News


ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టిన బ్యాంకులు మనవే

Saturday 24th August 2019
Markets_main1566585614.png-27977

అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టిన టాప్‌-10 బ్యాంకుల్లో 7 ‍బ్యాంకులు మన దేశానివే కావడం ఆశ్చర్యం కలిగించకమానదు. బ్లూంబర్గ్‌ డేటాను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. మన బ్యాంకులకు ఇక ముందూ మరిన్ని గడ్డు రోజులు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక మొండి బకాయిల భారాన్ని మన బ్యాంకులు మోస్తున్న విషయం విదితమే.

 

మన దేశ ఆర్థిక రంగం మందగమనంలోకి వెళ్లిన నేపథ్యంలో బ్యాంకులు ఎన్‌పీఏల పరంగా మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. మరోవైపు ఎన్‌బీఎఫ్‌సీ రంగంలోనూ తీవ్ర సంక్షోభ పరిస్థితులు కళ్లకు కడుతూనే ఉన్నాయి. ‘‘ఆస్తుల నాణ్యత సమస్య, నిధుల సమీకరణ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకులకు, ఆర్థిక రంగ మందగమనం రెండు రకాల కష్టాలను తెచ్చిపెట్టేదే’’ అని ప్రభుదాస్‌ లీలాధర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనలిస్ట్‌ ప్రతేష్‌ బంబ్‌ పేర్కొన్నారు. 

 

ఇక ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించిన స్టాక్స్‌లో యస్‌ బ్యాంకు అగ్ర స్థానంలో ఉంది. ఈ ఏడాది ఇప్పటికు 60 శాతం ఈ స్టాక్‌ నష్టపోయింది. ఆ తర్వాత ఇంతే మొత్తం ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువను తుడిచిపెట్టింది ప్రభుత్వరంగ బ్యాంకు ఐడీబీఐ. దీని తర్వాత సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా 50 శాతం, బ్యాంకు ఆఫ్‌ ఇండియా 40 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంకు 39 శాతం, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు 38 శాతం, కార్పొరేషన్‌ బ్యాంకు 38 శాతం వరకు ఈ ఏడాది నష్టపోయాయి. టాప్‌-10 నష్ట జాతక బ్యాంకుల్లో మిగిలినవి విదేశీ బ్యాంకులు. ఇక ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌ 37 శాతం, అలహాబాద్‌ బ్యాంకు 33 శాతం వరకు ఈ ఏడాది నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. యస్‌ బ్యాంకు నిర్వహణ బాధ్యతల నుంచి ప్రమోటర్‌ రాణా కపూర్‌ తప్పుకోవడం, కొత్త సీఈవో గిల్‌ సారథ్యంలో బ్యాంకుల ఆస్తుల నాణ్యత లోగుట్టు బయటకు రావడంతో ఈ స్టాక్‌ను బడా ఇన్వెస్టర్లు వదిలించుకునేందుకు మొగ్గు చూపించారు. ఫలితమే భారీ పతనం. ఇక ఐడీబీఐ బ్యాంకు ఆస్తుల నాణ్యత అత్యంత దారుణంగా మారపడం ఆ స్టాక్‌ను నష్టపరిచింది. ప్రభుత్వరంగ బ్యాంకుల కన్సాలిడేషన్‌, వాటికి భారీగా పెరిగిపోయిన ఎన్‌పీఏలు, ప్రభుత్వ సహకారం పరిమితం నేపథ్యంలో అవి పెద్ద ఎత్తున నష్టపోయాయి. You may be interested

‘2002-03 తరహా సంక్షోభం కాదు..’

Saturday 24th August 2019

ఆర్థిక రంగంలో ప్రస్తుతం నెలకొన్న బలహీనత 2002-03 నాటి సంక్షోభం మాదిరి కాదన్నారు క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌ పరిశోధన విభాగం హెడ్‌ గౌరవ్‌గార్గ్‌. ప్రస్తుత ఆర్థిక వాతావరణాన్ని బేర్‌ మార్కెట్‌తో పోల్చరాదని అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఆరోగ్యకమైర దిద్దుబాటుకు గురయ్యాయని, ఇకపై అప్‌సైడ్‌ ఉంటుందని పేర్కొన్నారు.    ‘‘సూచీలు గరిష్టాల నుంచి 10 శాతం మేర కరెక్షన్‌కు గురయ్యాయి. కనుక ఇన్వెస్టర్లు తాము ఇన్వె‍స్ట్‌ చేయదలిచిన మొత్తంలో 60 శాతాన్ని నాణ్యమైన స్టాక్స్‌లో

10800 పైన ముగిసిన నిఫ్టీ

Friday 23rd August 2019

228 పాయింట్ల పెరిగిన సెన్సెక్స్‌  మూడు రోజుల నష్టాలకు ముగింపు  రాణించిన మెటల్‌, ఐటీ, ఫార్మా షేర్లు మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మూడురోజుల నష్టాలకు శుక్రవారం తెరపడింది. సెన్సెక్స్‌ 228 పాయింట్ల లాభంతో 36701 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 88 పాయింట్లు పెరిగి 10829.35 వద్ద స్థిరపడింది. ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లు, ఎఫ్‌ఎంజీసీ తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్‌ లాభపడ్డాయి. ప్రైవేట్‌రంగ బ్యాంక్‌

Most from this category