News


1-3 నెలలకు.. 5 స్టాక్స్‌!

Thursday 13th February 2020
Markets_main1581587763.png-31764

దేశ, విదేశీ అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతూ కదులుతున్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ 12,000 పాయింట్ల స్థాయిలో ఒడిదొడుకులను చవిచూస్తోంది. నిఫ్టీ 12,272 పాయింట్లను అధిగమిస్తే.. 12,500వైపునకు కదలవచ్చు. మరోపక్క వెనకడుగు వేస్తే.. 12,100 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. తదుపరి బలహీనపడితే 11,990 వద్ద మరోసారి సపోస్ట్‌ కనిపించే వీలుంది. ఈ అంచనాలతోపాటు చార్టుల ఆధారంగా ఐదు స్టాక్స్‌ బ్రేకవుట్‌ సాధించాయని చెబుతున్నారు ఆశిష్‌ చతుర్మెహతా. నెల నుంచి మూడు నెలల కాలంలో ఈ కౌంటర్లు 10-18 శాతం రిటర్నులు ఇచ్చే వీలున్నట్లు అంచనా వేశారు. సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌- డెరివేటివ్స్‌ హెడ్‌ అయిన ఆశిష్‌ రికమండేషన్స్‌ ఎలా ఉన్నాయంటే..

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌
వారం చార్టుల్లో హైయర్‌ టాప్‌, హైయర్‌ బాటమ్‌ నమోదు చేస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రూ. 1735 వద్ద గరిష్టాన్ని తాకిన తదుపరి రూ. 1576 వరకూ నీరసించింది. రూ. 1002-1399 స్థాయిలలో మద్దతు లభించడంతో బౌన్స్‌ అయ్యింది. రోజువారీ చార్టుల ప్రకారం 1729-1576 స్థాయిల మధ్య బుల్లిష్‌ ధోరణి వ్యక్తమయ్యింది. ప్రస్తుతం బ్రేకవుట్‌ దగ్గర్లో ఉన్నప్పటికీ రూ. 1880 టార్గెట్‌ ధరతో రూ. 1690 వరకూ కొనుగోలు చేయవచ్చు.రూ. 1660 దిగువన స్టాప్‌లాస్‌ ఉంచాలి.

ఫైజర్‌ లిమిటెడ్‌
రూ. 3850-2650 మధ్య కన్సాలిడేషన్‌ జరిగాక గతేడాది డిసెంబర్‌లో రూ. 4499 వద్ద ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని చేరింది. ఆపై రూ. 4490-3950 మధ్య తిరిగి కన్సాలిడేట్‌ అవుతోంది. షేరు ధర, ట్రేడింగ్‌ పరిమాణం రీత్యా ఇక్కడ బ్రేకవుట్‌ సాధించే అవకాశముంది.  రూ. 5100 టార్గెట్‌ ధరతో రూ. 4375 వరకూ కొనుగోలు చేయవచ్చు. రూ. 4250 దిగువన స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

మహానగర్‌ గ్యాస్‌
ఏడాదిపాటు రూ. 1065-755 స్థాయిలలో కన్సాలిడేషన్‌ను చవిచూసింది. వీక్లీ చార్టులలో బుల్లిష్‌ డబుల్‌-బాటమ్‌ రివర్సల్‌ కనిపిస్తోంది. రెండు వారాలుగా రూ. 1246-1143 శ్రేణిలో కన్సాలిడేట్‌ అవుతోంది. బుధవారం అప్‌ట్రెండ్‌ను సూచిస్తూ స్టాక్‌ రియాక్ట్‌ అయ్యింది. ఆర్‌ఎస్‌ఐ సానుకూలతను ప్రతిబింబిస్తోంది. రూ. 1400 టార్గెట్‌ ధరతో రూ. 1160 వరకూ కొనుగోలు చేయవచ్చు. రూ. 1160 దిగువన స్టాప్‌లాస్‌ తప్పనిసరి. 

డాబర్‌ ఇండియా
గత ఏడాదిన్నర కాలంలో రూ. 490-360 శ్రేణిలో కన్సాలిడేషన్‌ జరిగింది. వీక్లీ చార్టులలో W ప్యాటర్న్‌ కనిపిస్తొంది. బుధవారం బ్రేకవుట్‌ సాధించి రూ. 523 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. బోలింగర్‌ బ్యాండ్‌లో అప్‌సైడ్‌ మొమెంటమ్‌ నమోదైంది. ఆర్‌ఎస్‌ఐ సైతం సానుకూలతను ప్రతిబింబిస్తోంది. రూ. 600 టార్గెట్‌ ధరతో రూ. 511 వరకూ సొంతం చేసుకోవచ్చు. రూ. 495 దిగువన స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది.

చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌
గత 21 నెలల్లో రూ. 352-207 శ్రేణిలో కదిలింది. తద్వారా బేస్‌ నెలకొంది. 2018 అక్టోబర్‌ కనిష్టం రూ. 207 నుంచి రికవరీ సాధిస్తూ వచ్చింది. తదుపరి రూ. 335-310 శ్రేణి నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ఇందుకు నెక్‌లైన్‌ వద్ద సపోర్ట్‌ తీసుకుంది. రోజువారీ చార్టులలో బుల్లిష్‌పోల్‌ కనిపిస్తొంది. అప్‌ట్రెండ్‌ బలాన్ని సూచిస్తూ ఏడీఎక్స్‌ లైన్‌ ఏర్పడింది. రూ. 400 టార్గెట్‌ లక్ష్యంతో రూ. 333 వరకూ కొనుగోలు చేయవచ్చు. రూ. 320 దిగువన స్టాప్‌లాస్‌ అమలు చేయాలి.
 You may be interested

భారత్‌లో హ్యాండ్‌సెట్ల తయారీకి అంతరాయం..?

Thursday 13th February 2020

 భారత్‌లో హ్యాండ్‌ సెట్‌ తయారీ పరిశ్రమలు త్వరలో ఫోన్ల  తయారీని  నిలిపి వేయనున్నట్లు నిపుణులు  చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా కరోనా ప్రభావంతో చైనా పరిశ్రమలు మూతపడిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాలను వివిధ దేశాలు ఎగుమతి చేసే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. తాజా పరిస్థితుల్లో ఎక్కడిక్కడ పరిశ్రమలు మూతపడి ఉత్పత్తులు ఆగిపోయాయి. విడిభాగాల  సరఫరా నిలిచిపోయింది. దీంతో వచ్చే వారం నుంచి స్మార్ట్‌ఫోన్‌ తయారీ పూర్తిగా

కొద్ది రోజుల్లో నూతన శిఖరాలకు నిఫ్టీ...జియోజిత్‌

Thursday 13th February 2020

జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ అంచనా ఫిబ్రవరి 11 నిఫ్టీ చార్టుల్లో గ్రేవ్‌స్టోన్‌ డోజీ ఏర్పడిందని, అయితే మరుసటి రోజే బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పడడం బుల్స్‌ బలానికి సంకేతమని జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ తెలిపింది. నిఫ్టీ తన 60 రోజుల ఈఎంఏ స్థాయి నుంచి మంగళవారం మంచి అప్‌మూవ్‌ నమోదు చేసేలా బుల్స్‌ కీలకపాత్ర వహించారు. అయితే బుధవారం తిరిగి బుల్స్‌ జోరు కనిపించలేదు. కానీ సూచీలు పెద్దగా పతనం కాలేదు. మంగళవారం నిఫ్టీ 12

Most from this category