News


మార్కెట్లు బుల్లిష్‌... స్టాక్స్‌ బేరిష్‌

Saturday 22nd June 2019
Markets_main1561142862.png-26481

ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మంచి బుల్స్‌ జోరు మీద ఉన్నాయి. సూచీలు దిద్దుబాటుకు లోనవడం, అంతే వేగంగా ఆ నష్టాలను పూడ్చేచుసుకుని మళ్లీ లాభాల మెరుపులు మెరిపించడం చూస్తున్నాం. గతేడాది నుంచి చూసుకుంటే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో చాలా వరకు భారీగా నష్టపోయినవే. కేవలం నిఫ్టీ, సెన్సెక్స్‌లోని ఎంపిక చేసిన కొన్ని షేర్లు ర్యాలీ చేస్తూ సూచీలను బలంగా నిలబెడుతున్నాయి. దీంతో మార్కెట్లు బుల్లిష్‌గా కనిపిస్తున్నాయి. కానీ, విడిగా స్టాక్స్‌ చూసుకుంటే మాత్రం బేరిష్‌ దశలోకి వెళ్లిపోయాయి. ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో 75 శాతం స్టాక్స్‌ వాటి 200 డీఎంఏ (200 రోజుల చలనం) కంటే దిగువనే ఉన్నాయి. ఇది బేరిష్‌ దశకు సంకేతమేనని నిపుణులు పేర్కొంటున్నారు. 

 

సూచీల్లోని సగం స్టాక్‌లో బేరిష్‌లోనే
నిఫ్టీ-50 ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 7 శాతం ర్యాలీ చేసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 250 మాత్రం 5 శాతానికి పైగా క్షీణించాయి. బేరిష్‌ దశలోకి వెళ్లినవి కేవలం చిన్న, మధ్య స్థాయి కంపెనీలే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నిఫ్టీ-50లోని భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐచర్స్‌ మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతి సుజుకీ ఇండియా, సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, వేదాంత, యస్‌ బ్యాంకు, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు వాటి 200డీఎంఏకు దిగువన ట్రేడవుతున్నాయి. అంటే నిఫ్టీ-50లోని 42 శాతం కంపెనీల పరిస్థితి ఇలా ఉంది. 

 

50డీఎంఏకు పైన...
ఇలా 200 డీఎంఏ దిగువన ట్రేడవుతున్న కంపెనీల్లో... అవెన్యూ సూపర్‌మార్ట్‌, ఏసీసీ, అదానీ గ్రీన్‌, బ్యాంకు ఆఫ్‌ బరోడా, దీపక్‌ ఫర్టిలైజర్స్‌, క్రిసిల్‌, కొచిన్‌ షిప్‌యార్డ్‌, ఐసీఐసీఐ సెక్యూరి టీస్‌, జైప్రకాష్‌ అసోసియేట్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, క్యాడిలా హెల్త్‌కేర్‌, ఐడీబీఐ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు, హిందుస్తాన్‌ జింక్‌, సియట్‌, క్యాస్ట్రాల్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంకు, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ ఇలా చాలా కంపెనీలనే ఉన్నాయి. ‘‘200 డీఎంఏ దిగువన స్టాక్‌ ట్రేడింగ్‌ అన్నది కరెక్షన్‌ జోన్‌లో ఉన్నట్టు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ ప్రస్తుతం మంచి స్థితిలో ఉంది. కానీ, విడిగా స్టాక్స్‌ మాత్రం చాలా వరకు నష్టపోయి ఉన్నాయి. 50డీఎంఏకు పైన నిలదొక్కుకున్న వాటిపై దృష్టి సారించడం మంచిది’’ అని ప్రభుదాస్‌ లీలాధర్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ వైశాలి పరేఖ్‌ పేర్కొన్నారు. నిఫ్టీ 11,550 కంటే దిగువకు పడిపోతుందని తాను అనుకోవడం లేదన్నారు. ఫార్మా, క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాక్స్‌ను ప్రస్తుత దశలో పరిశీలించొచ్చన్నారు.

 

మూవింగ్‌ యావరేజ్‌ (సగటు చలనాలు) అన్నవి స్టాక్‌, ఇండెక్స్‌ ట్రెండ్‌ను విశ్లేషించేందుకు చూసే అంశం. ట్రేడర్లు లేదా ఇన్వెస్టర్లు ముఖ్యంగా 50డీఎంఏ, 100డీఎంఏ, 200 డీఎంఏలను చూస్తుంటారు. ఒక స్టాక్‌ ఈ మూడు డీఎంఏలకు పైన ట్రేడ్‌ అవుతుంటే అది పూర్తి అప్‌ట్రెండ్‌కు సంకేతం. కరెక్షన్‌ సమయాల్లో సాధారణంగా స్టాక్స్‌ వాటి గరిష్ట ధరల నుంచి పడిపోతూ 50డీఎంఏ, 100 డీఎంఏ వద్ద మద్దతు తీసుకుంటుంటాయి. కానీ, కరెక్షన్‌ తీవ్రమైనది అయితే స్టాక్స్‌ కానీ, ఇండెక్స్‌ కానీ 200 డీఎంఏకు దిగువకు కూడా వెళ్లిపోతాయి. స్టాక్స్‌కు అయినా, ఇండెక్స్‌కు అయినా 200డీఎంఏ చాలా మద్దతుగా నిలుస్తుంది. ఈ దశలో కనిష్ట స్థాయిలకు చేరాయని కొనుగోళ్లు చేయడం కాకుండా అస్థిరతలు తగ్గిపోయే వరకు తక్కువ పొజిషన్లతో ఉండడం మంచిదని ఏంజెల్‌ బ్రోకింగ్‌ చీఫ్‌ అనలిస్ట్‌ సమీత్‌ చావన్‌ సూచించారు. You may be interested

వాల్‌మార్ట్‌కు 282 మిలియన్ డాలర్ల జరిమానా

Saturday 22nd June 2019

వాషింగ్టన్‌: భారత్‌ సహా నాలుగు దేశాల్లో అవినీతి నిరోధక చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలను సెటిల్‌ చేసుకునేందుకు గాను అమెరికన్ నియంత్రణ సంస్థలకు రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ 282 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించనుంది. నిబంధనలకు విరుద్ధంగా వాల్‌మార్ట్‌ తరఫున థర్డ్‌ పార్టీ మధ్య వర్తులు విదేశాల ప్రభుత్వాధికారులకు చెల్లింపులు జరపడం ద్వారా ఉల్లంఘనలకు పాల్పడినట్లు అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) నిర్ధారించడంతో ఇందుకు కారణం. ఎస్‌ఈసీకి 144

ట్రేడ్‌వార్‌ కంటే ఆయిల్‌, రూపీ పెద్ద రిస్క్‌లు!

Saturday 22nd June 2019

పన్ను తగ్గింపులు, గ్రామీణ, చిన్న, పెద్ద పట్టణాల్లో వినియోగానికి ఊతమిచ్చే నిర్ణయాలు వచ్చే నెల కేంద్ర బడ్జెట్‌లో ఉండొచ్చని ఏంజెల్‌ బ్రోకింగ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ మయురేష్‌ జోషి అంచనా వేశారు. వ్యక్తులకు సంబంధించి పన్న రేట్ల కోత ఉండొచ్చని, పలు మినహాయింపులతోపాటు భారీ ఉద్యోగాలు కల్పించే ఎంఎస్‌ఈ, ఎంఎస్‌ఎంఈలకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు ఉండొచ్చన్నారు. అజెండాలో కార్పొరేట్‌ పన్ను కోత ఉన్నప్పటికీ, నిధుల సమీకరణ లక్ష్యాలపై ఉన్న ఒత్తిళ్లు

Most from this category