News


అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

Monday 19th August 2019
Markets_main1566192641.png-27848

  • బుధవారం ఎఫ్‌ఓఎంసీ జూలై సమావేశపు మినిట్స్‌ వెల్లడి
  • శుక్రవారం జరిగే అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక సదస్సులో పావెల్‌ ప్రసంగం
  • ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశ మినిట్స్‌ ఈవారంలోనే..

ముంబై: సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని తేల్చిచెప్పకపోడం, ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపే విధంగా ప్రకటనలు చేయకపోవడం వంటి నిరాశాపూరిత వాతావరణంలో గతవారం దేశీ ప్రధాన స్టాక్‌ సూచీలు నష్టాలను నమోదుచేశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) అమ్మకాల ధాటికి అంతక్రితం వారంలో గడించిన లాభాల్లో కొంత కోల్పోయినప్పటికీ.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుకు లభించిన కొనుగోలు మద్దతుతో భారీ నష్టాలకు అడ్డుకట్టపడింది. వారాంతాన నిఫ్టీ 11వేల పాయింట్ల సైకిలాజికల్‌ మార్కుకు ఎగువన నిలిచింది. ఈ ముగింపుతో కన్సాలిడేషన్‌ సూచనలు కనిపిస్తుండడం కాస్త సానుకూల అంశంగానే ఉండగా.. ఫలితాల సీజన్‌ నిరాశపరచడం, అమెరికా-చైనాల మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధం ప్రపంచ వృద్ధికి సవాలు విసురుతుండటం వంటి ప్రతికూలతల నేపథ్యంలో ఇక్కడ నుంచి మార్కెట్‌ ఏదిశగా ప్రయాణిస్తుందనే అంశానికి, అంతర్జాతీయ అంశాలే ఈవారంలో అత్యంత కీలకంగా ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘గ్లోబల్‌ మార్కెట్ల నుంచి ఈవారంలో ప్రతికూల సంకేతాలు అందితే, దేశీ మార్కెట్లు కుంగిపోకతప్పదు. అయితే, ప్రస్తుతం ఇందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి’ అని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోడీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య సెప్టెంబర్‌లో వాణిజ్య చర్చలు జరిగేందుకు ఆస్కారం ఉందని, మార్కెట్లు ఇతర అంతర్జాతీయ అంశాలపై దృష్టిసారించే సూచనలు కనిపిస్తున్నాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ విశ్లేషించారు. 

ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌, పావెల్‌ ప్రసంగంపై ఇన్వెస్టర్ల దృష్టి...
జాక్సన్ హోల్ ఎకనామిక్ పాలసీ సదస్సులో అమెరికా ఫెడరల్ బ్యాంక్‌ చైర్మన్‌ జెరోమ్ పావెల్ ఈనెల 23న(శుక్రవారం) ప్రసంగం చేయనున్నారు. తదుపరి వడ్డీరేట్ల అంశంపై ఈయన ప్రసంగం ద్వారా పలు సూచనలు అందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇక్కడ జరగనున్న పరిణామాలపై దృష్టిసారించారు. ఇక బుధవారం ఎఫ్‌ఓఎంసీ జూలై సమావేశ మినిట్స్‌ వెల్లడికానుండగా.. అమెరికాలో ఇప్పటికే ఉన్న గృహ అమ్మకాల డేటా కూడా ఇదే రోజున వెల్లడికానుంది. గురువారం యూఎస్‌ సర్వీసెస్‌ పీఎంఐ, ఇనీషియల్ జాబ్‌లెస్‌ క్లెయిమ్స్ గణాంకాలు విడుదలకానున్నాయి. శుక్రవారం నూతన గృహ అమ్మకాల డేటా విడుదలకానుంది. దేశీయంగా ఆర్‌బీఐ తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశ మినిట్స్‌ బుధవారం వెల్లడికానున్నాయి. ఈ పరిణామాలపై ఈవారంలో ఇన్వెస్టర్లు దృష్టిసారించారని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రిసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అన్నారు. ఫలితాల సీజన్‌ ముగిసినందున అంతర్జాతీయ అంశాలే కీలకంగా ఉన్నాయన్నారు. కొంతకాలంపాటు మార్కెట్లో జాగ్రత్త ధోరణి అవసరమని సూచించారు.

ఆగస్టులో రూ.8,319 కోట్లు ఉపసంహరణ...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆగస్టు 1-16 కాలానికి ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.10,416 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ అంశం కారణంగా ఈస్థాయిలో భారీ అమ్మకాలకు పాల్పడ్డారని మార్నింగ్‌స్టార్ సీనియర్ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాస్తవ విశ్లేషించారు. ఈక్విటీ మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తగ్గినప్పటికీ.. డెట్‌ మార్కెట్‌లో రూ.2,096 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా క్యాపిటల్‌ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.8,319 కోట్లకు పరిమితమైంది. జూలైలో రూ.2,986 కోట్లను భారత మార్కెట్‌ నుంచి వెనక్కుతీసుకున్నారు.



You may be interested

లాభాల్లో బ్యాంకింగ్‌ షేర్లు

Monday 19th August 2019

అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుం‍డడంతో సోమవారం దేశియ మార్కెట్లు కూడా లాభాల్లో కదులుతుఆన్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 10.52 సమయానికి 223.25 పాయింట్లు లాభపడి 28464.25  పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.13 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.16 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.62 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)

రంగాలవారీగానే తోడ్పాటు..

Monday 19th August 2019

ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై కేంద్రం విముఖత  ఆటోమొబైల్ రంగానికి విధానాలపరమైన వెసులుబాట్లు సూపర్ రిచ్‌ పన్ను కొన్నాళ్ల పాటు వాయిదా యోచన ఎన్‌బీఎఫ్‌సీలకూ ఊరటనిచ్చే చర్యలు పరిశీలనలో న్యూఢిల్లీ: డిమాండ్ మందగించి, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వివిధ రంగాలు ఉద్దీపన ప్యాకేజీలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలన్నీ పరిశీలిస్తోంది. ఖజానాకొచ్చే ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలాంటిది కాకుండా.. సంక్షోభంలో ఉన్న విభాగాలకు మాత్రమే పరిమితమయ్యేలా రంగాలవారీగానే రాయితీలు, తోడ్పాటు అందించాలని

Most from this category