STOCKS

News


ఏడాది కోసం ఐదు స్టాక్స్‌

Thursday 15th August 2019
Markets_main1565893546.png-27792

దీర్ఘకాలానికి మంచి పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకునేందుకు ఇప్పటి నుంచి వచ్చే మూడు నెలల కాలం అనువైనదని చాలా మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. దేశ ఈక్విటీ మార్కెట్లు గత ఏడాదిన్నరగా అస్థిరతల్లో ఉండడం, ముఖ్యంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఏడాదికి పైగా బేరిష్‌లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కనుక వీటిల్లో నాణ్యమైన స్టాక్స్‌ను ఎంపిక చేసుకుని క్రమంగా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని సూచిస్తు‍న్నారు. రెండేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం పాటు వేచి చూసే వారికి మంచి రాబడులు ఇస్తాయని పేర్కొంటున్నారు. వచ్చే స్వాతంత్ర్యదినం నాటికి మంచి రాబడులకు అవకాశం ఉన్న ఐదు స్టాక్స్‌ను ట్రేడింగ్‌బెల్స్‌ సీఈవో అమిత్‌ గుప్తా సూచించారు. 

 

సన్‌ఫార్మా
ఏడాదికి లక్ష్యం రూ.540. ప్రభుత్వాలు, రెగ్యులేటరీ సంస్థల రూపంలో అంతర్జాతీయ ఫార్మా పరిశ్రమ పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నట్టుంది. సన్‌ ఫార్మా 52 వారాల గరిష్ట ధర రూ.679 నుంచి 40 శాతం తక్కువలో ట్రేడవుతోంది. ఎగుమతులు, పరిశోధన, అభివృద్ధిపై ఈ కంపెనీ దృష్టి సారించింది. దీర్ఘకాలం పాటు నిలదొక్కుకునేందుకు ఇది అవసరం. దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ప్రస్తుత ధరలో ఈ స్టాక్‌ మంచి బెట్‌ అవుతుంది. 

 

భారతీ ఎయిర్‌టెల్‌
ఏడాది కాల లక్ష్యం రూ.500. టెలికం పరిశ్రమలో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ దీర్ఘకాలం పాటు నిలబడే కంపెనీల్లో ఎయిర్‌టెల్‌ కూడా ఒకటి. ఓ యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ)ను పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారించింది. ఇందుకోసం కనీసంగా చేసుకోవాల్సిన రీచార్జీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రీమియం కస్టమర్లకు వినూత్నమైన డిజిటల్‌ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్టాక్‌ ధర రూ.361 వద్ద ఉంది. 52 వారాల గరిష్ట ధర రూ.378ని బ్రేక్‌ చేస్తే ఈ స్టాక్‌ కొత్త గరిష్టాల దిశగా, ముఖ్యంగా దీని ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.500 వైపు దూసుకుపోతుంది. 

 

కోటక్‌ మహీంద్రా బ్యాంకు
ఏడాది కాలానికి లక్ష్యం రూ.2,000. మంచి ఆస్తుల నాణ్యత, ఎన్‌పీఏల నియంత్రణపై ఈ బ్యాంకు మొదటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టి ఉంది. మొత్తం ఆస్తుల్లో రిస్క్‌ ఉన్న ఆస్తుల శాతం తగ్గుతూ వస్తున్నాయి. పరిశ్రమలో తక్కువ ఎన్‌పీఏలు ఉన్న బ్యాంకు. గతేడాది అక్టోబర్‌ నుంచి స్థిరమైన రాబడులను ఇస్తూనే ఉంది. 52 వారాల గరిష్ట ధర రూ.1,555 సమీపంలో రూ.1,492 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్థిక సేవల రంగంలో లిక్విడిటీ సమస్యల నేపథ్యంలో ఈ రంగంలో గట్టిగా నిలబడే బ్యాంకు ఇది. 

 

బజాజ్‌ ఆటో
ఏడాది కాలానికి లక్ష్యం రూ.3,300. మోటారు సైకిళ్ల విభాగంలో దేశీయ మార్కెట్లో వాటాను పెంచుకుంటోంది. ప్రస్తతానికి 20 శాతానికి పైగా వాటా ఉంది. అందుబాటు ధరల్లో మంచి స్టయిల్‌తో కూడిన వాహనాలను అందిస్తోంది. ఎగుమతుల పోర్ట్‌ఫోలియో పెంచుకోవడంపైనా దృష్టి పెట్టింది. ద్విచక్ర వాహనాల్లో మందగమనం అన్నది తక్కువ సామర్థ్యం ఉన్న వాహనాల్లోనే ఉంది. కానీ, బజాజ్‌ ఫోకస్‌ వీటిపై లేదు కనుక ఈ కంపెనీపై ఇదేమంత ప్రభావం చూపించదు. 

 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
ఏడాది కాలానికి లక్ష్యం రూ.500. దేశ ప్రజల్లో బీమా కవరేజీ ఇప్పటికీ 8 శాతంగానే ఉంది. దేశంలో జీవిత బీమా విస్తరణ జీడీపీలో 2.76 శాతంగానే ఉంది. అంతర్జాతీయంగా ఇది 3.33 శాతం. దేశంలో పనిచేసే వారి సంఖ్య పెరుగుతుండడం, అధిక వినియోగ ఆదాయం, ఆర్థిక అవగాహన రానున్న సంవత్సరాల్లో బీమా పరిశ్రమకు మంచి వృద్ధికి దారితీస్తుంది. యులిప్‌ పాలసీల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ కీలక స్థానంలో ఉంది. You may be interested

మీ చిన్నారుల భవిష్యత్తుకు ‘సిప్‌’

Friday 16th August 2019

తల్లిదండ్రులకు తమ పిల్లల విషయంలో ఎన్నో ఆనందాలు ఉంటుంటాయి. అదే సమయంలో బోలెడన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. కేవలం వారి ప్రస్తుత అవసరాలను చూడడమే కాకుండా, వారి భవిష్యత్తుకు తగిన ప్రణాళికలు కూడా రెడీ చేసుకోవాలి. ద్రవ్యోల్బణ పరిస్థితులు, భవిష్యత్తులో విద్య పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్కూలు ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, రవాణా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను ఎంతగానో ప్రభావితం చేస్తాయనడం

స్వల్పకాలంలో సిప్‌ రాబడులు తగ్గినా మంచిదే.

Thursday 15th August 2019

స్వల్పకాలానికి సిప్‌ మీద వచ్చే రాబడులు తగ్గితే మంచిదేనని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ పాండే అంటున్నారు. సిప్‌లపై ప్రతికూల రాబడి వస్తున్నప్పుడు సిప్‌ పెట్టుబడి మొత్తాన్ని లేదా సిప్‌ల సంఖ్యను పెంచాలని పాండే తెలిపారు. ఎందుకంటే మార్కెట్‌ రికవరీ అయిన్పడు, మొత్తం పెట్టుబడిపై రాబడి ఎక్కువగా ఉంటుందని పాండే అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లో ఏర్పడిన కరెక‌్షన్‌ కారణంగా సమర్థవంతమైన వ్యాపారాలు, స్థిరమైన నగదు ప్రవాహం కలిగి నాణ్యమైన కంపెనీలకు

Most from this category