News


మే మాసంలో పీఎంఎస్‌లకు లాభాలు

Thursday 27th June 2019
Markets_main1561658488.png-26637

చాలా నెలల తర్వాత మే మాసంలో అధిక శాతం పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌(పీఎంఎస్‌)లు సానుకూల లాభాలను కళ్లజూశాయి. సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి మోదీ సర్కారే విజేతగా నిలవడంతో ఆ నెలలో స్టాక్‌ మార్కెట్లు మంచి ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పీఎంఎస్‌లలో 82 శాతం సానుకూల రాబడులను మేలో సంపాదించాయి. అంతకుముందు ఏప్రిల్‌ నెలలో కేవలం 30 శాతం పీఎంఎస్‌లే సానుకూల రాబడులను సంపాదించడం గమనార్హం. 

 

ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్‌ సర్వీసెస్‌, యూటీఐ ఏఎంసీ ఇవి 8 శాతానికి పైగా రాబడులను ఇచ్చాయి. మంచి పనితీరు చూపించిన వాటిల్లో అసెప్రో అడ్వైజర్స్‌, బసంత్‌ మహేశ్వరి వెల్త్‌ అడ్వైజర్స్‌, 2పాయింట్‌2 క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, సంవిత్తి క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఆల్టర్నేటివ్‌ అస్సెట్‌ అడ్వైజర్స్‌, స్టాలియన్‌ అ‍స్సెట్‌, బీఎన్‌పీ పారిబాస్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియా, డెసిమల్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌ ఇవన్నీ కూడా మే నెలలో 5 నుంచి 6.5 శాతం మధ్య ఇన్వెస్టర్ల పెట్టుబడులపై రాబడులను అందించాయి. 

 

అత్యధికంగా ల్యాండ్‌మార్క్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ మే నెలలో 15.28 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు తీసుకొచ్చింది. అంతకుముందు ఏప్రిల్‌ నెలలోనూ ఈ సంస్థ 15.34 శాతం రాబడులను ఇవ్వవడం గమనార్హం. ఆ తర్వాత క్లబ్‌ మిలియనీర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 12.75 శాతం రాబడులను, గ్రీన్‌ పోర్ట్‌ఫోలియో 8.38 శాతం, ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ 8.37 శాతం, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ప్రైమరీ డీలర్‌షిప్‌ 8.22 శాతం, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్‌ సర్వీసెస్‌ 8.14 శాతం, యూటీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ 8.12 శాతం, ట్రివాంటేజ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ 7.49 శాతం, అసెప్రో అడ్వైజర్స్‌ 6.54 శాతం, బసంత్‌ మహేశ్వరి వెల్త్‌ అడ్వైజర్స్‌ 6.17 శాతం, సేజ్‌వన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ 6.05 శాతం చొప్పున మే నెలలో లాభాలను ఇచ్చాయి.

 

బలమైన, వ్యాపారంలో లీడింగ్‌ కంపెనీలు, సగటు వృద్ధి కంటే ఎక్కువ ప్రదర్శించే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్న మా విధానాలే విజయానికి కారణమని సంవిత్తి క్యాపిటల్‌  సహ వ్యవస్థాపకుడు ప్రభాకర్‌ కుద్వ తెలిపారు. అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేకమైన సేవలు అందించే వాటినే పీఎంఎస్‌లుగా పేర్కొంటారు. రూ.25 లక్షలు ఆ పై మొత్తంలో పెట్టుబడులను ఇవి ఒక్కో ఇన్వెస్టర్‌ నుంచి అనుమతిస్తుంటాయి. వారి రిస్క్‌ కేటగిరీలను బట్టి ఇన్వెస్ట్‌ చేస్తూ అధిక రాబడులను ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. ప్రముఖ సంస్థల్లో మోతీలాల్‌ ఓస్వాల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ 2.14 శాతం, క్వాంటమ్‌ అడ్వైజర్స్‌ 1 శాతం, ఎనామ్‌ ఏఎంసీ స్కీమ్‌ కేవలం 0.30 శాతం రాబడులను ఇవ్వడం గమనార్హం.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు డౌన్‌

Friday 28th June 2019

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలత కారణంగా శుక్రవారం భారత్‌ మార్కెట్‌ నెగిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.45 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,888 పాయింట్ల వద్ద కదులుతోంది. గురువారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,908 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ప్రీమియర్‌ జీపింగ్‌ల మధ్య

ఈ కంపెనీల ఫలితాల్లో స్థిరమైన వృద్ధి

Thursday 27th June 2019

దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా స్వల్ప కాలంలో వచ్చే అస్థిరతల ప్రభావాలను తట్టుకుని మరీ ఇన్వె‍స్టర్లు లాభాలను పోగేసుకోవచ్చు. ఇప్పటి వరకు మార్కెట్‌ గణాంకాలు ఇవే తెలియజేస్తున్నాయి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో మంచి కంపెనీలు సైతం దిద్దుబాటుకు గురై, అందుబాటు ధరల్లో ఉన్నవీ కనిపిస్తున్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా మంచి రాబడులకు అవకాశం ఉంటుంది. అయితే, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే కంపెనీల్లో ఆదాయం, లాభాల పరంగా

Most from this category