News


52 వారాల గరిష్టానికి 57 షేర్లు

Monday 27th January 2020
Markets_main1580108512.png-31233


-52 వారాల కనిష్టానికి 26 షేర్లు
ఇంచుమించు 57 షేర్లు సోమవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో ఆదాని ఎంటర్‌ప్రైజెస్‌, అమర రాజా బ్యాటరీస్‌, అపోలో హాస్పటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అతుల్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, డాబర్‌ ఇండియా, గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌ కంపెనీ, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌ లిమిటెడ్‌, గుజరాత్‌ గ్యాస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, జుబ్లింట్‌ ఫుడ్‌ వర్క్‌, లారస్‌ ల్యాబ్స్‌, పీవీఆర్‌, టొరంటో పవర్‌, వైభవ్‌ గ్లోబల్‌లు ఉన్నాయి. కాగా ఎన్‌ఎస్‌ఈలో 26 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. 26 షేర్లలో రిలయన్స్‌ క్యాపిటల్‌, సికాల్‌ లాజిస్టిక్స్‌, రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌, ఎంఎంపీ ఇండస్ట్రీస్‌, రాజ్‌వీర్‌, 8కె మైల్స్‌ సాఫ్ట్‌వేర్‌, ఆగ్రో ఫోస్‌ ఇండియా, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, డాల్ఫిన్‌ ఆప్‌షోర్‌లు ఉన్నాయి. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో అల్ట్రా టెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌,  గ్రాసిమ్‌, ఎంఅండ్‌ఎం అత్యధికంగా పెరిగిన షేర్ల జాబితాలో ఉండగా, అత్యధికంగా తగ్గిన షేర్లు జాబితాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, వేదాంత, హిందాల్కో ఇండస్ట్రీస్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లు ఉన్నాయి.  కాగా మధ్యహ్నం 12 గంటల ప్రాంతంలో.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 38.25 పాయింట్ల తగ్గి 12,210 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 114 పాయింట్లు తగ్గి 41, 450 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఐసీఐసీఐ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Monday 27th January 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌ ధృక్పథం వెలిబుచ్చుతున్నాయి.  = బ్యాంకు షేరుపై ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు ప్రముఖ బ్రోకరేజ్‌ జేపీ మోర్గాన్‌ తెలిపింది. టార్గెట్‌ ధరను రూ. 560 నుంచి రూ. 650కి పెంచింది. బ్యాంకు క్యు3 ఫలితాల్లో ఆపరేటింగ్‌ ప్రాఫిట్స్‌ బలంగా ఉన్నాయని, రికవరీలు మెరుగుపడ్డాయని తెలిపింది. స్లిపేజ్‌లు బీబీ బుక్‌ మాత్రం కొంత పెరిగాయని, ఇవి సమీప భవిష్యత్‌లో

విభిన్న రంగాల నుంచి బడ్జెట్‌ స్టాక్స్‌ ఇవే!

Monday 27th January 2020

వారం రోజుల్లో వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్‌ నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ఇందుకు దేశ, విదేశీ అంశాలు ప్రభావం చూపుతున్నాయి. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు, వినియోగాన్ని పెంచే చర్యలు వంటి అంచనాలతో బడ్జెట్‌ ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తుంటే.. చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు ముందు పెట్టుబడుల కోసం  ఏఏ రంగాలను ఎంపకి చేసుకోవాలి, ఎలాంటి స్టాక్స్‌కు ప్రాధాన్యమివ్వాలి అనే అంశాలపై

Most from this category