News


రెండంకెల రాబడి కోసం ఐదు షేర్లు

Monday 22nd October 2018
Markets_main1540193924.png-21360

మార్కెట్లో బౌన్స్‌ బ్యాక్‌ మరో వారం కొనసాగకపోవచ్చని నార్నోలియా బ్రోకరేజ్‌ అభిప్రాయపడింది. అయితే దీర్ఘకాలంలో సూచీలు బుల్లిష్‌గా ఉంటాయని తెలిపింది. లాంగ్‌టర్మ్‌లో రెండంకెల రాబడినిచ్చే ఐదు షేర్లను సిఫార్సు చేసింది.
1. కోల్‌ ఇండియా: టార్గెట్‌ రూ. 322. స్టాప్‌లాస్‌ రూ. 254. స్వల్పకాలిక కన్సాలిడేషన్‌ అనంతరం పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. కొన్ని రోజులుగా హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ఫార్మేషన్‌ ఏర్పరుస్తోంది. దిగువన రూ. 276 స్థాయిల్లో డబుల్‌బాటమ్‌ ఏర్పరుచుకుంది. ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. పుల్‌బ్యాక్‌ కనిపించవచ్చు.
2. యాక్సిస్‌ బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 650. స్టాప్‌లాస్‌ రూ. 512. ఊర్ధ్వముఖ వాలు చానెల్‌లో పయనిస్తూ ఉంది. రూ. 677 వద్ద గరిష్ఠాలను తాకి, రూ. 550 స్థాయిలకు వేగంగా పడిపోయింది. దిగువన 545-555 రూపాయల వద్ద బలమైన మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం 200 రోజుల డీఎంఏ స్థాయికి పైన ట్రేడవుతూ పాజిటివ్‌గా మారింది. త్వరలో అప్‌మూవ్‌ ఆరంభం కానుంది.
3. గ్లెన్‌మార్క్‌ ఫార్మా: టార్గెట్‌ రూ. 660. స్టాప్‌లాస్‌ రూ. 548. అధోముఖ వాలు రేఖ వద్ద కదలాడుతూ మద్దతు ఏర్పరుచుకుంటోంది. వీక్లీ చార్టుల్లో బౌన్స్‌ బ్యాక్‌ లక్షణాలు చూపుతోంది. ఎంఏసీడీ తదితర ఇండికేటర్లు కూడా పాజిటివ్‌గా మారాయి.
4. ఫ్యూచర్‌ రిటైల్‌: టార్గెట్‌ రూ. 550. స్టాప్‌లాస్‌ రూ. 458. చార్టుల్లో పోల్‌ అండ్‌ ఫ్లాగ్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ సాధించే యత్నాల్లో ఉంది. డైలీ చార్టుల్లో పాజిటివ్‌ క్రాసోవర్లు కనిపిస్తున్నాయి. 
5. లుపిన్‌: టార్గెట్‌ రూ. 970. స్టాప్‌లాస్‌ రూ. 830. ఇటీవల రూ. 971 వరకు ఎగబాకి దిగ్గున రూ. 774కు పడిపోయింది. కొంతకాలంగా కన్సాలిడేట్‌ అవుతోంది. ప్రస్తుతం తిరిగి అప్‌మూవ్‌ ప్రయాణం ఆరంభించే ప్రయత్నాలు చేస్తోంది. ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. రూ. 830కి పైన కొనసాగినంత కాలం పాజిటివ్‌గానే ఉంటుంది. 



You may be interested

విదేశీ ఇన్వెస్టర్ల నుంచి మరిన్ని అమ్మకాలు

Monday 22nd October 2018

ఫెడరల్‌ రిజర్వు డిసెంబర్‌లోనూ వడ్డీ రేట్లను 2.5 శాతానికి పెంచవచ్చనే అంచనాలున్నాయి. ఫెడ్‌ రేటు 2019లో 3 శాతానికి, 2020 నాటికి 3.5 శాతానికి చేరే అవకాశముంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి మరిన్ని నిధులను వెనక్కు తీసుకెళ్లొచ్చని ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీ సంస్థ విలియమ్‌ ఓనీల్‌ అండ్‌ కో ప్రెసిడెంట్‌, సీఈవో స్టీవెన్‌ బిర్చ్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  విదేశీ

వివో వీ9పై రూ.8,000 డిస్కౌంట్‌

Monday 22nd October 2018

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ వివో.. వీ9 స్మార్ట్‌ఫోన్‌ ధరను మళ్లీ తగ్గించింది. ఫోన్‌ ధరను తగ్గించడం ఇది మూడోసారి. కంపెనీ వీ9 ఫోన్‌ను రూ.23,990 ధరతో తొలిగా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వివో తర్వాత దీని ధర రూ.3,000 తగ్గించింది. అప్పుడు ఇది రూ.20,990 అందుబాటులోకి వచ్చింది. అటుపైన మళ్లీ ఫోన్‌ ధరను రూ.2,000 తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఈ వీ9 స్మార్ట్‌ఫోన్‌ రూ.18,990కి కస్టమర్లకు

Most from this category