News


మూడు నెలల కాలానికి ఐదు సిఫార్సులు

Thursday 10th October 2019
Markets_main1570688818.png-28800

వచ్చే మూడు నెలల కాలంలో 10 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
1. వోల్టాస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 775. స్టాప్‌లాస్‌ రూ. 650. రెండేళ్ల క్రితం ఆల్‌టైమ్‌ హైని తాకింది. అనంతరం కరెక‌్షన్‌ జోన్‌లో ప్రవేశించి రూ. 519 వరకు దిగజారింది. అప్పటి నుంచి రెండు స్థాయిల మధ్య కన్సాలిడేషన్‌ జరుపుతూ వస్తోంది. దీంతో వీక్లీ చార్టుల్లో రౌండింగ్‌ బాటమ్‌ ప్యాట్రన్‌ ఏర్పరిచింది. గత సెప్టెంబర్‌లో స్టాకు మరోమారు ఆల్‌టైమ్‌ హైని చేరింది. ఆ పిమ్మట కొంచెం దిగివచ్చి కన్సాలిడేట్‌ అవుతోంది. ప్రస్తుతం కన్సాలిడేషన్‌ ముగించుకొని మరోమారు అప్‌ట్రెండ్‌ సంకేతాలు ఇస్తోంది. ఇండికేటర్లన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి.
2. ముత్తూట్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 780. స్టాప్‌లాస్‌ రూ. 658. నాలుగు నెలలుగా వందరూపాయల రేంజ్‌లో కన్సాలిడేట్‌ అయింది. సెప్టెంబర్‌లో బ్రేకవుట్‌ సాధించి ఆల్‌టైమ్‌ హై రూ.699ని తాకింది. ఈ క్రమంలో బుల్లిష్‌ కంటిన్యూ పోల్‌ అండ్‌ ఫ్లాగ్‌ ఫార్మేషన్‌ ఏర్పరిచింది. ఇది మరింత అప్‌ట్రెండ్‌కు సంకేతం. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా ఉంది.
3. పీఐ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గె్‌ రూ. 1450. స్టాప్‌లాస్‌ రూ. 1250. చార్టుల్లో హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తూ కొనసాగుతోంది. రూ. 1040- 1220 మధ్య రౌండింగ్‌ బేస్‌ ప్యాట్రన్‌ ఏర్పరిచింది. సెప్టెంబర్‌లో బ్రేకవుట్‌సాధించింది. ప్రస్తుతం స్వల్పకాలిక డీఎంఏలకు పైన కదలాడుతూ అప్‌మూవ్‌ సిగ్నల్స్‌ ఇస్తోంది. ఏడీఎక్స్‌ ఇండికేటర్‌ పాజిటివ్‌ జోన్‌లోకి వచ్చింది. 
4. ఏసియన్‌ పెయింట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1960. స్టాప్‌లాస్‌ రూ. 1710. ఇటీవలి ర్యాలీ అనంతరం రెండు వారాలు కన్సాలిడేట్‌ చెందింది. డైలీ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్స్‌ ఏర్పాటు మరింత అప్‌మూవ్‌ను సూచిస్తోంది. స్టోకాస్టిక్‌ ఇండికేటర్‌ పాజిటివ్‌ సంకేతాలు కనబరుస్తోంది. 
5. టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 310. స్టాప్‌లాస్‌ రూ. 258. ఫిబ్రవరి కనిష్ఠాల నుంచి కోలుకొని హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తూ ముందుకు సాగుతోంది. అప్‌మూవ్‌ సమయంలో భారీ వాల్యూంలు స్టాకుపై ఇన్వెస్టర్ల ఆసక్తికి సంకేతం. ఇన్వెస్టర్లన్నీ పాజిటివ్‌ క్రాసోవర్స్‌ ఏర్పరిచాయి. 



You may be interested

ఐఆర్‌సీటీసీ ఐపీఓ అలాట్‌మెంట్‌ స్టేటస్‌ ఇలా చెక్‌ చేసుకోండి!

Thursday 10th October 2019

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ఐపీఓకి మంచి స్పందన వచ్చింది. ఈ ఇష్యూ దాదాపు 111 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్‌ అయింది. 2.016 కోట్ల షేర్లకు 225.29 కోట్ల బిడ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఓకి సబ్‌స్క్రైబ్‌ చేసిన ఇన్వెస్టర్లు తమకు షేర్లు దక్కుతాయా? దక్కవా? అని ఉత్కంఠగా చూస్తుంటారు. ఐపీఓకి అప్లై చేసిన వాళ్లకు అక్టోబర్‌ 10 లేదా 11న అలాట్‌మెంట్‌ జరగవచ్చని అంచనా. అలాట్‌మెంట్‌ అయింది?

బ్యాంక్‌ నిఫ్టీ 700 పాయింట్లు డౌన్‌!

Thursday 10th October 2019

యుఎస్‌-చైనా మధ్య ప్రాథమిక వాణిజ్య చర్చలలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నెగిటివ్‌గా కదులుతున్నాయి. గత సెషన్‌లో 1000 పాయింట్లకు పైగా లాభపడిన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయి ట్రేడవుతోంది. ఉదయం 11.41 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.45 శాతం లేదా 703.85 పాయింట్లు నష్టపోయి 28,082.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ

Most from this category