News


గ్లోబల్‌ బ్రోకరేజ్‌ల నుంచి టాప్‌ సిఫార్సులు

Tuesday 10th December 2019
Markets_main1575955687.png-30149

అంతర్జాతీయ దిగ్గజ బ్రోకరేజ్‌లు ఆరు స్టాకులను రికమండ్‌ చేస్తున్నాయి.


1. ఆర్‌ఐఎల్‌: మోర్గాన్‌ స్టాన్లీ ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1735. ఆర్‌ఐఎల్‌ బలమైన ప్రదర్శన ఆరంభమైంది. ఇది ప్రసుతం తన సరాసరి పీఈ కన్నా రూ.20 శాతం అధిక ప్రీమియంతో ఉంది. టారిఫ్‌ల పెంపుతో కంపెనీ ఆర్‌ఓసీఈ మరింత పెరగనుంది. రెండేళ్లలో ఇది 11 శాతం వరకు పెరగవచ్చని అంచనా. కెమికల్స్‌ విభాగం మాత్రం కొంత కాలం సవాళ్లను ఎదుర్కోవచ్చు. 


2. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌: మోర్గాన్‌స్టాన్లీ అండర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 240. బ్యాంకు అసెట్‌ క్వాలిటీ కారణంగానే అండర్‌వెయిట్‌రేటింగ్‌ ఇచ్చామని వెల్లడి. భవిష్యత్‌లో అధిక స్లిపేజ్‌లుండొచ్చు. బ్యాంకు లోన్‌ పోర్టుఫోలియోలో అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌ పెరగవచ్చు. 


3. డాబర్‌: జేపీ మోర్గాన్‌ ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 520. కంపెనీ చేపట్టిన కొత్త పథకాలు సత్ఫలితాలిస్తే దేశీయ వాల్యూం గ్రోత్‌ తోటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలను దాటేస్తుంది. కంపెనీ మార్జిన్లపై స్థిరమైన అవుట్‌లుక్‌ ఉంది. 


4. యూబీఎల్‌: గోల్డ్‌మన్‌సాక్స్‌ కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1423. కంపెనీ స్థూల మార్జిన్లు వచ్చే ఏడాది మరింత విస్తరిస్తాయని అంచనా.


5&6. సిమెంట్‌ స్టాక్స్‌: అల్ట్రాటెక్‌, ఏసీసీ షేర్లకు జేపీ మోర్గాన్‌ కొనొచ్చు రేటింగ్‌ ఇచ్చింది. డిమాండ్‌లో వృద్ధి పెద్దగా లేకున్నా విస్తరణ కొనసాగుతుందని తెలిపింది. 

పైవన్నీ బ్రోకరేజ్‌ల సలహాలు, సూచనలు మాత్రమే. పెట్టుబడులకు ముందు సొంత అధ్యయనం తప్పనిసరి.



You may be interested

వడ్డీరేట్లపై ఫెడ్‌ నిర్ణయం కోసం పసిడి ఎదురుచూపులు

Tuesday 10th December 2019

కీలక వడ్డీ రేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం, అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై మరింత స్పష్టత కోసం పసిడి ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఫలితంగా మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర నిన్న ముగింపు(1465 డాలర్లు)తో పోలిస్తే 1 డాలరు స్వల్పంగా లాభపడి 1,466 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాలపై విధించిన రెండో

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Tuesday 10th December 2019

దేశీయంగా, అంతర్జాతీయంగా ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో మంగళవారం మార్కెట్‌ ఫ్లాట్‌గా ప్రారంభమై, కొద్ది నిముషాల్లో స్వల్ప నష్టాల్లోకి మళ్లింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం రోజు స్థాయిలోనే 41,480 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అదేరీతిలో 11,935 పాయింట్ల సమీపం‍లో మొదలయ్యింది. తదుపరి కొన్ని హెవీవెయిట్‌ షేర్లలో అమ్మకాలు నెలకొనడంతో సెన్సెక్స్‌ 41,420 పాయింట్ల వద్దకు, నిఫ్టీ 11,920 పాయింట్ల వద్దకు తగ్గాయి. 

Most from this category