News


స్టాప్‌లాస్‌తో స్వల్పకాలానికి రికమండేషన్స్‌

Monday 24th February 2020
Markets_main1582537211.png-32046

జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
మారికో, బీవోబీ, టాటా స్టీల్‌, ఐటీసీ

 

గత వారం కన్సాలిడేషన్‌ మధ్య ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 12,100 స్థాయికి చేరింది. ఈ వారం ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు కారణంగా మార్కెట్లు మరోసారి హెచ్చుతగ్గులను చవిచూసే వీలున్నదంటున్నారు విశ్లేషకులు. కరోనా ఆందోళనలతో ప్రస్తుతం నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌ దిగువన ట్రేడవుతోంది. దీంతో ఈ వారం నిఫ్టీ పుంజుకునే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. 11,900- 12,300 పాయింట్ల శ్రేణిలో కొంతకాలంగా సంచరిస్తున్నదని.. ఈ స్థాయిలను చేదిస్తే.. నిఫ్టీ ఎగువముఖంగా లేదా దిగువముఖంగా వేగమందుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో చార్టుల ప్రకారం బ్రేకవుట్‌ అయిన కొన్ని కౌంటర్లను సూచిస్తున్నారు. వివరాలు చూద్దాం..

- అజిత్‌ మిశ్రా, రీసెర్చ్‌ వైస్‌ప్రెసిడెంట్‌, రెలిగేర్‌ బ్రోకింగ్‌
మారికో లిమిటెడ్‌
గత ఐదు నెలలుగా మారికో లిమిటెడ్‌ కౌంటర్‌లో దిద్దుబాటు జరుగుతోంది. ప్రస్తుతం 200 రోజుల చలన సగటు ప్రకారం కీలక మద్దతు స్థాయిలవద్ద కదులుతున్నట్లు వారపు చార్టులు సూచిస్తున్నాయి. తద్వారా కన్సాలిడేషన్‌ నుంచి బయటపడి ఎగువముఖంగా సాగే వీలున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ షేరుని రూ. 325 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ. 296 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
బ్రేకవుట్‌ సాధించాక కన్సాలిడేషన్‌ శ్రేణిలో మద్దతు స్థాయిల(నెక్‌లైన్‌)కు సమీపంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేరు కదులుతోంది. ఈ స్థాయిల నుంచి ఫ్రెష్‌ అప్‌మూవ్‌ను చార్టులు సూచిస్తున్నాయి. ఈ షేరుని రూ. 3550 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ. 3270 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

- మేహుల్‌ కొఠారి, సీనియర్‌ టెక్నికల్‌ నిపుణులు, ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 
2009లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కౌంటర్‌ రూ. 80ను బ్రేక్‌చేసి రూ. 192 వరకూ ర్యాలీ చేసింది. తదుపరి మళ్లీ రూ. 80 స్థాయిని పరీక్షించాక రూ. 222 వద్ద టాప్‌ క్రియేట్‌ అయ్యింది. ఆపై నిరవధిక పతనంతో రూ. 80 స్థాయికి మరోసారి చేరుకుంది. గత దశాబ్ద కాలంగా ఈ స్థాయిలో బీవోబీ కౌంటర్‌కు డిమాండ్‌ పుడుతోంది. వెరసి ఈ కౌంటర్‌ ఇక్కడినుంచి బలపడవచ్చని భావిస్తున్నాం. రూ. 92 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ. 77 వద్ద స్టాప్‌లాస్‌ ఉంచుకోవాలి.

ఐటీసీ లిమిటెడ్‌
2018 సెప్టెంబర్‌ తదుపరి ఐటీసీ కౌంటర్‌ దిద్దుబాటు బాటలో సాగుతోంది. గరిష్టం రూ. 317 నుంచి చూస్తే 36 శాతం విలువను కోల్పోయింది. ఇటీవల రూ. 200 స్థాయిలో మద్దతును కూడగట్టుకుంది. తద్వారా చార్టులు బుల్లిష్‌ ధోరణిని సంకేతిస్తున్నాయి. ఈ షేరుని రూ. 220 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ. 198 వద్ద స్టాప్‌లాస్‌ అమలు చేయాలి.

- సమీత్‌ చవాన్‌, టెక్నికల్‌, డెరివేటివ్స్‌ నిపుణులు, ఏంజెల్‌ బ్రోకింగ్‌
కిరీ ఇండస్ట్రీస్‌
రెండు నెలలుగా ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్ల బాటలో కిరీ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ సైతం సాగవలసి ఉంది. మూడు నెలలుగా ఈ కౌంటర్‌లో కన్సాలిడేషన్‌ జరిగింది. ఇటీవలే భారీ ట్రేడింగ్‌ పరిమాణంతో ఎగువముఖంగా బ్రేకవుట్‌ నమోదైంది. దీంతో మరింత బలపడనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ షేరుని రూ. 464 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ. 398.5 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది. 

టాటా స్టీల్‌
చైనాలో సంభవించే పరిణామాలు టాటా స్టీల్‌ కౌంటర్‌పై అధిక ప్రభావాన్ని చూపుతుంటాయి. ఇటీవల ఈ షేరు కనిష్ట స్థాయిల నుంచి ఒక్కసారిగా జోరం‍దుకుంది. అయితే కరోనా వైరస్‌ ఆందోళనలు ఈ కౌంటర్‌లో ర్యాలీని దెబ్బతీశాయి. తద్వారా లాభాల స్వీకరణకు తెరలేచింది. అయితే ప్రతికూలతల ప్రభావానికి లోనైన ఈ షేరు మళ్లీ బలపడే వీలున్నట్లు సాంకేతిక అంశాలు సూచిస్తున్నాయి. రూ. 468 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ. 428 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది. 

- అమిత్‌ గుప్తా, డెరివేటివ్స్‌ హెడ్‌, ఐసీఐసీఐ డైరెక్ట్‌
స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ)
పీఎస్‌యూ బ్యాంకింగ్‌ రంగంలోని ఇతర కౌంటర్లతో పోలిస్తే ఎస్‌బీఐ నిలకడను ప్రదర్శిస్తోంది. అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో నేపథ్యంలో లాంగ్‌ పొజిషన్లు పెరిగాయి. ఈ కౌంటర్లో ప్రస్తుతం రికార్డ్‌ స్థాయిలో ఓపెన్‌ ఇంట్రస్ట్‌ నమోదైంది. రూ. 330, రూ. 340 స్ట్రైక్స్‌వద్ద కాల్‌ రైటింగ్‌ జరిగింది. ఇటీవల రికవరీ కారణంగా పొజిషన్లు క్లోజ్‌ చేసుకోవడం కనిపిస్తోంది. దీంతో డౌన్‌సైడ్‌ రిస్క్‌ తక్కువగా కనిపిస్తోంది. రూ. 348 టార్గెట్‌తో ఈ షేరుని కొనుగోలు చేయవచ్చు. రూ. 317 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది. You may be interested

కునాల్‌ బోత్రా నుంచి 3స్టాక్‌ సిఫార్సులు

Monday 24th February 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం సెన్సెక్స్‌ ఏకంగా 807 పాయింట్లను కోల్పోయి 40,363 వద్ద, నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో 11850 దిగువున 11,838 వద్ద ముగిశాయి. ఈ నేపథ్యంలో  ప్రముఖ మార్కెట్‌ అనలిస్ట్‌ కునాల్‌ బోత్రా ట్రేడింగ్‌ పరంగా మూడు స్టాక్స్‌ను ఆయన సూచించారు. అందులో ఎస్‌బీఐ, మణప్పురం షేర్లను కొనమని సిఫార్సు చేస్తూ, ఎస్‌ఆర్‌ఎఫ్‌ షేరును విక్రయించమని సలహానిచ్చారు. ఇప్పుడు ఆయా షేర్లపై బోత్రా సంపూర్ణ విశ్లేషణలు

2% పడిపోయిన ఆటో ఇండెక్స్‌!

Monday 24th February 2020

సోమవారం నీఫ్టీ ఆటో ఇండెక్స్‌ 2.33 శాతం పడిపోయి 7,518.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఇండెక్స్‌లో భాగమైన అశోక్‌లేలాండ్‌ 1.72 శాతం పెరిగి 85.75 వద్ద ట్రేడ్‌ అవుతుండగా.. టీవీఎస్‌ మోటార్స్‌ 0.39 శాతం తగ్గి 444.70 వద్ద, ఎంఆర్‌ఎఫ్‌ 1 శాతం తగ్గి 70,078.85 వద్ద, ఎంఅండ్‌ఎం 1.47 శాతం తగ్గి 517.20 వద్ద, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ హీరో మోటోకార్ప్‌, బాష్‌ , బజాజ్‌ ఆటో, భారత్‌

Most from this category