ఈ ఏడాది ఐపీవో మార్కెట్లో విజయాలే ఎక్కువ
By Sakshi

ఈ ఏడాది సెకండరీ మార్కెట్లోకి వచ్చిన (ఐపీవో) కంపెనీల్లో చాలా వరకు ఇష్యూలు వాటి జారీ ధర కంటే ఎగువనే ట్రేడవుతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక రంగం వృద్ధి బలహీనపడడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మార్కెట్లు తీవ్ర అస్థిరతలను చవిచూస్తున్నాయి. కానీ, ఐపీవో మార్కెట్‌కు ఇవేమీ పట్టలేదు.! ఎందుకంటే ఈ ఏడాది ఐపీవో ఇష్యూలు బాగానే రాణించాయి. 2019లో ఇప్పటి వరకు లిస్ట్ అయిన 11 కంపెనీల్లో అధిక శాతం వాటి ఇష్యూ ధరల కంటే అధికంగానే ట్రేడ్ అవుతున్నాయి. కేవలం మూడు కంపెనీల స్టాక్స్ ఇష్యూ ధర కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. ఇండియామార్ట్ నివేష్ ఇష్యూ ధర రూ.973 కాగా, ప్రస్తుతం రూ.1,445 వద్ద ఉంది. అంటే 48 శాతం లాభపడింది. నియోజెన్ కెమికల్స్ ఇష్యూ ధర నుంచి ప్రస్తుత ధరకు చూస్తే 47 శాతం పెరిగింది. ఇక మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ 35 శాతం, రైల్‌వికాస్ నిగమ్ 28 శాతం, పాలీక్యాబ్ ఇండియా 13 శాతం, ఆఫిల్ ఇండియా 12.5 శాతం, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ 7 శాతం, చాలెట్ హోటల్స్ 5 శాతం అధికంగా వాటి ఇష్యూ ధరపై ట్రేడ్ అవుతున్నాయి. ఇక గ్జెల్మాక్ డిజైన్ అండ్ టెక్ 5 శాతం, స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ 28 శాతం, ఎంఎస్టీసీ 32 శాతం వాటి ఐపీవో ఇష్యూ ధర కంటే తక్కువకు ట్రేడ్ అవుతున్నాయి. క్లిష్ట సమయాల్లోనూ షేరు రాణించడం, వాటి వృద్ధి అవకాశాలు బలంగానే ఉండడం వల్లేనంటున్నారు విశ్లేషకులు. ‘‘సమర్థమైన వ్యాపార నమూనా, వృద్ధి అవకాశాలు ఉన్న కంపెనీలు ఏ మార్కెట్ పరిస్థితుల్లో అయినా రాణించగలవు’’ అని ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఈక్విటీ అడ్వైజరీ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ సెదాని తెలిపారు. కంపెనీ పుస్తక విలువ కూడా ఇన్వెస్టర్లలో నమ్మకానికి కారణంగా పేర్కొంటున్నారు. ‘‘కొన్ని కంపెనీల పుస్తకాలు చాలా క్లీన్‌గా ఉన్నాయి. ఉదాహరణకు నియోజెన్ కెమికల్స్ ఆదాయంలో 65 శాతం, లాభంలో 90 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ దేశంలో మూడో అతిపెద్ద డయాగ్నోస్టిక్ సేవల కేంద్రంగా అవతరించేందుకు కృషి చేస్తోంది. గత మూడేళ్లుగా డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేస్తోంది. ఇది 20 శాతం సమీపంలో ఉంది. అందుకే ఈ షేర్లు రాణించాయి’’ అని ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ తెలిపారు. అయితే, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో మంచి వ్యాపార, వృద్ధి నమూనాలు ఉన్న కంపెనీలు సైతం ఇటీవల కరెక్షన్లో నష్టపోయాయని, దీర్ఘకాలం కోసం ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించొచ్చని నదీమ్ సూచించారు.
You may be interested
పెట్టుబడులపై టాస్క్‌ఫోర్స్ దృష్టి
Wednesday 11th September 2019అనంతరం కేంద్రం నుంచి నిధులు మరో ఒకటి రెండు ఉద్దీపన ప్రకటనలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నై: మౌలికరంగ ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్.. కేంద్రం నుంచి నిధుల సహకారం అవసరమైన రంగాలను గుర్తించే పనిలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వినియోగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తన వ్యయాలను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ఇందులో మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడమే ఉత్తమమని
సిప్ పెట్టుబడుల్లో క్షీణత.. దేనికి సంకేతం!
Tuesday 10th September 2019మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఎక్కువగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడులపై ఎక్కువగా ఆధారపడి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత రెండు మూడేళ్లుగా పరిశ్రమ ఆస్తుల వృద్ధికి సిప్ పెట్టుబడుల రాక ఇతోధికంగా సాయపడుతోంది. కానీ, ఈ ట్రెండ్ బలహీనపడినట్టు ఆగస్ట్ నెల గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ యాంఫి డేటా ప్రకారం... ఆగస్ట్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ నూతన ఫోలియోల