News


ఆగస్టు సీరిస్‌ కోసం ఐదు సిఫార్సులు

Wednesday 24th July 2019
Markets_main1563962304.png-27285

సాంక్టమ్‌ వెల్త్‌ రికమండేషన్లు
వచ్చే ఆగస్టు సీరిస్‌లో 10- 16 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది.
1. పవర్‌గ్రిడ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 245. స్టాప్‌లాస్‌ రూ. 199. జూలై 2017లో ఆల్‌టైమ్‌ హైని తాకి వెంటనే వేగంగా రూ. 172 వరకు పతనమైంది. ఆతర్వాత రూ. 172- 205 మధ్య గతేడాది మొత్తం కన్సాలిడేట్‌ అవుతూవచ్చింది. గత జూన్‌లో ఈ కన్సాలిడేషన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ఇదే సమయంలో అధోముఖ వాలు రేఖను సైతం ఛేదించి పైకి ముగిసింది. నాలుగు వారాలుగా బ్రేకవుట్‌ రేంజ్‌కు పైన చిన్న పాటి కన్సాలిడేషన్‌ చెందుతోంది. ఆర్‌ఎస్‌ఐ ఇతర ఇండికేటర్లు పాజిటివ్‌ కదలికలు చూపుతున్నాయి. త్వరలో అప్‌ట్రెండ్‌ కొనసాగించే సంకేతాలున్నాయి.
2. ఏసియన్‌పెయింట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1600. స్టాప్‌లాస్‌ రూ. 1370. అప్‌ట్రెండ్‌లో కొనసాగుతూ హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. రైజింగ్‌ ఛానెల్‌ పై అవధిలో ట్రేడవుతోంది. రూ. 1300 వద్ద డబుల్‌బాటమ్‌ ఏర్పడింది. ఇటీవల కాలంలో దిగువకు వచ్చినప్పుడల్లా కొనుగోళ్ల మద్దతు పొందుతోంది. తాజాగా బోలింగర్‌బ్యాండ్‌కు పైన బ్రేకవుట్‌ చూపింది. ఇతర ఇండికేటర్లు కూడా మరింత అప్‌మూవ్‌కే సంకేతాలిస్తున్నాయి. 
3. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 580. స్టాప్‌లాస్‌ రూ. 480. దిగువన రూ. 345- 420 మధ్య కన్సాలిడేషన్‌ చెందింది. మేలో ఈ రేంజ్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. అప్పటినుంచి హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. ఏడీఎక్స్‌ బలమైన అప్‌మూవ్‌ను చూపుతోంది. 
4. డాబర్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 480. స్టాప్‌లాస్‌ రూ. 405. గతేడాది ఆగస్టులో ఆల్‌టైమ్‌ హైని చేరిన అనంతరం రూ. 360 వరకు పతనమైంది. అక్కడ బలమైన మద్దతు సాధించింది. తిరిగి తన 200 రోజుల డీఎంఏపైన బలంగా క్లోజయింది. ప్రస్తుతం నాలుగు నెలల గరిష్ఠం వద్ద కదలాడుతోంది. ఈ స్థాయిలో మరో అప్‌మూవ్‌ ఉంటుందని ఇండికేటర్లు సూచిస్తున్నాయి.
5. అపోలోటైర్స్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 150. స్టాప్‌లాస్‌ రూ. 174. డైలీ, వీక్లీ చార్టుల్లో లోయర్‌టాప్స్‌, లోయర్‌బాటమ్స్‌ ఏర్పరుస్తూ బలహీనత చూపుతోంది. ఇటీవలే కీలకమైన రూ.172 మద్దతు కోల్పోయింది. చార్టుల్లో పెద్ద బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచి మరింత పతనం సంకేతాలు ఇస్తోంది. బోలింగర్‌ బ్యాండ్‌లో షేరు ధర బ్రేక్‌డౌన్‌ చూపుతోంది. ఇతర ఇండికేటర్లు కూడా బలహీనంగా కనిపిస్తూ డౌన్‌ట్రెండ్‌ కొనసాగింపును చూపుతున్నాయి. You may be interested

తుదిదశలో ఒప్పందం..5 శాతం పెరిగిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Wednesday 24th July 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని కొంత వాటాను విక్రయించడానికి ఒక ఒప్పందం తుది దశకు చేరుకుందని జీ మేనేజింగ్‌ డైరక్టర్‌ పునిత్‌ గోయెంక ‍ప్రకటించడంతో బుధవారం(జులై 24)  జీ షేరు విలువ 4.28 శాతం లాభపడి రూ.376.25 వద్ద ముగిసింది.  మరొక ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నాం. వివరాలను కొద్ది రోజులలో ప్రకటిస్తాం’ అని పునిత్‌ గోయెంక అన్నారు. జీ గ్రూప్‌నకు రుణాలిచ్చిన వారిలో 90 శాతం మంది చెల్లింపులు పూర్తి చేయడానికి కంపెనీకి సెప్టెంబర్ వరకు

యస్‌ బ్యాంక్‌కు 100 ఫండ్‌ మేనేజర్లు గుడ్‌బై

Wednesday 24th July 2019

‘గత ఏడాది కాలంలో 100 మ్యూచువల్ ఫండ్ నిర్వాహకులు యస్ బ్యాంక్‌లో తమ వాటాను పూర్తిగా విక్రయించుకున్నారు’ అని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా తెలిపింది. జూన్ 2018 లో 227 మ్యూచువల్ ఫండ్ పథకాల పోర్ట్‌ఫోలియోలో యెస్ బ్యాంక్‌ ఉండగా, జూన్ 2019 నాటికి ఈ మ్యూచువల్‌ ఫండ్‌ల సంఖ్య 132 కు పడిపోయిందని వివరించింది. యస్ బ్యాంక్‌ స్టాకు విలువ గణనీయంగా కూడా తగ్గడం ఈ పతనానికి ఒక

Most from this category