News


ఎఫ్‌ఐఐల టాప్‌ 5 షేర్లు!

Monday 18th November 2019
Markets_main1574053153.png-29667

వాటాలు పెంచుకుంటూ వస్తున్న విదేశీ మదుపరులు
కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీల్లో కొనుగోళ్లు ఆరంభించారు. నవంబర్‌ 11 నాటికి దేశీయ ఈక్విటీల్లోకి నికర విదేశీ నిధులు రూ. 30000 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఫండ్స్‌ ఎక్కువ మక్కువ చూపుతున్న స్టాకులను పరిశీలించి వాటిలో కొన్ని పారామీటర్లకు అనుగుణంగా ఉన్న స్టాకులను వేరు చేయడం జరిగింది. ఎఫ్‌పీఐలు కనీసం ఏడాదిలో ఐదు శాతం వాటా పెంచుకోవడం, ఒక​ త్రైమాసికంలో కనీసం ఒక్క శాతమైన వాటా పెరగడం, కనీసం ఐదుగురు అనలిస్టులు కొనొచ్చని సిఫార్సులు చేయడం, టార్గెట్‌ ధర కనీసం 15 శాతం అధికంగా ఉండడమనే పారామీటర్లను తీసుకొని పరిశీలిస్తే ఐదు స్టాకులు నిలిచాయి.
1. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌: అత్యాధునిక ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలను ఆర్మీకి అందిస్తుంటుంది. ఎప్పటికప్పుడు నిరంతరాయమైన ఆర్డర్లు పొందుతుంటుంది. తాజాగా కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ. 56178 కోట్లను చేరింది. కంపెనీ విదేశీ ఎగుమతుల ఆర్డర్‌ బుక్‌ దాదాపు 16 కోట్ల డాలర్లను చేరింది. బలమైన ఆర్డర్‌బుక్‌ భవిష్యత్‌ రెవెన్యూలపై భరోసానిస్తోంది. కంపెనీ క్రమంగా డిఫెన్సేతర విభాగాలపై కూడా దృష్టి సారిస్తోంది. కంపెనీ గణనీయమైన అధిక ఎబిటా మార్జిన్లను నమోదు చేస్తూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.

ఎఫ్‌పీఐల వాటాలో పెరుగుదల: ఏడాదితో పోలిస్తే 6.51 శాతం, గత త్రైమాసికంతో పోలిస్తే 2.52 శాతం. 
టార్గెట్‌ ధర: రూ. 126.
అనలిస్టుల అంచనాలు: కొనచ్చని 17 మంది, హోల్డని ముగ్గురు, అమ్మొచ్చని ఆరుగురు రికమండ్‌ చేస్తున్నారు. 
2. ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌కు ఈ కంపెనీ మాతృసంస్థ. క్యు2లో ఈబ్యాంకు  నికర లాభంలో 111 శాతం మెరుగుదల నమోదయింది. ఎన్‌పీఏలు సైతం చాలా తక్కువగా ఉన్నాయి. త్వరలో బ్యాంకును ఐపీఓకి తేనుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌తో రూ. 1200 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ అనంతరం హోల్డింగ్‌ కంపెనీ డిస్కౌంట్‌లోకి జారకుండా చూసేందుకు బ్యాంకులో ప్రమోటర్‌ వాటాను 40 శాతం దిగువకు తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం షేరు వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. 

ఎఫ్‌పీఐల వాటాలో పెరుగుదల: ఏడాదితో పోలిస్తే 6.59 శాతం, గత త్రైమాసికంతో పోలిస్తే 1.12 శాతం. 
టార్గెట్‌ ధర: రూ. 324.
అనలిస్టుల అంచనాలు: కొనచ్చని 10 మంది, హోల్డని ఐదుగురు, అమ్మొచ్చని ముగ్గురు రికమండ్‌ చేస్తున్నారు. 
3. ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌: మెడికల్‌ టూరిజం పుంజుకోవడంతో బాగా లబ్ది పొందే సంస్థ. కంపెనీ వైవిధ్యమైన వ్యాపార ప్రొఫైల్‌ కలిగిఉంది. ఏడు గల్ఫ్‌ దేశాల్లో విస్తరించింది. దీంతో ఆయా దేశాల నుంచి దేశీయ ఆస్పత్రులకు పేషెంట్స్‌ను తీసుకురావడం సులభమవుతోంది. కంపెనీ ఐదేళ్లుగా 35 శాతం చక్రీయ సగటు వార్షిక వృద్ది నమోదు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం చాలా తక్కువ వాల్యూషన్ల వద్ద ఉంది. 

ఎఫ్‌పీఐల వాటాలో పెరుగుదల: ఏడాదితో పోలిస్తే 6.20 శాతం, గత త్రైమాసికంతో పోలిస్తే 1.72 శాతం. 
టార్గెట్‌ ధర: రూ. 192.
అనలిస్టుల అంచనాలు: కొనచ్చని 8 మంది రికమండ్‌ చేస్తున్నారు. 
4. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌: కొత్త కమర్షియల్‌ వాహనాల కన్నా వాడిన వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీంతో ఇలాంటి వాహనాల ఫైనాన్స్‌ చేసే శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌కు వ్యాపారం పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం సంస్థ సెకండ్స్‌ వాహనాల కొనుగోళ్లకు ఇచ్చిన రుణాలు గతేడాదితో పోలిస్తే దాదాపు 7 శాతం పెరిగాయి. లోన్‌బుక్‌లో ఈ విభాగం వాటా రెండు శాతం పెరిగింది. రాబోయే ఏడాదిలో కొత్త వాహనాల విక్రయాలు కూడా ఊపందుకుంటాయని అంచనాలున్నాయి. ఇవన్నీ కంపెనీ వృద్దిని సూచిస్తున్నాయి. 

ఎఫ్‌పీఐల వాటాలో పెరుగుదల: ఏడాదితో పోలిస్తే 12.05 శాతం, గత త్రైమాసికంతో పోలిస్తే 4.35 శాతం. 
టార్గెట్‌ ధర: రూ. 1304.
అనలిస్టుల అంచనాలు: కొనచ్చని 34 మంది, హోల్డని నలుగురు, అమ్మొచ్చని ఇద్దరు రికమండ్‌ చేస్తున్నారు. 
5. రెడింగ్టన్‌ ఇండియా: మందగమన వాతావరణంలో కూడా కంపెనీ బలమైన రెవెన్యూ వృద్ధి సాధించింది. ప్రొకనెక్ట్‌ ఇబ్బందుల కారణంగా నికరలాభం 27 శాతం వృద్దికే పరిమితమైంది. అయితే ఈ ఇబ్బందులు తాత్కాలికం కావడం గమనార్హం. అందువల్ల దీర్ఘకాలానికి కంపెనీ మంచి పనితీరు కనబరచగలదని అంచనా. వాల్యూషన్లు ప్రస్తుతం ఆకర్షణీయమైన స్థాయిల వద్ద ఉన్నాయి. పీఈ కేవలం 8.10 వద్ద ఉంది. 

ఎఫ్‌పీఐల వాటాలో పెరుగుదల: ఏడాదితో పోలిస్తే 5.57 శాతం, గత త్రైమాసికంతో పోలిస్తే 4.77 శాతం. 
టార్గెట్‌ ధర: రూ. 135.
అనలిస్టుల అంచనాలు: కొనచ్చని 10 మంది రికమండ్‌ చేస్తున్నారు. You may be interested

స్వల్ప నష్టాల్లో పసిడి

Monday 18th November 2019

అమెరికా-చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వైట్‌ హౌస్‌ ఉన్నతాధికారి ప్రకటించడంతో సోమవారం పసిడి ధర స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1.65డాలరు నష్టంతో 1,466.85 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే చర్చల సంపూర్ణంగా సఫలమయ్యానే సంకేతాల కొసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. అమెరికా చైనాలకు చెందిన ఉన్నతాధికారులు శనివారం చర్చలపై ఫోన్‌లో సంభాషించినట్లు చైనా మీడియా శనివారం తెలిపింది.

ఎయిర్‌టెల్‌ 6 శాతం జంప్‌..ఏడాది గరిష్ఠానికి షేరు

Monday 18th November 2019

టెలికాం ఎజీఆర్‌ వివాదంపై ప్రభుత్వం సానుకూల చర్యను తీసుకుంటుందని అంచనాలు మార్కెట్‌ వర్గాలు ఉన్నాయి. ఒకవేళ ఏజీఆర్‌ బకాయిలన్నింటిని ప్రభుత్వం చెల్లించమని ఆదేశించినప్పటికి, టెలికాం కంపెనీలు కన్సాలిడేట్‌ అయ్యి, భారతీ ఎయిర్‌టెల్‌ లబ్దిపొందుతుందంటూ బ్రోకరేజిల రిపోర్టులు వెలువడటంతో భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారం మరో 6 శాతం జంప్‌చేసింది. గత సెషన్లో 9 శాతం పైగా లాభపడి రూ. 393.05 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం సెషన్‌లో కూడా అదే ర్యాలీని కొనసాగిస్తోంది. ఉదయం

Most from this category