News


ఇవి వ్యాల్యూ స్టాక్స్‌..!

Tuesday 14th January 2020
Markets_main1578941767.png-30898

బ్లూచిప్‌ స్టాక్స్‌ వ్యాల్యూషన్లు చాలా ఖరీదైన స్థాయికి చేరగా, మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో సత్తా ఉన్న కంపెనీల షేర్ల ధరలు ఎంతో ఆకర్షణీయంగా మారాయి. అదే విధంగా లార్జ్‌క్యాప్‌లోనూ కొన్ని స్టాక్స్‌ ర్యాలీలో పాల్గొనని కారణంగా ఎంతో ఆకర్షణీయ ధరల్లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు వ్యాల్యూ స్టాక్స్‌ (కంపెనీల వాస్తవ విలువ కంటే తక్కువకు ట్రేడయ్యేవి) వేటలో మునిగిపోయారు. వ్యాల్యూషన్ల పరంగా చౌకగా ఉండి, వాటి వ్యాపార సైకిల్‌ పుంజుకుంటుందన్న అంచనాలు, ఇతర అంశాల ఆధారంగా స్టాక్స్‌ను కొనుగోలు చేశారు. ఫండ్‌ మేనేజర్లను అధికంగా ఆకర్షించిన స్టాక్స్‌ ఇవి...

 

ఎల్‌అండ్‌టీ
ఈ స్టాక్‌ను డిసెంబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోలు చేశాయి. డిసెంబర్‌ మధ్య నుంచి ఈ స్టాక్‌ 7 శాతం పడిపోవడంతో కొనుగోలు అవకాశంగా తీసుకున్నాయి. దేశంలో అతిపెద్ద నిర్మాణ రంగ సంస్థ కావడంతో వ్యాల్యూ స్టాక్‌గా భావించాయి. ఆర్డర్లు దండిగానే ఉన్నప్పటికీ.. ఆర్డర్ల నిర్వహణ నిదానంగా ఉందని, ఆర్థిక మందగమనమే కారణమన్నది విశ్లేషణ. రూ.3లక్షల కోట్లకుపైగా ఆర్డర్‌ బుక్‌ ఉండడంతో ఈ స్టాక్‌లో ఫండ్స్‌ ఎక్స్‌పోజర్‌ పెంచుకున్నాయి.

 

క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌
ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ స్టాక్‌ను డిసెంబర్‌ త్రైమాసికంలో కొనుగోలు చేసింది. కన్జ్యూమర్‌ ఎలక్ట్రికల్స్‌ విభాగంలో ఈ కంపెనీకి మంచి వ్యాపార అవకాశాలు ఉన్నాయన్నది ఫండ్‌ మేనేజర్ల విశ్వాసం. డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 14 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీ వాటర్‌ హీటర్లకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి డిమాండ్‌ ఉంది. కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్లు 12.4 శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 

 

భారతీ ఎయిర్‌టెల్‌
ఐసీసీఐసీఐ ప్రుడెన్షియల్‌, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఈ స్టాక్‌ను డిసెంబర్‌ త్రైమాసికంలో కొనుగోలు చేశాయి. టెలికం పరిశ్రమలో మూడే ప్రైవేటు సంస్థలు మిగిలిపోగా, అందులో ఎయిర్‌టెల్‌ ఒకటి. దీంతో కంపెనీలకు చార్జీలను పెంచే అనుకూలత పెరిగింది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతుండంతో కంపెనీలకు డేటా ఆదాయం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

 

పవర్‌గ్రిడ్‌
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ షేరును కొనుగోలు చేసింది. కంపెనీ షేరు ధర ఆధారంగా చూస్తే డివిడెండ్‌ ఈల్డ్‌ 4.5 శాతంగా ఉంది. ట్రాన్స్‌మిషన్‌ విభాగంలో గుత్తాధిపత్యం కలిగిన సంస్థ. దీంతో పోర్ట్‌ఫోలియో పరంగా భద్రమైన స్టాక్‌గా దీన్ని ఫండ్‌ మేనేజర్లు చూస్తున్నారు. కంపెనీ మార్జిన్లు మెరుగుపడనున్నాయి. ఇటీవల 13 ప్రాజెక్టులకు టెండర్లు పిలిస్తే ఏడు ఈ కంపెనీయే సొంతం చేసుకుంది. కొన్ని ప్రాజెక్టులను ఇన్విట్‌ కిందకు తీసుకొచ్చి రూ.10,000 కోట్లను సమీకరించాలని కంపెనీ ప్రణాళికతో ఉంది. ఇది క్యాష్‌ఫ్లోను పెంచుతుంది.

 

ఆర్‌బీఎల్‌ బ్యాంకు
ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌, నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోలు చేశాయి. గరిష్ట ధర రూ.700 నుంచి చూస్తే ఈ ప్రైవేటు బ్యాంకు షేరు ధర 50 శాతం తక్కువగా లభిస్తోంది. దీంతో ఈ స్టాక్‌ను విలువైనదిగా ఫండ్‌ మేనేజర్లు భావిస్తున్నారు. ఇటీవలే బ్యాంకు నిధులు సమీకరించింది. క్రెడిట్‌ కార్డు విభాగంలో బలంగా ఉండడం, మైక్రో బ్యాంకింగ్‌ సేవలు ఫండ్స్‌ను ఆకర్షిస్తున్నాయి. క్రెడిట్‌ కార్డు మార్కెట్లో ఆర్‌బీఎల్‌ బ్యాంకు 2018 మార్చి నాటికి 2.13 శాతం వాటా కలిగి ఉండగా, దీన్ని 4.26 శాతానికి పెంచుకుంది. అధిక మార్జిన్‌ ఉండే రిటైల్‌ వ్యాపారంపై దృష్టి సారించడం నికర వడ్డీ మార్జిన్లను పెంచుతుంది.You may be interested

ద్రవ్యోల్బణం రయ్‌

Tuesday 14th January 2020

- డిసెంబర్‌లో 7.35 శాతానికి  - అయిదున్నరేళ్ల గరిష్టం - కూరగాయల రేట్లే కారణం న్యూఢిల్లీ: ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయిని దాటేసి.. ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. ఇది అయిదున్నరేళ్ల గరిష్ట స్థాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2018 డిసెంబర్‌లో

గత నెలలో ఫండ్స్‌ టాప్‌ షాపింగ్‌ వీటిల్లోనే..

Tuesday 14th January 2020

యాక్టివ్‌ ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు తమ నిర్వహణలోని పథకాల పోర్ట్‌ఫోలియోను మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పడికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తుంటారు. కొత్తగా ఏ షేర్లను అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు) కొనుగోలు చేశాయి, వేటిని విక్రయించాయనే వివరాలను నెలకు ఒకసారి తెలుసుకునే అవకాశం ఇన్వెస్టర్లకు ఉంటుంది. ఎందుకంటే పోర్ట్‌ఫోలియో వివరాలను నెలకు ఒకసారి వెల్లడించడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. ఈ ప్రకారం చూస్తే గత

Most from this category