News


54 స్టాకుల్లో బేరిష్‌ సంకేతాలు!

Tuesday 10th December 2019
Markets_main1575959890.png-30151

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 54 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో భారతీ ఎయిర్‌టెల్‌, బంధన్‌ బ్యాంక్‌, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌, హావెల్స్‌ ఇండియా, ఫ్యూచర్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీగ్యాస్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, అశోక్‌ బుల్డ్‌కాన్‌, ఏసీసీ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు.


ఎంఏసీడీ అంటే..
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌


మరోవైపు 25 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ఈఐడీపారీ, లా ఓపాలా, జిందాల్‌ వరల్డ్‌వైడ్‌, పొకర్న, ఓఐఎల్‌, బీఎఫ్‌ యుటిలిటీస్‌, బీఈఎంఎల్‌, విశ్వరాజ్‌ సుగర్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  



You may be interested

యస్‌బ్యాంక్‌ 12.50శాతం క్రాష్‌..!

Tuesday 10th December 2019

కీలకమైన బోర్డు సమావేశానికి ముందు మంగళవారం యస్‌బ్యాంక్‌ షేరు 6.50 శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.55.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు జరిగే బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో బ్యాంకులో పెట్టుబడులకు ఆసక్తిని కనబరిచే రుణదాతుల ఆఫర్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా మూలధన నిధుల సమీకరణకు షేర్‌ హోల్డర్ల అనుమతులు తీసుకోనున్నారు. యస్‌బ్యాంక్‌ ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపుల ద్వారా

వడ్డీరేట్లపై ఫెడ్‌ నిర్ణయం కోసం పసిడి ఎదురుచూపులు

Tuesday 10th December 2019

కీలక వడ్డీ రేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం, అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై మరింత స్పష్టత కోసం పసిడి ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఫలితంగా మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర నిన్న ముగింపు(1465 డాలర్లు)తో పోలిస్తే 1 డాలరు స్వల్పంగా లాభపడి 1,466 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాలపై విధించిన రెండో

Most from this category