News


జీడీపీ వృద్ధి అంచనాలు వాస్తవికంగా ఉన్నాయి!

Saturday 5th October 2019
Markets_main1570256342.png-28733

-నిలేష్‌ షా, కోటక్‌ ఏఎంసీ
‘ఆర్‌బీఐ తన ఎంపీసీ సమావేశంలో దేశ జీడీపీ వృద్ధి అంచనాలను సవరించింది. ఆర్థిక సంవత్సరం 2020 మొత్తానికి సంబంధించి జీడీపీ వృద్ధిని 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. ఆర్‌బీఐ ప్రస్తుతం చేసిన జీడీపీ వృద్ధి అంచనాల సవరణ, గతంలో చేసిన సవరణ కంటే చాలా వాస్తవికంగా ఉంది’ అని కోటక్‌ ఏఎంసీ(అసెట్‌ మేనేజ్‌మెంట్‌), ఎండీ నిలేష్‌ షా అన్నారు.  అంతేకాకుండా రేట్ల కోత మంచి చర్య అని, కానీ దీని ఫలితాన్ని వినియోగదారులకు బదిలీ చేయడంలోనే అసలు సమస్య ఉందని అన్నారు. ‘ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో అంచనా వేసిన జీడీపీ వృద్ధి 5.3 శాతాన్ని, క్యూ4 నాటికి 7 శాతం ప్లస్‌కు చేర్చాలంటే ప్రతి ఒక్కరి సహాయం అవసరముంటుంది’ అని​ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో లిక్విడిటీ పాజిటివ్‌గా ఉందని, ఇది ఈ ఏడాది జులై నుంచి పాజిటివ్‌గా మారుతోందని తెలిపారు. ముఖ్యంగా రేట్ల కోత బదిలీ జరిగేలా మనం చూడాలన్నారు. ‘ ఈ బదిలీ జరగకుండా ఉండేలా అనేక మూలధన అడ్డంకులు వ్యవస్థలో ఉన్నాయి. బదిలీ జరిగితేనే లిక్విడిటీ, జీడీపీ వృద్ధిలో తోడ్పాటునందిస్తుంది. రుతుపవనాలు సాధరణ స్థాయిలోకి  రావడం, ఆయిల్‌ ధరలు తగ్గడం వంటి చర్యల వలన దేవుడు మనపై దయతో ఉన్నాడని తెలుస్తోంది. కానీ దీనికి అదనంగా రేట్ల కోతను బదిలీ చేసి కార్పోరేట్‌ లేదా రిటైల్‌ స్థాయిల నుంచి రుణ పంపిణీలను పెంచాలి. అప్పుడు క్యూ2లో 5.3 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి క్యూ4 నాటికి 7.2 శాతానికి చేరుకుంటుంది’ అని వివరించారు.



You may be interested

అమెరికా మార్కెట్లకు జాబ్స్‌ డేటా జోష్‌..!

Saturday 5th October 2019

ఆశాజనకంగా వెలువడిన సెప్టెంబర్‌ కార్మిక శాఖ​ గణాంకాలు ఆర్థిక మాంద్య భయాలను కొంత తగ్గించిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు లాభంతో ముగిశాయి. డో జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌ ఇండెక్స్‌ 1.50శాతం(372.68 పాయింట్లు) పెరిగి 26,573.72 వద్ద, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్ 1.42శాతం(42 పాయింట్లు) లాభపడి 2,952.01 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 1.4శాతం(110 పాయింట్లు) పెరిగి 7,982.47 వద్ద స్థిరపడ్డాయి. ఈ వారం మొత్తంలో ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 0.3శాతం, డోజోన్స్‌ 0.10శాతం

రేట్‌ కట్‌తో లాభపడే స్టాకులు!

Saturday 5th October 2019

ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌) ఎంపీసీ(మానేటరీ పాలసీ కమిటీ) శుక్రవారం సమావేశంలో మరో 25 బీపీఎస్‌(బేసిస్‌ పాయింట్లు) రెపో రేటును తగ్గించింది. దీంతో ఈ ఏడాది మొత్తంగా 135 బేసిస్‌ పాయింట్లు వరకు రెపో రేటును తగ్గించినట్టయింది. ఈ చర్య వలన నిర్ధిష్టంగా కొన్ని స్టాకులు లాభపడే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. వివిధ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం రేట్‌ కట్‌ వలన లాభపడే స్టాకులు: విశ్లేషకులు: అజిత్‌ మిశ్రా, వైస్‌ ప్రెసిడెంట్‌ రిసెర్చ్‌, రెలిగర్‌

Most from this category