పోర్టు: ఈ కంపెనీ షేరుపై క్రెడిట్‌ సూసీ ‘ఔట్‌ఫెర్ఫర్మ్‌’ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. అంతేకాకుండా కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ. 480 గా నిర్ణయించింది. బొగ్గు, క్రూడ్‌ ఆయిల్‌ ఆధారిత వృద్ధి తగ్గినప్పటికి కంపెనీ కంటైనర్‌ వృద్ధి హేతుబద్ధంగా ఉందని ఈ బ్రోకరేజి తెలిపింది. దామ్రా, కట్టుపల్లి పోర్టుల పనితీరు వలన కంపెనీ మంచి వృద్ధిని నమోదుచేస్తుందని ఈ

Most from this category