News


ఈ షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ బుల్లిష్‌!

Tuesday 14th January 2020
Markets_main1578990841.png-30922

సోమవారం ముగింపు ప్రకారం 63 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోంది. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఇన్ఫోసిస్‌, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా, అదానీ పవర్‌, జస్ట్‌ డయిల్‌, అవెన్యూ సూపర్‌ మార్ట్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, బీఈఎల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, పెట్రోనెట్‌, టాటాకాఫీ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 18 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. టీసీఎస్‌, ఆర్‌క్యాప్‌, ధర్మపూర్‌ సుగర్‌, ఐఓబీ, మ్యూజిక్‌ బ్రాడ్‌ కాస్ట్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
ఎంఏసీడీ అంటే..
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  You may be interested

సిమెంట్‌, రియల్టీ రంగాలు భేష్‌?!

Tuesday 14th January 2020

స్థానిక కంపెనీలకు అవకాశాలెక్కువ సిమెంట్‌లో అల్ట్రాటెక్‌ పరిశీలించొచ్చు గోద్రెజ్‌, ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌.. గుడ్‌ -యస్‌ సెక్యూరిటీస్‌ నిపుణులు ప్రశాంత్‌ పటిష్ట యాజమాన్య నిర్వహణలో ఐటీ దిగ్గజం టీసీఎస్‌.. డిజిటల్‌, ప్రొడక్టుల విభాగాలలో స్థిరమైన వృద్ధిని చూపుతున్నట్లు యస్‌ సెక్యూరిటీస్‌ నిపుణులు ప్రశాంత్‌ ప్రభాకరన్‌ పేర్కొన్నారు. దీంతో ఐటీ రంగంలో టీసీఎస్‌ బాగా ముందు‍న్నట్లు చెబుతున్నారు. ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఇన్ఫోసిస్‌ మెరుగైన పనితీరును ప్రదర్శించిందని.. రానున్న త్రైమాసికాలలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ పీఈల మధ్య అంతరం​ తగ్గే

చైనా కరెన్సీ మ్యానిప్యూలేటర్‌ కాదు..!

Tuesday 14th January 2020

స్పష్టం చేసిన అమెరికా గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఈ వాణిజ్య సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు అడుగులు పడుతున్న క్రమంలో చైనా ‘‘కరెన్సీ మ్యానిప్యూలేటర్‌’’ అనే ముద్రను అమెరికా  తొలగించింది. యువాన్‌ బలోపేతం అయిందని, చైనాను కరెన్సీ మ్యానిప్యూలేటర్‌గా పరిగణించడం లేదని అమెరికా ట్రెజరీ కాంగ్రెస్‌కు ఇచ్చిన సెమీ వార్షిక నివేదికలో పేర్కొంది. ఇక

Most from this category